మూడేళ్ళ క్రితం పండునెవరైనా “పెద్దయ్యాక నువ్వేం అవ్వాలనుకుంటున్నావ్?” అనడిగితే వెంటనే వాడు ఆకాశం వైపు చూస్తూ “బర్డ్ అవుతా” అని చెప్పేవాడు. ఒక్కోసారి “అక్కనౌతా” అని కూడా అనేవాడనుకోండి. మరి అక్కయితేనే కదా రంగు రంగుల ఫ్రాక్స్, గోళ్ళకు ఎర్రెర్రని నెయిల్ పాలీషు వేసుకుని, ఎంచక్కా కిచెన్ సెట్ తో ఆడుకునేది. మరో ఏడాది తర్వాత అదే ప్రశ్నకి “ఆస్ట్రోనాట్ అవుతా” అని చెప్పాడు. అది వినగానే వాళ్ళ బాబాయి “అయితే మేము ఫ్లోరిడాలో ఇల్లు కొనుక్కుంటాం పండూ, నువ్వు స్పేస్ కి వెళ్ళేప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వీలుగా వుంటుంది” అంటూ వాడి నెత్తిమీద చిన్న జెల్లకాయ వేశాడు. ఇప్పుడేమో ఇంటికొచ్చిన తాతయ్యొకరు ఆ ప్రశ్న అడగ్గానే పండు టక్కున చెప్పిన సమాధానం విని, ప్రేమగా కొడుకు తల నిమిరింది వైష్ణవి. వాడేం సమాధానం చెప్పాడో కౌముదికి వెళ్ళి పెద్దయ్యాక నేను...చదివి తెలుసుకుందాం.
LOL. ఇక్కడ మిషిగన్‌లో పిల్లల అభివృద్ధి గురించి ఒక రేడియో షోకి ముందు రకరకాల పిల్ల గొంతులు వాళ్ళు పెద్దయ్యాక ఏమవ్వాలి అనుకుంటున్నారో చెబుతాయి. అందులో ఓ పిల్లాడు - "I Want to be Batman" అన్నప్పుడల్లా నాకు అప్రయత్నంగా నవ్వొస్తు ఉంటుంది. బైదవే, నా చిన్నప్పుడు నా కల రైలింజను డ్రైవర్ అవ్వాలని.
ReplyDeleteచిన్నప్పటి కలలు, ఆ రోజులు అన్నీ తీపి జ్ఞాపకాలే.
Deleteరైలింజన్ డ్రైవర్ అన్నప్పుడల్లా నాకు రంగనాయకమ్మ గారి విమల గుర్తొస్తుంది. :)
థాంక్యు నారాయణ స్వామి గారు.
ఈ సారి బాగా భయపెట్టేసారు జ్యోతి గారూ. అసలు టాపిక్ ఏవిటో మర్చిపోయి, ఇప్పుడు చింటుకి ఏమి అవుతుందో అని కంగారు పడ్డాను చివరి దాకా.
ReplyDeleteఈ రాత్రి వెలుగు చూస్తుందా...అనుకున్నక్షణ౦ ఇప్పటికీ వణికిస్తుంది. జీవితమే ముగింపులేని కథలా అయిపోయేది. థాంక్యు స్ఫురితగారు.
Deleteకౌముది లో మీ బుజ్జి పండు నాకు బాగా నచ్చాడండీ! వాడే ఈ రోజు నాకు మీ బ్లాగ్ పరిచయం చేసాడు. చాలా చాలా బాగా రాస్తున్నారు.
ReplyDeleteస్వాగతం మమత గారు. మీకు బ్లాగు చూపించినందుకు పండుకివాళ స్వీట్ తినిపించాలి. థాంక్యు.
Deleteబుజ్జి పండు కథనం నిజంగా జరిగిందా!ఎవరండి ఆ పండు. కథనం ఆసక్తికరం . బుజ్జి నిజమైతే అంతా మంచి జరగాలి .
ReplyDeleteఅదొకప్పటి సంగతిలెండి రవిశేఖర్ గారు. ప్రస్తుతం ఎల్లారు సౌఖ్యమే. మీ అభిమానానికి ధన్యవాదాలు.
DeleteSuppperro super jyothirmayi gaaru...veru niccce.. :-):-)
ReplyDeleteథాంక్యు కార్తీక్
Deleteఇప్పుడిప్పుడే మీ రచనలు వరుసగా చదువుతూ వస్తున్నా.ఇక్కడ నిజంగానే భయ పెట్టేశారు.అంతకు ముందు తెలుగు బడి కబుర్లు సంతోష పెట్టాయి.కొన్నాళ్ళకు తెలుగు నేర్చుకోవడానికి విదేశాలు రావాల్సి వస్తుందేమో...
ReplyDeleteమీ వ్యాఖ్య చూసుకోలేదండి. మీరు ఇంకా బ్లాగు చదువుతున్నట్లయితే పాఠశాల అభివృద్ది తెలుస్తూనే ఉండి ఉంటుంది. ధన్యవాదాలు.
Delete