Thursday, January 31, 2013

బాయ్స్ ఆల్

       డ్రాయింగ్ పుస్తకం, రంగు పెన్సిళ్ళు, క్రేయాన్లు తీసుకొచ్చి కాఫీ టేబుల్ దగ్గర కూర్చున్నాడు బుజ్జిపండు. ఒక కాగితం మీద ముందుగా ఒక నిలువు గీత, దానికి పది అడ్డం గీతలు, ఒక్కో గీతకు అటో ఐదు, ఇటో ఐదు మొత్తం పది సున్నాలు చుట్టాడు. “అమ్మా, లుక్ లుక్...” పిలిచాడు పండు. కాఫీ తాగుతూ లాప్ టాప్ లో నెట్ బ్రౌజ్ చేస్తున్న వైష్ణవి, పండు వైపు చూసింది. “ట్రీ డ్రా చేశాను బావుందా?” అడిగాడు. బొమ్మ వైపు చూస్తూ “చాలా బావుంది నాన్నా” చెప్పింది వైష్ణవి. పండు తృప్తిగా బొమ్మను చూసి ఒక్కో సున్నాకి ఒక్కో రంగు వేయడం మొదలెట్టాడు. “అన్నట్టు, ఈ శనివారం రిత్విక్ పుట్టినరోజు నాన్నా....నువ్వు బొమ్మ వేయడం పూర్తవగానే మనం ‘టాయ్స్ రస్’ కి వెళ్ళి తన కోసం మంచి బొమ్మ కొందాం” చెప్పింది వైష్ణవి. ‘టాయ్స్ రస్’ పేరు వినగానే బుజ్జి పండు మొహం విప్పారింది. 

మిగిలిన విశేషాలు కౌముదిలో పత్రికలో చదువుదాం. 







9 comments:

  1. లాస్ట్ లైను చదివిన వెంటనే ఫక్కున నవ్వు వచ్చింది. కానీ నిజమే కదా. బాగా వ్రాసారు.

    SJ

    ReplyDelete
    Replies
    1. స్ జె గారు ధన్యవాదాలండి.

      Delete
  2. వెరీ నైస్! బాగున్నాయండీ పండు(తో) కబుర్లు...

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశగారు ధన్యవాదాలండి.

      Delete
  3. "బాయ్స్ ని విష్ణుమూర్తి లాగా.... "

    నవ్వాపుకోలేకపోయానంటే నమ్మండి..

    నిజంగా బుజ్జి పండుకి భలే ఆలోచనలు వస్తాయిగా... :-)

    ReplyDelete
    Replies
    1. మాధవి గారు షాపులలో కనిపించే ప్రతి వస్తువులో అమ్మాయిలకు, అబ్బాయిలకు రంగు దగ్గరర్నుండి..డిజైన్ల నుంచీ అన్నీ తేడాలే. ముఖ్యంగా అమెరికాలో. ఒక బుజ్జిపండుకు చాలా కోపం వచ్చి ఈ 'బాయ్స్ ఆల్' గురించి చెప్పాడు. ఆ అభిప్రాయలే నేను రాసానండి. ఈ స్త్రీ, పురుష పక్షపాతం ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళను కూడా ఎలా బాధిస్తుందో ఈసారి పిల్లల సెక్షన్ వెళ్ళి చూడండి. ధన్యవాదాలు.

      Delete
  4. మీరు ఈ బ్లాగులో టపా వేయకముందే, కౌముది ఈ నెల సంచిక రాగానే మొట్ట మొదటగా వెతికి మరీ చదివేశాను మన బుజ్జిపండు కబుర్లు. చిన్నపిల్లల చేష్టలు భలే ముద్దుగా వుంటాయి. అందులో మీరు వ్రాసే తీరు చాలా బాగుంది. కామెంటు పెట్టడంలోనే కాస్త ఆలస్యమయింది :(

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞా నీ అభిప్రాయం తెలియజేసావు చాలా సంతోషం. కొత్త ప్రయోగం చేస్తున్నాను కదా..ఎలా ఉందా అన్న సందేహం కలిగింది. నీ వ్యాఖ్య చూడగానే చాల సంతోషించాను. ఇలాంటి వ్యాఖ్యలే వ్రాయడానికి స్ఫూర్తిని కలిగిస్తాయి. ధన్యవాదాలు.

      Delete
  5. ధన్యవాదాలు బాబాయిగారు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.