"సమయం ఐదవుతోంది నిద్ర పట్టడం లేదామ్మా?"
అనడిగాడు పండు. జీవితంలో కొన్ని రోజులు సప్త వర్ణాల్ని ఒంటికి అద్దుకుని ఇంద్రధనస్సు
మీద ఊయలలు ఊగుతాయట. వినడమే కాని ఆ రోజులెలా ఉంటాయో నిన్నటి వరకు తెలియలేదు. అంతటి భాగ్యాన్ని చవిచూసిన నాడు ఇక నిద్రెలా పడుతుంది? నిన్న సాయంత్రం నుండి జరిగిన ప్రతి అంశమూ మధురంగా మనసును ఊపేస్తూ... ఒక్కొక్క జ్ఞాపకం మెత్తగా
మనసులో ఇంకుతుంటే ఇది నిజమా! నిజమేనా? అని ఇంకా అనుమానంగానే ఉంది.
అక్కడ ప్రతి టేబుల్ మధ్యలోనూ కొలువు తీరాయే
తెల్ల గులాబీలు, లిల్లీలు ఇక్కడ తీరిగ్గా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఎవరూ
లేరనుకున్నాయో ఏమో ఏమిటేమిటో కబుర్లు. వాటికి స్వర్గలోకం ఎలా ఉంటుందో చూడాలని
కోరిక ఉండేదట. ఆ చుక్కలు, చంద్రుని సమక్షంలో నిన్న జరిగిన సంబరం చూశాక ఆ కోరిక
తీరిపోయిందట. "మా సుధీర్, శిరీష లాంటి తమ్ముడు, మరదలు, శ్రీదేవి, కేశవరావు గారి
లాంటి స్నేహితులు ఉంటే ఆ బ్రహ్మ దేముడు మాత్రం స్వర్గంలో ఎందుకు ఉంటానంటాడు... వెంటనే
దిగి భూలోకానికి వచ్చెయ్యడూ" అంటూ గుసగుసలు పోతున్నాయ్.
* * * * * * *
ఖాళీగా ఉండే బ్రిడ్జ్ హామ్టన్ క్లబ్ హౌస్ ఆ అలంకరణతో ఏకంగా ఆకాశంతోనే పోటీ పడిందంటే అతిశయోక్తి కాదు. మా ఫొటోలన్నీ ఎలా సేకరించారో అద్భుతమైన ఫోటో సైన్ ఇన్ ఆల్బం తయారు చేశారు. షాండ్లియర్, సెంటర్ పీసెస్, బాక్ డ్రాప్, నక్షత్రాలతో కిటికీ తెరలు....
మా జీవితాన్నే చిత్రంగా చలన చిత్రంలా మలచి మమ్మల్ని కూర్చోపెట్టి మరీ చూపించారు. అందులో నటించిన విజయ, కృష్ణ, అనురాధ, రామారావు, రఘు, సూర్య, రాఘు గారి పేరెంట్స్ నటనా కౌశలం అమోఘం.
ఆరునెలల క్రితమే ప్రణాలిక సిద్దమైనా పదేళ్ళ పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఆ రహస్యాన్ని పదిలంగా కాపాడడం ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎంతెంత దూరలనుండో స్నేహితులు అభిమానంతో వచ్చారు. ఎంతో మంది ఉత్సాహంగా ఎన్నో చేశారు. వారందరి ఆత్మీయతకు గుండె తడి తెలుస్తోంది. ఆ అనుభూతి ఎంత హాయిగా ఉందంటే అభిమానాలు, సంబంధాలు అన్నీ ఎండమావులే అనుకునే బలహీన క్షణాలు ఉంటాయిగా అవి మొహం ముడుచుకుని ఇక తిరిగి రామంటూ పారిపోయేటంత.
ఏమన్నారు మంజుల... "ఎవరేమి
చేస్తారో తెలియదు కాని ప్రతిదీ ఇద్దరిదీని" అని. ఆ ఈశ్వరునికి శరీరంలో సగభాగం
పార్వతికి ఇవ్వడమే తెలుసు. నా ఈశుడు తన ఆత్మలో నన్నే నిలుపుకున్నాడు అందుకే ప్రతి
పనిలోనూ ఇద్దరం కనిపిస్తూ ఉంటాం. బిందు అనుకుంటుందీ "మా అక్క చిచ్చుబుడ్డీ. తను తల వంచదు, మా రఘు బావను తల వంచనివ్వదు" అని. పిచ్చి బిందూ ఆ
నాడు దాక్షాయణి పరాభవాన్ని భరించలేక అగ్నికి ఆహుతి అయింది. ఈశ్వరుడిలా చేతులు కాలాక
ఆకులు పట్టుకోవడం కాదు, జరగబోయే ఘోరాన్ని ముందే పసిగట్టి దక్షుని మనసును సైతం మార్చగల
ముందు చూపు మీ బావకు ఉండబట్టే నాకు దక్షాయణిలా పరాభవాన్ని చవిచూడాల్సిన అవసరం కలగలేదు.
తలవంచని తనం నాదే కాని ఆ అవసరాన్ని
రానివ్వని చాకచక్యం మీ బావది.
ఈ పాతికేళ్ళ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు...
అనుబంధాలు. అవి తలచుకున్న కొద్దీ మనసు గతంలోకి పరుగులు తీస్తోంది. లేలేత పరిచయాలు...
ఆ స్నేహ పరిమాళాల ఘుమఘుమలతో ఈ రేయి తెల్లవారబోతోంది. రంగులు అద్దిన 'నేడు' ఇంద్రధనస్సుపై
సవారి చేస్తోంది.
"అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని
కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా
గుండెల్లో ఇన్నాళ్లు శిలనై ఉన్నా నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా!"
ఆ చందమామ మీద కూర్చుని ఆత్మీయుల
అభిమానంలో తడిసి ముద్దవుతున్నప్పుడు నా మనసులో మెదిలిన భావాలకు అద్దం ఈ పాట.
మాతో వారి అనుబంధాన్ని నలుగురితోనూ పంచుకున్న ఆత్మీయులకు, ఈ అనుభవాన్ని మాకు పదిలంగా అందించిన
ఆత్మబంధువులకు కృతజ్ఞతలు చెప్పి దూరం పెట్టలేను. మీ స్నేహ సంతకాన్ని బ్రతుకు
పుస్తకంలో చివరి పేజీలో సైతం పదిలంగా దాచుకుంటాను.
Belated Wishes for your 25th Wedding Anniversary! Thanks for sharing the special moments from the celebrations!
ReplyDeleteThank you Lalitha garu.
Deleteఅద్భుతం ఆశ్చర్యం అనిర్వచనీయం హృదయావిష్కరణం బాగుంది జ్యోతి --
ReplyDeleteThanks Nanna.
Deleteదీర్ఘసుమంగళీభవ.
ReplyDeleteదీర్ఘాయుష్మస్తు
ధన్యవాదాలు బాబాయి గారు.
DeleteWonderful. Blessed are you to have such people around you and it shows your personality!
ReplyDeleteHappy wedding anniversary and wishing you many more such beautiful moments in your life.
నిజమేనండి. చాలా అదృష్టవంతులం అనుకుంటూ ఉంటాం. థాంక్ యు.
Deleteమీ దంపతులకు వివాహ రజతోత్సవ శుభాకాంక్షలు, కొంచెం ఆలశ్యం గా .
ReplyDeleteఫరవాలేదు శ్రీ గారూ. ఏడాదంతా చెప్పుకోవచ్చట. ధన్యవాదాలు.
Deleteవావ్.. అభినందనలండీ!!
ReplyDeleteమీ ప్రెజెంటేషన్ చాలా ప్రత్యేకంగా ఉంది.. భావోద్వేగాలు వినిపించాయి..
అనుకోని విధంగా జరిగిన వేడుక బాగానే కదిలించింది. వినగల హృదయం మీది. ధన్యవాదాలు మురళి గారు.
Deleteముందు గా మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు!! అధ్బుతంగా జరిపించారు మీ స్నేహితుల మీ పెళ్లి రోజు ని. మీ ఆనందాన్ని మీరు మీ భావాలతో అంత కంటే అధ్బుతంగా వర్ణించడం మీ అందరి మధ్య ఉన్న అనుభంధాన్ని చెప్తోంది.
ReplyDeleteఆప్యాయత గల కుటుంబసభ్యులుండడం, గొప్ప స్నేహుతులు దొరకడం కంటే అదృష్టం మరేదీ లేదనిపించిందండీ. ధన్యవాదాలు చంద్రిక గారు.
DeleteThank you Phaneendra garu.
ReplyDeleteantati mee aanamdaanni maato panchukunnamdaku chaalaa santoshamandi ..
ReplyDeletepelliroju Subhaakamkshalu Jyotirmayi gaaru Radhika(nani)
Thank you Radhika garu.
Delete