Tuesday, February 4, 2014

మానేస్తాన౦తే...ఆ

"ఎంత చేస్తే మాత్రమేం, పట్టించుకునేదెవర్లే....."
"ఎందుకలా అనుకుంటావ్....అన్నీ నీ కోస౦ కాదుటే?"
"భలే చెప్పేవు లేవమ్మా... ఇవన్నీ కావాలని నేనడిగానా? అదుగో టింగు రంగా మంటున్నాయే వాటికోసం ఇవన్నీ. ప్రేమంతా వాటిపైనే. నాకు మిగిలేది మాత్రం కేవలం పనే, ఓపిక ఎక్కడనుండి తెచ్చుకోమంటావ్?"
"అదేంటి! రోజుకో ఆరుగంటల పని చేస్తావేమో! దానికే ఓ...ఇదై పోతున్నావే. ఆ పని కాస్తా అవ్వగానే అంతా విశ్రాంతేగా!"
"ఎవరమ్మా చెప్పింది. ఉదయానుదయాన్నే నా మోహన ఇంత కాఫీ పోస్తారు. అదెంత చేదుగా ఉంటుందో తెలుసా! కషాయం నయం. ఇక అక్కడ్నుండి మొదలు. "ఇచ్చిన పనేదో కానిచ్చి కాసేపలా కునుకు తీద్దాం" అనుకుంటుండగానే, పని మీద పని పురమాయిస్తారు. వాన కానీ, వరదే రానీ బండెడు చాకిరీ తప్పదు. చిన్న సాయ౦ కూడా ఉండదనుకో. ఇక సాయంత్రాలు, రాత్రిళ్ళూ చెప్పనే అక్కర్లేదు."
"పోనీలేవే రోజులన్నీ ఒక్కలాగే ఉంటాయా!"
"ఒక్కలాగా ఎలా ఉంటాయి? ఇంటికి చుట్టాలో, బంధువులో వస్తూనే ఉంటారుగా! అప్పుడైతే ఇక చెప్పనే అక్కర్లేదు."
"బావుంది, మనుషులొచ్చినప్పుడు కూడా అలా అనుకుంటే ఎలా? బయటకు వెళ్ళినప్పుడ౦తా విశ్రాంతేగా!"
"ఎక్కడికీ వెళ్ళేది....పెళ్ళీ, పెరంట౦ ఇవేగా...కాకపోతే ఏ ఊరు చూడ్డానికో..... రోజూ చేసే పనికంటే రెట్టింపు పని. అక్కడికొచ్చే నాలాంటి వాళ్ళంతా ఇదే అనుకుంటారు. మా కష్టాలు కష్టాలు కావనుకో. వెనకటికెప్పుడో ఈ పెళ్ళిళ్ళ కోసం సరదాగా ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడదంతా ఏం లా."
"అవునా, అక్కడన్నీ మీ కోసమే చేస్తున్నామని చెప్తారే".
"అంతా ఒట్టిది. వాళ్ళ గొప్పలు చూపించుకోడానిగ్గాని, మా గురించి వాళ్ళకేం పట్టింది?"  
".........."
"కనీసం పడుకోబోయే ముందన్నా కనికరిస్తారా! అబ్బే...అంతో ఇంతో పని అప్పజెప్పి గాని పడుకోరు. దాంతో రాత్రంతా నిద్రే ఉండదు."
"అయ్యో అలాగా!"
"ఇదేమైనా ఒకనాటిదా రోజూ ఇలాగే పనిచేయాలంటే ఎట్టాగమ్మా?"
"పోనీ చెయ్యనని చెప్పు"
"అదీ అయ్యింది, నేరుగా చెప్పలేక విషయం అర్ధం అయ్యేలా చేశాను. నన్నే నానా మాటలూ అన్నారు. ఏ పనీ సరిగ్గా చెయ్యలేనని అడ్డమైనా గడ్డీ పెట్టి మందులూ, మాకులూ ఇచ్చారు.".
"అయితే ఇప్పుడేమంటావ్?"
"కళ్ళు, నోరూ కావాలని అడిగిన  పిజ్జాలు, పనీర్లు, పఫ్ లు, కోడి పలావులు, కాలా జామూన్ లు, పాలకోవాలు ఇంకా పేరు తెలియని అడ్డమైన వంటకాలు తింటూ ఇరవై నాలుగు గంటలూ విశ్రాంతి లేకుండా చేస్తే ఏదో నాడు పని మానేస్తాను. అప్పుడు ఏమనుకునీ ఉపయోగం ఉండదు ఏమనుకుంటున్నారో...ఆ"

18 comments:

 1. అవునుమరి. జీర్ణాశయంకి విసుగెత్తుతుంది మరి. :) :) భలే చెప్పారు.

  ReplyDelete
 2. Replies
  1. :) ) థాంక్యు కార్తీక్.

   Delete
 3. Replies
  1. :)) ధన్యవాదాలు నారాయణ స్వామి గారు.

   Delete
 4. Replies
  1. :)) థాంక్యు స్ఫురిత గారు.

   Delete
 5. good
  అక్షరాలన్నీ మిమ్మల్ని నిద్దర్లో కూడా నిలదీస్తాయి. చిన్న జీవిత౦...ప్రశాంతంగా జీవించవడం చాలా ముఖ్యం కదూ! .

  ReplyDelete
  Replies
  1. థాంక్సండి సుబ్రహ్మణ్యం గారు.

   Delete
 6. Replies
  1. థాంక్యు శ్రీదేవి గారు.

   Delete
 7. హ హ ...చాల బాగుందండి జ్యోతిగారు . జీర్ణాశేయ౦ బాధని భలేగ చెప్పరు.

  ReplyDelete
 8. చిన్నప్పుడు బళ్లో అవయవాలన్నీ వాటి గొప్ప చెప్పుకొంటూ పొట్టను విమర్శించే కథ ను గుర్తుకు తెచ్చింది మీ కథ .బాగుంది.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు బ్రహ్మేశ్వర రావు గారు. ఆ కథను మా పాఠశాల విద్యార్ధులు పోయిన వార్షికోత్సవానికి నాటికగా వేశారండి.

   https://www.youtube.com/watch?v=RrCFpstB5v0

   Delete
 9. హహ్హ్హహ్హ!!! భలే రాశారు :D

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.