Saturday, May 11, 2013

వాహిని


మా ఊరి వాహిని పత్రిక 

         పిల్లలు, అన్ని విషయాల్లో పెద్దవాళ్ళను అనుకరిస్తూ ఉంటారు. మనం తెలుగు చదవడం నచ్చిన వాటిని పిల్లలకు చదివి వినిపించడంలో పిల్లలకు మన భాష మీద ఆసక్తి పెరుగుతుంది. ఎదురుగా పుస్తకం కనిపిస్తూ ఉన్నప్పుడు చదివే అలవాటులేని వారు కూడా తప్పకుండా పుస్తకం చదువుతారు. ఇలాంటి ఆలోచనలోంచి పుట్టిందే మా 'వాహిని.' 

        పత్రిక కోసం ఇంత అందమైన బొమ్మను వేసిచ్చిన పాణి గారికి, తమ రచనలను ఇచ్చిన రచయితలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ పత్రికను సమీకరించి అందంగా తీర్చిదిద్దిన సంపాదకులకు ప్రత్యేక ధన్యవాదాలు.


వాహిని పత్రికలను ఇక్కడ చదవొచ్చు.

10 comments:

  1. ముఖ చిత్రం చాలా అందంగా ఉండండి.అంటే మీరు పత్రిక కూడా నడుపుతున్నారా!మేము ఏవైనా వ్యాసాలు పంపవచ్చా!

    ReplyDelete
    Replies
    1. మా తెలుగు అసోసేషన్ పత్రిక అండి అది. మీ రచనలు తప్పకుండా పంపించవచ్చు.

      Delete
  2. baagundi vidudala eppudu..elaa chadavachchu?

    ReplyDelete
    Replies
    1. పైన వాహిని మీద క్లిక్ చేసి ఆన్ లైన్త్రి పత్రిక చదవొచ్చు ఎన్నెలా. రెండు వరాలా క్రిత౦ CSS ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజ్యలక్ష్మి గారు పుస్తకావిష్కరణ చేశారు.

      Delete
  3. చాలా అందంగా తీర్చి దిద్దారండీ మీ ఊరు "వాహిని" ని. మీ బ్లాగు ద్వారా మా ఊరిదాకానూ ప్రవహించింది.
    కథలూ, కధనాలూ, శీర్షికలూ, పద్యాలూ, కార్టూన్లూ, బొమ్మలూ...ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలతో పరవళ్ళు తొక్కుతున్న "తెలుగు వాహిని" లా ఉంది. దీని వెనుక మీ అందరి కృషీ ఎంత ఉందో ప్రతి పేజీలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెలుగు ని బ్రతికిస్తున్న అమెరికా పత్రికలకీ వాటి ని ప్రోత్సాహిస్తున్న అభిమానులకీ వందనాలు!
    ముఖచిత్రం అందంగా తీర్చి తెలుగు దనంతో నింపిన "పాణి" గారికీ ప్రత్యేక అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారు. పత్రికను ప్రోత్సాహించడం మా బాధ్యత. ఇక పత్రిక వెనుక కృషి మాత్రం పూర్తిగా సంపాదకులదేనండి. పాణి గారు బొమ్మలు చాలా బాగా వేస్తారు. వారికి బ్లాగు లింక్ పంపిస్తాను. మీ వ్యాఖ్య చూసి ఆయన ఎంతో సంతోషిస్తారు.

      Delete
  4. ముఖ చిత్రం చాలా బాగుంది, వాహిని పత్రిక మీ మనోభావాలకు అనుగుణంగా ఉంది, జ్యొతి అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫాతిమా గారు.

      Delete
  5. నవరసవాహినికి శుభాభినందనలు.ముఖచిత్రాలు,అక్షరచిత్రాలు సమవుజ్జీలై అలరిస్తున్నాయి.మీ సాహిత్యాభిలాష,అందుకు చేస్తున్నకృషి అభినందనీయం.

    ReplyDelete
    Replies
    1. మీలాంటి పెద్దలు మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు ఉమాదేవి గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.