దోగాడడం రాగానే బిరబిరా వంట గదిలో స్టీలు గిన్నెల దగ్గరకు వెళ్ళేవాడ్ని. వాటిలో నా మొహం పొడవుగా, అడ్డంగా తమాషాగా కనిపించేది. అమ్మలా వంట చేయాలని గిన్నెలో గరిటె పెట్టగానే, "ఆడపిల్లలా ఈ ఆటలేంటి?" అంటూ పక్కన కూర్చోబెట్టి బంతిని చేతిలో పెట్టేది నాన్నమ్మ. అదెక్కడ నిలిచేది దొర్లుకుంటూ ఎటో పోయేది. పైగా స్టీలు గిన్నెలా అది చమక్ చమక్ మనేదికాదు! ఒళ్ళుమండి దాన్ని పట్టుకుని గట్టిగా ఒక్క తన్ను తన్నగానే "ఎంతైనా మగపిల్లాడి అల్లరే వేరబ్బా" అనేసేది గిరిజత్త.
కొంచెం పెద్దయ్యాక నన్ను, పూజని, రోజక్కని అమ్మ బజారుకు తీసుకువెళ్ళేది. వాళ్ళిద్దరికీ రంగు రంగుల గౌనులు, క్లిప్పులు, గాజులు, పట్టీలు, చెప్పులు అలా ఏమిటేమిటో కొని పెట్టేది. నాకు మాత్రం సన్న సన్న గీతలు, గళ్ళు వుండే చొక్కాలు కొనేది. పెద్ద పెద్ద పువ్వుల చొక్కాలు కొన్నప్పుడు మాత్రం మహా సంబరంగా ఉండేదిలే. అయినా ఎప్పుడూ చొక్కాలు, నిక్కర్లు, పేంట్లే. వాళ్ళకు మాత్రం గౌనులు, గాగ్రాలు, చుడీలు, పట్టులంగాలు, వాటిమీద చేమ్కీలు, అద్దాలు, తళుకులు, పూసలు, ఇంకా పేంట్లు, చొక్కాలు. ఆ బట్టలు వేసికుని ఇద్దరూ యువరాణీల్లా మెరిసిపోతుండేవాళ్ళు. ఏడుపొచ్చి కాస్త గట్టిగా ఏడవగానే, "ఆడపిల్లలా ఆ ఏడుపేంటి?" అంటూ కసిరేది సీత పిన్ని.
మరికొంచెం పెద్దయ్యాక పుస్తకాల్లోంచి తల పైకెత్తితే చాలు ఏదో ఒక పని, నా ఖాళీ సమయమంతా షాపుల చుట్టూ తిరగడానికే సరిపొయ్యేది. జీవితం మొత్తమ్మీద ఓ టన్ను అల్లం, మూడు టన్నుల మిరపకాయలు, పదహారు టన్నుల టమోటాలు తీసుకొచ్చుంటాను. ఏమన్నా అంటే "ఇంట్లో మొగపిల్లోడివి నువ్వు కాకపోతే ఎవరు తెస్తారు?" అనే మాట వినీ వినీ చెవులు చిల్లులు పడి పోయాయి. నేనేమో ఎర్రటి ఎండలో తిరగడం. రోజక్క మాత్రం చల్లని పిండిలో చేతులు పెట్టి పొత్రం నైసుగా తిప్పుతూ ఆటలు.
డ్రాయింగ్ లో మొదటి బహుమతి వచ్చిన రోజు ఊరు వాడా అందరూ మెచ్చుకున్నారు. తెల్లారి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గు వేస్తానంటే మాత్రం కిసుక్కున నవ్వారు. అందంగా ఉన్నాయని నర్సరీ నుండి పూల మొక్కలు తెచ్చి నాటితే "అబ్బో వీడికి మొక్కలంటే ఎంత ఇష్టమో!" అన్నవాళ్ళే "పూలు కట్టడం నేర్పమంటే" నువ్వేమన్నా ఆడపిల్లవా అని ఎకసెక్కాలు.
అక్కయ్య నెలకోసారి ఒంట్లో బాగాలేదని సుబ్బరంగా మంచమెక్కి పడుకునేది. అన్నం, పళ్ళు, పాలు సమస్తం మంచం దగ్గరకే వచ్చేవి. నేను కాళ్ళు నొప్పులు అంటే "నీ వయస్సులో మేము మైళ్ళు మైళ్ళు నడిచేవాళ్ళం నువ్వేంట్రా క్రికెట్ ఆడే అలసిపోతావు?" అనేవాళ్ళు.
పదో తరగతి పాసవ్వగానే మంచి కాలేజిలో సీటు వస్తుందో లేదోనని ఇంట్లో అందరికీ టెన్షనే. రోజక్క కాలేజికి వెళ్లేముందు ఇంత హడావిడి లేదు. ఏమంటే " అక్కయ్యకు సీట్ రాకపోతే ఏ డాక్టర్ నో ఇంజనీర్ నో అల్లుడుగా తెచ్చుకుంటాం. నువ్వు చదవకపోతే ఎలారా?" అని సమాధానం.
కాలేజ్ లో అబ్బాయిలు, అమ్మాయిల వెంట పడేది వాళ్ళ అందం చూసి కాదు తాము వేసుకోలేక పోయిన రంగు రంగుల బట్టలు చూసి అని ఎప్పటికి తెలుసుకుంటారో!
రోజక్క పెళ్ళి కుదిరింది. గోరింటాకు పెట్టించుకోవడం, వచ్చిన చుట్టాలతో కబుర్లు చెప్పడంతో పూజ బిజీ. నేనేం చేశానంటారా! అడక్కండి. వీధిలో తిరిగి తిరిగి మగపెళ్ళి వాళ్ళకు మర్యాదలు చేసి చేసి బొగ్గులా అయ్యానని అమ్మమ్మ అన్నప్పుడు కాని అద్దంలో ముఖం చూసుకోవడానికి కూడా ఖాళీ దొరకలేదు. అక్క పెళ్ళిలో సరేలేవయ్యా నీ పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేసేవుంటావ్ గా అనుకుంటున్నారా?
నాకు పెళ్ళి కుదిరాక అమ్మని షాపింగ్ కి వెళ్దామని పిలిచినా "మీ షర్ట్లు నాకేం తెలుస్తాయిరా? నీ ఫ్రెండ్స్ తో వెళ్లి తెచ్చుకో, పైగా ఇవాళ కోడలికి నగలు చూడడానికి వెళ్తున్నాం" అని చెప్పేసింది. ఇంత అన్యాయమా!
అమెరికాలో ఉద్యోగం వచ్చింది, "ఇద్దరం కలిసే వెళ్తాం" అంటే "దేశం కాని దేశంలో ఏం ఇబ్బంది పడతారు. నువ్వు కొంచెం ఇల్లు అదీ ఏర్పరుచుకున్న తరువాత అమ్మాయిని తీసుకెళ్ళు" అని ఒంటరిగా పంపేసారు. చిన్నప్పటినుండి కాఫీ కూడా కలపడం నేర్పలేదు కాని ఇప్పుడు ఇక్కడ ఎలా ఒండుకుని తింటాననుకున్నారు? ఆకలేస్తే వెళ్ళడానికి దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్ కూడా లేదు. వెళ్ళడానికి కారులేదు. దగ్గరలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో నాలంటి శాఖాహారికి తినడానికి ఏమీ దొరకదు. సరే ఎలాగో కష్టపడి ఒక ఇల్లు చూసి కారు కొన్నాక నా భార్య మాహారాణిలా వచ్చింది. అమెరికా విచిత్రాలన్నీ చూస్తూ వారానికో నాలుగు రోజులు రెస్టారెంట్ లో భోజనం చేస్తూ పూటకో మాటు "అమ్మా బెంగగా వుందే" అని వాళ్ళమ్మకు ఫోను.
నాలుగురోజులు సెలవు రాగానే స్నేహితులతో కలసి వెకేషన్ అంటూ ఎటో అటు ప్రయాణం. కారులో ఆడాళ్ళు హాయిగా నిద్ర పోతుంటే తెలిసి తెలియని ఊర్లకు దారి వెతుక్కుంటూ చీకట్లో డ్రైవింగ్. అక్కడ గుర్రాలెక్కి తిరగడం, స్నార్క్లింగ్, స్కూబా డైవింగ్ అంటూ మొహానికి మాస్క్ పెట్టుకుని నీళ్ళ లోపలకు వెళ్ళడం. అడ్వెంచరెస్ రైడ్స్ అంటూ తల కిందులుగా పాతిక అడుగుల నుండి కింద పడడం. ఒకటా! గుండెలో బిక్కు బిక్కు మంటున్నా పైకి బింకంగా కనిపించాలి. మగాళ్ళం కదా!
నేను తండ్రిని కాబోతున్నానని తెలిసి స్వీట్ మా ఆవిడకిచ్చేవాళ్ళు. నాకు మాత్రం "అమ్మాయిని బాగా చూసుకో, ఏ పనీ చేయించకు" అని జాగ్రత్తలు. అప్పటికావిడ లంకంత కొంపలో మందీ మార్బలానికి వండి వార్చి మహా కష్టపడి పోతున్నట్లు. వంశోద్దారకుడు కావాలని అందరికీ కోరికే. వంశభారం అంతా మొయ్యాలికదా!
నా పుత్రరత్నం పుట్టగానే మా ఆవిడకు మూడు నెలలు మెటర్నటీ లీవు. నేనేమో డ్రైవర్, గోఫర్ గా ఓవర్ టైం చెయ్యడం. అర్ధం కాలేదా మా ఆవిడ గంటకోసారి "గోఫర్ దిస్, గో ఫర్ దట్" అంటూ బయటకు తరిమేస్తూ ఉంటుందిలెండి. చిన్నప్పుడు టన్నుల టన్నుల కూరగాయలు తెచ్చానా, ప్రస్తుతం వేగన్లు వేగన్లు డైపర్లు, గర్బర్ ఫుడ్ లు తెస్తున్నాను.
ఇంతలో "పూజక్క కూతురికి ఓణీలివ్వాలి మీరిండియా రండి. బాబుని కూడా అందరం చూసినట్లుంటుందని" అమ్మ ఫోను. "ఇక్కడనుండి నీకైమైనా కావాలా?" అని అడిగాను. మా అమ్మకు కొరల్ సెట్లు, బెడ్ షీట్లు, జంషోలో పూసలు ఇష్టం లెండి. తనకే కాక చుట్టుపక్కల అందరికీ తెమ్మటుంది. "నాకేమొద్దుగాని మీ అక్కకూతురికే మనం బంగారం పెట్టాలి" అంది. "ఎంతమా ఓ కాయిన్ తీసుకురానా?" అని అడిగాను. వడ్డాణానికి ఓ కాయినేం చాలుద్ది పదో, పన్నెండో కాయిన్లు తీసుకురా. అన్నట్టు ఇప్పుడు పూజకు ఐదోనెల సీమంతానికి బంగారు గాజులు పెడదాం" అన్నది.
ఇండియా వెళ్ళగానే "ఏం నాయినా అక్కడ్నే ఉంటారా ఏంది? ఒక్కడివే పిల్లోడివైతివే మీ అమ్మా నాయన్నుచూసుకోబళ్ళా. తొందరగా రండి" అంటూ నారాయణ తాత చీవాట్లు.
ఓరి దేముడోయ్! మగవాడిగా పుట్టడం కంటే మర్రిచెట్టుగా పుట్టినా ఎంతో సుఖం.

ReplyDeleteవామ్మో వామ్మో ఇంత లా కష్టాలా 'మగ రాయుళ్ళ కి !!|' 'గోఫర్' గాడు !! (ఓరి దేముడోయ్ !)
భంశు !
జిలేబి
కదా పాపం జిలేబి గారు.
Deleteమళ్ళీ ఆ ఆడపిల్ల లా అ బ్లాగింగేమిట్రా!? చి న
ReplyDeleteమర్చినపోయిన ఇంకో బాధను గుర్తుచేశారు అనిల్ గారు.
DeleteSuper andi ....nenu kuda mee lane think chesnu andi.
ReplyDeleteఇంత వివక్ష తగదు. కదా విజయ్ గారు. థాంక్యు
DeleteMaga pillalaki kashtaalaa.....unnaaa.. ilaa aadallalaa paiki cheppestaamemiti?
ReplyDeleteఇదోటి కదూ! అన్నీ మనసులోనే దాచుకోవాలి పాపం.
Deleteనవ్వుతూనే ఆలోచిస్తున్నా.. నాకు తెలిసిన 'గోఫర్ ' లందరూ గుర్తొచ్చారోక్షణం. నచ్చిందండీ.
ReplyDeleteఆలోచించారా! ఆశయం నెరవేరినట్లే. థాంక్యు
Deleteహహహ చాలాబాగుందండీ జ్యోతిర్మయి గారు.. నిజమే ఎన్ని కష్టాలో.. మా అబ్బాయిలందరి తరఫున వకాలత్ పుచ్చుకున్నందుకు బోలెడన్ని ధన్యవాదాలండీ :-)
ReplyDeleteమరి మా ఇంట్లో యాభై శాతం వాళ్ళే కదండీ. వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా వేణు గారు. థాంక్యు.
Deleteఇంట్లో అమ్మాయిలు లేకపోవడంతో తెలియలేదు గానీ అమ్మో అమ్మో అబ్బాయిలకి ఎన్ని కష్టాలో!
ReplyDeleteకొంచెం పెద్దయ్యాక నన్ను, పూజని, రోజక్కని అమ్మ బజారుకు తీసుకువెళ్ళేది. వాళ్ళిద్దరికీ రంగు రంగుల గౌనులు, క్లిప్పులు, గాజులు, పట్టీలు, చెప్పులు అలా ఏమిటేమిటో కొని పెట్టేది. నాకు మాత్రం సన్న సన్న గీతలు, గళ్ళు వుండే చొక్కాలు కొనేది.
ఇప్పుడు మా ఆవిడకి నాకు షాపింగ్ చేసుకునేటప్పుడు ఇదే అనుకుంటూ ఉంటాను నేను, నాకేమో రెండు చొక్కాలు, ఒకటి లేదా రెండు పాంట్లు, ఆమెకేమో టాపులు, కుర్తాలు, చీరెలు, సల్వార్లు, ఇవన్నీ కాక మాచింగ్ అక్సేసరీలు. మా పుత్రరత్నం పుట్టి మూదేల్లైన ఇప్పటికీ నా పని డ్రైవర్-కం-బిల్ పేయర్ :( ఈ జన్మకింతే
రోజులు మారుతున్నాయి లెండి. ప్రముఖుల పెళ్ళి వీడియోలు చూస్తె ఆ విషయం నమ్మకంగా తెలుస్తోంది.
Deleteరోజులు ఏమీ మారడంలేదండీ, ఈ మధ్యనే మా మరదలు వచ్చింది, రోజూ ఆ అమ్మాయి అలంకరణ చూస్తే నాకు మతి పొతోంది :) సరదాగా అంటున్నాలెండి
Deleteఇంతేనా... ఇంకా బోలెడున్నాయి అబ్బాయిల కష్టాలు. వీలుంటే నేనూ వ్రాసెయ్యాలనిపించింది చదువుతూ ఉండగానే! :) వ్రాస్తాను, first-hand అనుభవాలను.
ReplyDeleteరాసేయండి మరి ఆలస్యం ఎందుకు? ఎదురు చూస్తూ ఉంటాం.
DeleteGreat revelations and true!
ReplyDeleteThank you Harinath garu.
Deleteజోతిర్మయి గారు,
ReplyDeleteఎండల దెబ్బకి అల్లాడుపోతున్న నాకు ఈ పోస్ట్ చదివిన తర్వాత వర్షం కురిసినపుడు వచ్చే ఫీలింగ్ కల్గిందండీ... చాలా అహ్లదకరముగా ఉంది మీ బ్లాగు....
ఇక నుండి రెగ్యూలర్ గా ఫాలో ఆవుతా మీ బ్లాగును....