Monday, June 4, 2012

వేసవిలో చల్లని రోజు

    గాలికి చిన్నగా ఊగుతున్న ఎత్తైన పచ్చని చెట్లు, మధ్యలో కొలను, దూరంగా పిల్లల ఆటస్థలం నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి, అద్భుతమైన చిత్తరువులా ఉందా ప్రదేశం. నీటి అలలపై చెట్ల నీడ అందంగా కదులుతోంది. కొమ్మ మీద రెండు పిట్టలు విశ్రాంతిగా కూర్చుని వున్నాయి. దూరంగా వున్న ఆటస్థలంలో పిల్లలు కొంతమంది ఆడుకుంటున్నారు. సన్నని కాలిబాటకు ఇరువైపులా పచ్చిక, కొంచెం దూరంగా వాలీబాల్ కోర్టు, బాట చివరగా రెండు విశ్రాంతి మందిరాలు వున్నాయి. నీటిపై నుండి వీస్తున్న గాలి చల్లగా ఆహ్లాదంగా వుంది.

       ఆ ప్రాంతానికి మెల్లగా ఒక్కో కుంటుంబమే వస్తోంది, తెలిసిన వారు ఒక
రినొకరు ఆప్యాయంగా   పలకరించుకుంటుంటే, తెలియని వారు పరిచయం చేసుకుంటున్నారు. మధ్యాహ్నానికి ఆ ప్రదేశ౦ జనసందోహంతో నిండిపోయింది. హుషారైన పాటలు చెట్ల మధ్యలో తిరుగుతూ గాలితో సయ్యాటలాడుతున్నాయి.

         బుజ్జిపండు తన స్నేహితులతో కలసి చెట్టుకు 
తాడుకట్టి కొమ్మపైకెక్కే ప్రయత్నంలో వున్నాడు. ఒక గంట తర్వాత 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్న విధంగా చెట్టెక్కి కూర్చున్నాడు.      
       కాటన్ కాండీ కొనుక్కుని చెంప మీద బొమ్మలు వేయించుకుంటున్న చిన్నారులను ముద్దాడి, తాడును పట్టుకుని లాగుతూ బలాబలాలను తేల్చుకుంటున్న పిల్లల్ని ఉత్సాహపరిచి, కబడ్డీ ఆట కాసేపు చూసి, వాలీబాల్ ఎగిరిన వైపు చూస్తే నీలాకాశంలో తెల్లని మేఘాలు కనిపించాయి. తోటలో పువ్వులు లేని వెలితి పిల్లల నవ్వులు భర్తీ చేశాయి.

     
నిన్న మా ఊరిలో జరిగిన వనభోజనాల కార్యక్రమంలో పెళ్ళి హడావిడి కనిపించింది. ఎంతో మందిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. ప్రతి పనికీ మేమున్నామంటూ ముందుకు వచ్చిన వాళ్ళు, తీసుకున్న పనిని చివరివరకూ వదలక పూర్తి చేసిన వాళ్ళు, చేసే పని అందరకీ తెలియాలని తాపత్రయపడిన వాళ్ళు, ఇలా చేస్తే బావుంటుందని సలహా ఇచ్చిన వాళ్ళు ఇలా ఎందరో...అయితే ఎక్కువ శాతం, ప్రతి పనిలో పాలుపంచుకుంటూ పక్క వారిని మనస్పూర్తిగా మెచ్చుకున్న వాళ్ళే కనిపించారు. 

      ఏ ప్రయోజనమూ ఆశించకుండా పలువురి ఆనందం కోసం కార్యక్రమాన్ని తమ భుజాలపై వేసుకున వాళ్ళను, పిల్లలకు మరచిపోలేని అనుభూతిని మిగల్చాలని అహర్నిశలూ శ్రమపడిన వాళ్ళను, బరువులు మోసిన వాళ్ళను, చెత్తను తీసివేయడానికి సైతం వెనుకాడని వాళ్ళను చూశాను. సజ్జన సాంగత్యం లభించింది.

      భోజనాల ఏర్పాట్లలో హడావిడిగా ఉ
న్నాకూడా, చాలా మంది స్నేహితులను కలిసే అవకాశం కలిగింది. నలుగురితో కలసి పనిచేసిన  ఆన౦దం దక్కింది. నా తలపులలో ఓ వేసవి రోజు చల్లగా హాయిగా నిలిచిపోయింది.

26 comments:

  1. బాగుంది,బాగుంది వేసవి చల్లని రోజు మాకెప్పుడొస్తుందో!

    ReplyDelete
    Replies
    1. నిన్న మీ పోస్ట్ చదివి మీ గురించి ఆలోచిస్తూ నేను కూడా ఇదే అనుకున్నాను బాబాయి గారూ...ధన్యవాదాలు

      Delete
  2. వేసవి లో ఓ చల్లని రోజు ఆనందం గ గడిపారన్నమాట.మీ ఆనందం బాగుంది .

    ReplyDelete
    Replies
    1. ప్రతి సంవత్సరం ఓ వారం తరువాత వుండేదండీ..ఈ పార్క్ కాకుండా వేరే పార్క్ అక్కడ చెట్లు తక్కువ. ఎండలో మాడిపోయేవాళ్ళం. ఈసారి ఇంకా ఎండలు మొదలవలేదు, ఈ పార్క్ అంతా చెట్లే, అందువల్ల చాలా బాగా గడిచింది. ధన్యవాదాలు.

      Delete
  3. ఇప్పుడు వన భోజనాలా?వావ్...ప్లేస్ మాత్రం చాల బాగుంది.
    మీరు వ్రాసిన విశేషాలు భలే ఆనందం కలిగించాయి

    ReplyDelete
    Replies
    1. ఈ పార్క్ చాలా బావుంది శశిగారూ. పెద్ద చెట్లు ఉండడం వల్ల అంతా నీడగా ఉంది....పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ధన్యవాదాలు.

      Delete
  4. cool summer day.. nice.

    ReplyDelete
    Replies
    1. నిజమేనండీ...మాకింకా ఈ సంవత్సరం ఎండలు మొదలవలేదు. ధన్యవాదాలు.

      Delete
  5. ఇట్టా కాదులేగానీ జ్యోతిర్మయిగొరు, అర్జంటుగా బుజ్జిపండు గురించేదన్నా టపా రాసేయండి - నేచెబ్తన్నా. పిల్లోడన్నాక సెట్టెక్కడా ఏంది? ఇందులో మాటర్‌ ఏది?

    "యెల్లో తక్‌లు", "పైప్ మేఘాలు", "రాజకుమారుల కథలు" అన్నట్టుండాల మరి - ఆఁ! :-)

    ReplyDelete
    Replies
    1. తెలుగు భావాలు నిర్మొహమాటంగా మీ అభిప్రాయం చెప్పారు. చాలా సంతోషం. త్వరలో పండు కబుర్లు వ్రాస్తానండీ..ధన్యవాదాలు.

      Delete
  6. మండుటెండల్లో చల్లని కబుర్లు విని అయినా ఏదో కొద్దిగా చల్లగా ఉన్నాం థాంక్ యు ..జ్యోతిర్మయి గారు.

    ReplyDelete
    Replies
    1. వనజగారూ ఈ సంవత్సరం మాకు ఇంకా ఎండలు మొదలవలేదండీ...ఈ పార్క్ లో ఎక్కువ చెట్లు ఉండడంవల్ల అక్కడ చాలా చల్లగా ఉన్నది. మీరందరూ వర్షం గురించి వ్రాసే టపా కోసం ఎందురు చూస్తూ ఉన్నామండీ..ధన్యవాదాలు.

      Delete
  7. భలే మంచి రోజు...చల్ల చల్లని రోజు..:-)

    ReplyDelete
    Replies
    1. నాగిని గారూ...అవునండీ భలే మంచి రోజు. పిల్లలు సరదాగా బోలెడు ఆటలు ఆడారు. ధన్యవాదాలు.

      Delete
  8. మీ వనభోజనాల వర్ణన బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రవిశేఖర్ గారూ

      Delete
  9. Replies
    1. వచ్చే సంవత్సరం మా ఊరి వనభోజనాలకు మీరూ రండి వెన్నెల గారూ....ధన్యవాదాలు.

      Delete
  10. ఏమండోయ్

    వేసవి అని టపా రాయండి. చల్లని రోజులు అని టపా రాయండి. ఇట్లా వేసవిలో చల్లని రోజులు అని టపా రాస్తే ఎలాగండీ ! ఇంతకీ ఎక్కడండీ ఈ ప్రదేశం ! ప్చ్! నలభై ఐదు ప్లస్ మండి పోతున్నాడు సూరీడు. ఆల్రెడి కష్టే ఫలే వారు కూడా మొర పెట్టేసేరు వానలు ఎప్పుడు వచ్చునో అని

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారూ మాకింకా ఎండలు ముదరలేదండీ...పోయినేడాది ఇదే సమయంలో పిక్ నిక్ కి వెళ్లి ఎండలో మాడిపోయి వచ్చాము. అ౦దుకే వేసవిలో చల్లని రోజు అని పెట్టాను. ఇండియాకి ఫోన్ చేస్తే అందరూ ఎండల గురించి తప్ప మరో దాని గురించి మాట్లాడం లేదు. త్వరగా వర్షాలు పడాలని కోరుకుంటున్నానండీ..ధన్యవాదాలు.

      Delete
  11. చాలాబాగుందండీ.. నిజమే ఒకోసారి అలాంటి వలంటీర్స్ ని చూస్తే భలే ముచ్చటేస్తుంది.

    ReplyDelete
    Replies
    1. మూడువందల యాభై మంది హాజరయ్యారండీ ఆ వేళ, అక్కడ వాలంటీర్స్ ని చూస్తే నిజంగా ముచ్చటేసింది. ధన్యవాదాలు వేణు గారూ.

      Delete
  12. 'వేసవిలో చల్లని రో
    జా'సక్తిగ జదువ దెలిసె నసలు విషయ మా
    ఊసుల మాటున జ్యోతీ !
    భాసించెను మీ హృదయము బహు చల్లనిదై
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. మీ పద్యాల మాల ఈ బ్లాగునే శోభాయమానం చేస్తోంది రాజారావు గారూ..ధన్యవాదాలు.

      Delete
  13. Replies
    1. ధన్యవాదాలు మాధవి గారూ..

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.