Tuesday, November 17, 2015

ఏవిటండీ ఈయన...

       ఇప్పుడూ... మనకు మెర్సిడస్ ఫైవ్ సిరీస్ కావాలంటే ఏం చేస్తాం? లేదూ అబ్బా యికి మంచి సంబధం రావాలంటే ఏం చేస్తాం? ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ఏం చేస్తాం? అర్ధం కాలేదా సత్యనారాయణ వ్రతం కదా చేస్తాం. పైగా కోరిక కోరడం కోసం కాదు, అది తీరిందన్న కర్ఫర్మేషన్ వచ్చేకే కదా చేస్తాం. ఇండియాలో సంగతేమో గాని అమెరికాలో మేం ఏడాదికొక్కసారి ఓ కోరికల లిస్ట్ పెట్టుకుని, అందులో కొన్ని తీరినవి మరొకొన్ని తీరవలసినవి ఉండేలా జాగ్రత్త చేసుకుని తెలిసిన వారినందరినీ పిలిచి సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం.

     మన పెద్ద వాళ్ళు మన కోరికలు తీర్చుకోవడానికి ఇంత సులభ మార్గం చెపితే... ఈయనేమిటండీ ఇలా అంటున్నారూ...ఒకటే కన్ఫ్యూజనూ...


16 comments:

  1. ఆయనెప్పుడూ అంతేనండీ :)

    ReplyDelete
    Replies

    1. శర్కరి వారు,

      ఇవన్నీ "ఆండోళ్ళ కి తెలిసి నంత గా ఈ మగ రాయుళ్ళ కి తెలీవండి ! కాబట్టి ఆయన మాటలేమీ మీరు పట్టించు కో మాకండీ ! వారి మాటలన్నీ బ్బే బ్బే బ్బే !
      మీరు చెప్పిందే సబబు :)

      జిలేబి

      Delete
    2. అవునండీ మురళి గారు ఏదో నలుగురితో పాటు నారాయణా అనకుండా, కుండలు బద్దలు కొట్టేస్తుంటారు.

      Delete
    3. జిలేబి గారు,

      ఆండోళ్ళ కి, మగ రాయుళ్ళకి తేడా లేదంటున్నారండీ ఈయన. మన సమానత్వపు పోరాటం మోజు తీరేదట్లా, అన్యాయం కదూ!

      Delete
  2. ఐతే మనం వ్రతాలు ఆపేసి సత్యాలు చెప్పటం స్టార్ట్ చేద్ధాం.
    కాని, ఎవరన్న పిలిస్తే తప్పకున్డ వెల్లివద్ధాం. Otherwise they will feel hurted.
    ��

    Sent from http://bit.ly/f02wSy

    ReplyDelete
    Replies
    1. శ్యాం గారు,

      సత్యనారాయణ వ్రత కథలు విని ఎవరైనా సరైనా అర్ధం చెప్పగలిగితే బావుండును అని అనుకునేదానిని. వ్రతం చేయకపోతే దేముడు కోప్పడం, వ్రతం చేస్తే ఐశ్వర్యాన్ని ఇవ్వడం ఏమిటిదంతా? పిల్లలకు మన సంస్కృతిని ఏ విధంగా పరిచయం చెయ్యడం?ఇలా ఎన్నో ప్రశ్నలు. గరికపాటి వారు చెప్పింది ఒక్కొక్కటి వింటూ ఉంటే ఆలోచనలకు ఓ రూపం వచ్చింది. వ్రతాలు ఆపొద్దు. కర్మలు చేయవలసిందే. అయితే సారాన్ని గ్రహించి చేయాలి. అంటూ వారు చెప్తున్నది అక్షరాలా అర్ధవంతంగా, ఆచరణ యోగ్యంగా కనిపిస్తోంది. మధ్యలో ఆయనన్నారు చూడండి. గుడిలో కుంభకోణం... పసి మనసులలో నమ్మకాన్ని హత్యచేస్తున్న వాళ్ళను ఉపేక్షించ కూడదండి. దేముడు పేరు చెప్పి వెనుక దెయ్యాన్ని ఆరాధిస్తున్న వారిని మనం చుట్టూ చూస్తూనే ఉంటాం. నలుగురు నోరు విప్పగలిగితే ఆ నాటకాలకు తెర పడుతుంది. ప్రయత్నిద్దాం.

      Delete
  3. వినపళ్ళా! కలిలో సత్యం వధ,ధర్మం చెఱ

    ReplyDelete
    Replies
    1. బాబాయి గారు, ఫరవాలేదండీ. ఇవన్నీ కూడా మీకు తెలిసినవి, బ్లాగు ద్వారా మీరు మాకు చెప్తున్నవీనండీ.

      Delete
  4. గరిక పాటి వారికి సామాజిక స్పృహ మెండు . అవగాహన మెండు . సమాజం బాగుపడాలనే తపన మెండు . అందుకే ప్రతి విషయాన్నీ సులభతరం చేసి సత్యాన్ని ఆవిష్కరిస్తారు . సత్యాన్ని మరుగు పరచి దైవాన్ని వ్యాపారమయం చేసే వాళ్ళ వళ్ళే భారతీయ సమాజం చాల కాలంగా నష్టపోతూ ఉంది . దరిమిలా , గరికపాటి వారన్నట్లు దైవం ఉనికి మీద సమాజం నమ్మకం కోల్పోతూ ఉంది . ఈ విపరీత ధోరణికి సత్యాన్ని ఆవిష్కరించడానికి ఇష్టపడని సంప్రదాయ వాదులే కారణం . కనీసం గరిక పాటి వారి లాంటి కొంతమంది విజ్ఞులైనా ప్రతి సంప్రదాయంలోని సత్యాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తుండడం గర్వించ దగ్గ విషయం .

    ReplyDelete
    Replies
    1. అవునండీ. ఇప్పటికి ఎన్నో సత్యనారాయణ వ్రతాలకు వెళ్ళాం. ఇందుకు ఈ వ్రతం చేస్తుందనీ ఒక్క పూజారీ చెప్పడం వినలేదు. సత్యం చెపుతామని వ్రాతమాచరించడం అంటే కేవలం అబద్దం చెప్పకుండా అని మాత్రమే కాకుండా, మొహమాటం లేకుండా సత్యమే చెప్తాం అని వ్రతమాచరింప చేస్తే బావుండును.

      Delete
    2. "గరిక" పాటి చేయని సత్యానికి ఇంత విలువా బిల్డ్ అప్ కూడా నా !!:)

      జిలేబి

      Delete
    3. పొరపాటు మాట అన్నారు జిలేబీగారూ.

      Delete
  5. 'గరిక' పాటి చేయని సత్యమా... ఎంత మాట ఎంత మాట, గరికపాటి వెలిగించిన అఖండ జ్యోతి ప్రసరిస్తున్న సత్య కిరణాలు కావూ ఇవి.

    ReplyDelete
  6. జిలేబీ గారు ఎంత హాస్యప్రియులయినప్పటికీ, హేతుబధ్ధంగా నాలుగు మంచిమాటలు చెప్పే గరికపాటివారి పాండిత్యాన్ని గడ్డిపోచతో పోల్చడం భావ్యం కాదు. పైపెచ్చు అపహాస్యం అవుతుంది.

    ReplyDelete
    Replies
    1. తప్పుగా అనిపించిన క్షమార్పణలు !

      అక్కడ గరిక పాటి చేయనిది సత్యం! గరికపాటి వారి పాండిత్యం కాదు. గరిక పాటి చేయని సత్యానికి అంత విలువా ! (ఎందుకు అన్నది ప్రశ్న!)

      జిలేబి
      (సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయత్ సత్యమప్రియం !)

      Delete
    2. సామాజిక స్పృహ చాలా మంచిది. కానీ ప్రాబ్లెం ఏంటంటే నండీ ప్రతీదీ లౌకిక జీవనానికి ముడిపెట్టుకోవాలనుక్కోవడం తగని పని. సత్య వ్రతంలో కల్పంలో చెప్ప బడిన సత్యం అంటే మన లౌకిక జీవనంలో "నిజాలు-అబద్ధాలు మాట్లాడడం" కావు. ఒకవేళ అవి సమాజానికి మంచి చేస్తాయని అలా అన్వయించి చెప్పినా ఆ అన్వయం మాత్రం ’సత్యం’ కానేరదు. పడవలో ఉన్న మణిమాణిక్యాలు సత్య వస్తువులు కావు ఎదురుగా వచ్చిన నారాయణుడు సత్య వస్తువని గుర్తెరగడం సత్ తో సంగం పెట్టుకోవడం. సత్ ని ఎరగడం. సత్య వ్రతంలో సత్యం. అంతే తప్ప అబద్ధాలూ నిజాలు మోసాలూ కావు. తత్త్వం తెలుసుకొని వివరించాలి. తత్త్వ విచారణమే భారతీయత అది ఋషి హృదయం తప్ప కంటికి కనపడే సత్యాసత్య లౌకిక విచారణలు కావు ఇవి పాశ్చాత్య హృదయం. తత్త్వ విచారణలో లౌకిక సామాజిక ప్రయోజనాలు అనుషంగికం. సామాజిక ప్రయోజనంకోసమే లౌకిక ప్రయోజనం కోసమే వేదాలు ధర్మాలు వ్రతాలు పూజలు అంటే ఋషుల హృదయం అర్థమవ్వని వాని వ్యాఖ్యానం. సత్యం తెలుసుకోవడం తెలియజేయడం ఋషి హృదయం సామాజిక లౌకిక ప్రయోజనం అనుషంగికం నిక్కచ్చిగా ఆచరిస్తే అది ఎలాగూ వచ్చితీరుతుంది. దీపం వెలిగించడం వెలుగు కోసం దానితోపాతూ వెచ్చదనం అనుషంగికంలా.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.