అందమైన కల ఇచ్చే అనుభూతే వేరు, అది నిద్రలో కాని, మెలుకువలో కాని. నాకు బాగా గుర్తున్న కల.. బుజ్జిపండు ఇక రెండు నెలల్లో పుడతాడనగా వచ్చిన పసుపు పచ్చని పులిహోర కల. నవ్వకండి! నిజంగానే. తెల్లవారి లేచి మామూలు కన్నా కొంచెం ఎక్కువ పసుపుతో పులిహోర కలిపి తినేశాను. ప్రస్తుతం నా కలల్లో రంగులు కనిపించడం లేదు. పోనీ కలలకే రంగులు వేస్తే! ఏమిటీ.. వేయలేం కదూ! అందుకే చుట్టూ ఉన్న పరిసరాలకు అంటే ఇంటి గోడలకు రంగులు వేయాలనిపించింది. ఆ కథా కమామీషంతా ఓ సహస్రం నడిచింది. టూకీగా విశేషాలు చెప్తాను.
* * * * * *
"ఇవాళ రంగులు చూసి వద్దామా?" తో ఓ రోజు మొదలైంది. ఆ వసంతమాసపు ఉదయం ఉత్సాహంగా 'షెర్విన్ విలియమ్స్' లోకి అడుగు పెట్టాం. కావలసిన రంగులేలో కార్ట్ లో పెట్టుకుని తెచ్చేద్దాం అనుకుంటూ.
"కెన్ ఐ హెల్ప్ యూ?" సేల్స్ గర్ల్ వచ్చింది.
"మేము ఇంటికి రంగులు వేయాలనుకుంటున్నాం."
"మరి రంగులు ఎంచుకున్నారా?" అని అడిగింది. "ఇంకా లేద"నగానే రంగుల్లో ఎన్ని రకాలున్నాయో, ఏ రంగులైతే ఒకదానిపక్కన ఒకటి సఖ్యంగా ఉంటాయో, సాధారణంగా ఏఏ గదులకు ఏఏ రంగులు వాడతారో ... అన్నీ చెప్పడం మొదలెట్టింది. పూర్తయ్యేసరికి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. ఆ పూటకు రంగుల వేట చాలించి ఆ మర్నాడు కొత్తగా రంగులు వేసిన మా స్నేహుతుల ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటాయన వాళ్ళ గదులన్నీ ఉత్సాహంగా చూపించి అన్ని గదులకు కలిపి మొత్తం పదహారు రంగులు వాడినట్లుగా చెప్పాడు. మరో ఇంటికి వెళ్ళాం, వాళ్ళూ అంతే. అంటే ఈ రంగుల ఎంపిక అంత తేలికగా అయ్యే వ్యవహారం కాదని అర్ధం అయింది. "తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది" అన్నట్లుగా మేమొకటి అనుకుంటే మా పిల్లల అభీష్టం మరొకటని అర్ధం అయింది. ఎలాగంటారా...
"నీ రూమ్ కే రంగు వేద్దాం అమ్మలూ",
"పింక్ అండ్ పర్పుల్"
"ప్రెట్టీ కలర్స్, చ్యూజ్ వన్"
"ఐ వాంట్ బోత్"
"బుల్లి రూమ్ కి రెండు రంగులు ఏం బావుంటాయిరా?"
"బావుంటాయమ్మా" అమ్మని ఒప్పించాలంటే ఏ భాషలో మాట్లాడాలో అమ్మాయికి బాగా తెలుసు.
సరే అందులో షేడ్స్ చూడు.
"లైట్ పింక్ అండ్ డార్క్ పర్పుల్.. ఐ మీన్ ఫషియా"
"ఫషియా .... ఫషియా అంటే దగ్గర దగ్గరగా నేరేడుపండు రంగు... ఇంకో సారి ఆలోచించరా"
"బాత్ రూమ్ కి లావెండర్ కలర్."
వెంటనే ఓకె చెప్పేశాను. ఆలస్యం చేస్తే కిటికీ అంచులకీ, డోర్ నాబ్ కి కూడా వేరే రంగులు చెప్పెయ్యగలదు.
"నీకు పండూ"
"ఐ వాంట్ ఓన్లీ వన్ కలర్. బ్లూ"
"ఓకే. గుడ్"
"డా...ర్క్ బ్లూ".
"రూమంతా అదేనా?" నడి సముద్రంలో మునిగిపోతున్న ఫీలింగ్ తో అడిగారు నాన్న.
"ఆక్చ్యువల్లీ . ఐ వాంట్ హైపర్ బ్లూ".
"ఒద్దురా బాబూ. ఆ రంగువేస్తే రూమంతా చీకటై పోతుంది."
"నాకదే కావాలి. బాత్ రూమ్ అండ్ కోజెట్స్ బ్రైట్ ఆరంజ్"
"నో వే" రామ్ గోపాల్ వర్మ సినిమా చూడకుండానే ముచ్చెమటలు పోశాయి.
"ఎస్."
"ఆ..సరే కానియ్."
ఆ 'నో వె' కి... 'సరే కానియ్' కి మధ్య చాలా అంతరాలు దాటాల్సి వచ్చింది.
మిగిలిన గదులన్నింటికీ ఏ రంగులు వేయాలా? అని ఇంటర్ నెట్ అంతా వెతుకుతూ ఓ రోజు బయటకు చూసేసరికి ఎరుపు, పసుపు, నారింజ రంగులతో చెట్లు హోలీ ఆడినట్లు రంగులే రంగులు. ఫాల్ కలర్స్ తో ఆకులు రంగులు మార్చుకున్నాయి కాని మా గోడలకు ఆ భాగ్యం కలగలా. . ఇక లాభం లేదని పెయింటర్ ని ఇంటికి పిలిచి సలహా అడిగాం. ఏ రంగు బావుంటుందో చూడాలంటే ముందు సాంపిల్స్ తెచ్చి వేసి చూడమన్నాడు. వేశాం. ఏ గోడమీద చూసినా ఎక్సర్ సైజ్ చేస్తున్న ఇంద్రధనస్సులే.
మళ్ళీ వసంతం వచ్చిన కొన్ని రోజులకు గోడలకున్న పటాలన్నీ కిందకు దిగాయి. సోఫాలు, మంచాలన్నీ ముందుకు జరిగాయి. ఏ గదిలోకి వెళ్ళినా గోడమీద నృత్యం చేస్తున్న రంగులు పులుముకున్న కుంచెలు...అర్ధం కాని భాషలో ఆ కుంచెలు పట్టుకున్న వారి కబుర్లు. ఒక్కో గోడకు రంగు వేస్తుంటే అది ఎలా మారుతుందో ఆశ్చర్యంగా చూడడం. నచ్చకపోతే షెర్విన్ విలియమ్స్ కి పరిగెత్తి కొత్త రంగు తెచ్చుకోవడం. ఇలా ఓ వారం గడిచాక...
మంచి గంధానికి రెండు చుక్కలు లవంగనూనె కలిపినట్లు మధ్య గది, తొలకరి జల్లులో మెరిసే మైదానంలా వంటగది, కుంకుమ పువ్వు పులుముకుని ముందుగది, నడివేసపు చల్లని సాయంత్రంలో మెరిసేటి నీలి సంద్రంలా మరో గది.... ఇలా గది గదిలో ప్రకృతికాంత విన్యాసాలతో నా రంగులకల పూర్తయ్యింది.
నేర్చుకున్న పాఠాలు:

- ఎవరి ఇంట్లోనైనా అందంగా అనిపించిన రంగు మన ఇంటికి సరిపోకపోవచ్చు. వెలుతురును బట్టి రంగు అందం మారుతూ ఉంటుంది.
- ఇంటికి రంగులు వేసిన తరువాత సామాన్లు కొనడం ఉత్తమం.
- పెయింట్ గోడ మీద చూడాలనుకుంటే పోస్టర్ బోర్డ్ మీద వేసి గోడకు అంటించాలి. అంతే కాని నచ్చిన దగ్గర పులిమేయకూడదు.
- చీకటిగా ఉన్నాయి కదా అని క్లోజెట్స్ కి లేత రంగులు వేయక్కర్లేదు. ముదురు రంగులు కూడా బావుంటాయి. లైటింగ్ మార్చుకుంటే సరిపోతుంది.
- గోడలమీద వున్న నొక్కులు, చొట్టలు సరిచేసిన తరువాత రంగు వేస్తే మంచిది. ఈ విషయం మీ పైంటర్ మీకు చెప్పకపోవచ్చు.
- ముదురు రంగులు వేయడం చూస్తూ ఉన్నప్పుడు గది చీకటై పోతుందేమో అని కంగారుగా అనిపిస్తుంది. మరేం ఫరవాలేదు. తెల్లని గోడపక్కన అలా అనిపిస్తుంది కాని గది మొత్తం వేసినప్పుడు అసలు రంగు తెలుస్తుంది.
- లేత రంగు ఎంచుకునేప్పుడు ఆ షీట్స్ తెలుపు రంగు కాగితం మీద పెట్టి చూస్తే రంగు ఎలాంటిదో సరిగ్గా అర్ధం అవుతుంది.
అందరూ ముదురు రంగులు వేస్తున్నారు కదా అని మావారు ఊర్లో లేనపుడు ఏమీ తోచక యెల్లో రంగు తెచ్చుకుని వేసేసాను.హాల్ చీకటిగా అనిపించి డార్క్ కలర్స్ ఇంట్లో వేయాలని ఎవరు చెప్పారంటూ ఇప్పటివరకూ వెక్కిరిస్తూనే ఉన్నారు.లవాండర్ కలర్ మాత్రం బాగుంది.వంట గదికి ఆరెంజ్ వేసాను,చీకటి గా అయిపోతే ఆ కలర్ పోగొట్టడానికి ఇంకో రెండు కోటింగ్ లు వేయాల్సి వచ్చింది.టైం పాస్ కాకపోతే తెలుగు బ్లాగులయినా చదువుకోవచ్చు కదా ? ఎందుకొచ్చిన తిప్పలు అనుకున్నాను కానీ తోచనపుడల్లా పెయింట్ తెచ్చుకోవడం వేసుకోవడం.
ReplyDeleteరంగులతో గొప్ప అనుబంధం ఏర్పడిందన్నమాట. సరదాగా ఉంటుంది కదూ రంగులేస్తుంటే.
Deleteఅమ్మాయ్!
ReplyDeleteఏంటీ ముసలాయన జిడ్డులా పట్టుకున్నాడూ అనుకోపోతే ఒక మాటమ్మా!
రంగులలో లెడ్ అనే పదార్ధం ఉంటుందిట. ఇది హానికర స్థాయిలో ఉంటే పిల్లలకి పెద్దలకీ కూడ ముప్పేట, అటువంటి ఇంటిలో ఉంటే. ఇదే స్థాయిలో ఉండాలి దాని కతేమైనా చెప్పగలవా?
అంతకు మించి సున్నం కొట్టించుకుంటే వెలుగుకి వెలుగు ఆరోగ్యానికి ఆరోగ్యంకాదా?
చికాకు పడకేం :)
ఇక్కడ దొరికే రంగులు ప్రమాదకరం కాదండి. మా మంచి కోరేగా చెప్పారు. మీ అభిమానానికి చాలా సంతోషించాను.
Deleteబావున్నాయి వసంతం తెచ్చిన రంగుల కబుర్లు ,అనుభవాలు
ReplyDeleteధన్యవాదాలు రాధిక గారు.
DeleteHahaha monna vaddaamanukuni phone cheddaamani tempt ayyaa koodaa..but alaa kaani ch chesaa. .ee rangula nee choodu u kadaa..ayyo miss ayipoyaa
ReplyDeleteవచ్చి ఉండాల్సింది. మిమ్మల్ని మేమే మిస్ అయ్యామన్నమాట. వీలు చూసుకుని రండి మరి. రంగురంగుల భోజనాలు కూడా వడ్డిస్తాం.
DeleteIts like you read my mind! You seem to know sso much approximately
ReplyDeletethis, such as you wrote the ebook in it or something.
I feel that you ould do with a few % to force the message home a bit, however other than that, that is excellent blog.
An excellent read. I will certainly be back.
Also visit mmy web-site ... advokatska Kancelarija - bluesbeautyworld.blogspot.Com,
You really mmake it seem so easy with your presentation but I find this topic
ReplyDeleteto be actually something which I think I would never understand.
It seems too complex and extremely broad for me. I am looking
forward for youur next post, I'll try to get the hang of it!
Here is my webpage: Cars 3 Posters
నమస్తే జ్యోతి గారు,
ReplyDeleteFor your future reference.
షెర్లిన్ విల్లియంస్ లో $75 గిఫ్ట్ కార్డ్ కొంటే, వాళ్ళు ఒక కన్సల్టెంట్ ని ఇంటికి పంపుతారు, ఆ కన్సల్టెంట్ మన ఇంట్లోకి వచ్చే వెలుతురు, గోడల డైరెక్షన్, ఇవన్నీ చూసి మంచి రంగులు చెప్తారు, ఒక్కో గదికి 3-4 రంగులు చెప్తారు. మనకి నచ్చింది మనం కొనుక్కోవచ్చు. 2013 లో మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇలానే రంగులు కొన్నాము.