Monday, February 11, 2013

తెలుగులో టైప్ చేయడం ఎలా..

  తెలుగులో టైప్ చేయడానికి చాలా ఉపకరణాలు ఉన్నాయి. నాకిది తేలికగా అనిపించింది.

  ఈ లింక్ మీద నొక్కినప్పుడు అది వేరే పేజీకి తీసుకెళుతుంది. అక్కడ తెలుగును ఎంచుకుని I agree మీద చెక్ చేసి డౌన్ లోడ్ మీద నొక్కాలి.  


డౌన్ లోడ్ అయిన ఫైల్ మీ ఫైల్స్ లో వుంటుంది.   

ఆ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఈ రన్ డయలాగ్ వస్తుంది. Run మీద నొక్కి అప్లికేషన్ ఇన్స్టాల్ చెయ్యాలి. 

ఇన్స్టాల్ చేసాక కీ బోర్డ్ మీద shift, alt రెండూ ఒక్కసారి నొక్కితే కుడి వైపు మూల    ఇలా కనిపిస్తుంది 

ఇప్పుడు ఎక్కడ ఇంగ్లీషులో టైప్ చేసినా అది తెలుగులోకి మారుతుంది. 

    మనం రాస్తున్నప్పుడు పదం సరిచూసుకోవడానికి వీలుగా డ్రాప్ డౌన్ విండోలో నాలుగు పదాలు వస్తూ ఉంటాయి. నాకు ఇందులో బాగా నచ్చిన మరో అంశం కొన్ని అక్షరాల కోసం ప్రతిసారి షిఫ్ట్ నొక్కే అవసరం లేకపోవడం.

    ముఖ్యంగా బ్లాగులో, ఫేస్ బుక్ లో వ్రాసుకోవడానికి, వ్యాఖ్య పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఎక్కడో రాసి దాన్ని కాపీ చేసి  వేరే దగ్గర పెట్టకుండా ఒకే దగ్గర టైప్ చేసుకోవచ్చు. మైక్రో సాఫ్ట్ వార్డ్ కాని, నోట్ పాడ్ కాని ఎక్కడైనా తెలుగులో సులువుగా టైప్ చెయ్యొచ్చు.

    లేఖిని కూడా వాడొచ్చు కాని తెలుగు టైప్ చేయడానికి ప్రతిసారి ఆ పేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం వ్రాసిన విషయాన్ని కాపి చేసి వేరొకదగ్గర పేస్ట్ చెయ్యాలి. తెలుగు ఇప్పటివరకూ టైపు చెయ్యని వారు లేఖినిలో ఇచ్చిన ఇంగ్లీషు అక్షరాల ఆధారంగా తెలుగులో ఎలా టైపు చెయ్యాలో నేర్చుకోవచ్చు.

http://lekhini.org/



15 comments:

  1. మంచి చిట్కా. బాగున్నది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు తెలుగు భావాలు గారు.

      Delete

  2. మొత్తం మీద మీరూ గూగుల్ ఐ ఎం ఈ కి వచ్చేసారన్న మాట జిలేబీ లా!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. ఎప్పట్నుంచో వాడుతున్నాను జిలేబి గారు. తెలుగు టైప్ చేసే వాళ్ళందరికీ ఇది తెలుసనే అపోహలో వున్నాను. నిన్న ఫేస్ బుక్ లో ఎవరో అడగడం చూసి ఈ పోస్ట్ వ్రాసాను. ఎక్కడో వ్రాసి కాపీ పేస్ట్ చెయ్యడ౦ చాలా కష్టం కదా...ధన్యవాదాలు.

      Delete
  3. చాల బాగుందండి ...కృతజ్ఞతలు

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజుగారు నా బ్లాగుకు స్వాగతం. ధన్యవాదాలండి.

      Delete
  4. ేోీగుోో గల గతోో నోేూదల్గ
    Nenu install chesi type chestunte aksharaalu ilaa vastunnaayi.
    Pl help me
    -Goutham, Hyderabad

    ReplyDelete
    Replies
    1. గౌతమ్ గారు మీరు దేన్లో టైప్ చేస్తున్నారు? 'ఇన్ డిజైన్'లో కాని 'అడోబే పేజ్ మేకర్' లో కాని టైపు చేస్తుంటే అలా రావచ్చు.

      Delete
  5. బాగుంది జ్యోతి గారు.ఈజీ పద్దతి హార్డ్ వేర్ అతన్ని పిలిచి దౌన్లోడ్ చేయించుకోవడం.
    నాకు తెలీదు కదా

    ReplyDelete
    Replies
    1. శశి గారు వేరే వాళ్ళను పిలవనవసరం లేదండి. మీరు ప్రయత్నించి చూడండి. తెలీకనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

      Delete
  6. చాల సౌకర్యంగా వుంది జ్యోతిర్మయి గారు. మీ సలహాకు కృతజ్ఞతలు.

    ReplyDelete
    Replies
    1. మీకు ఉపయోగపడింది కదా..చాలా సంతోషం.

      Delete
  7. థాంక్స్ అండి. చాలా ఉపయోగకరంగా ఉంది.

    -సంతోష్

    ReplyDelete
  8. చాలా థాంక్స్ అంది

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.