మొన్న మొన్నేగా పరీక్షలు పెట్టి మార్కులిచ్చి, ఏడాది విజయవంతంగా పూర్తి చేసినందుకు పిల్లలకు ఓ రెండు పిజ్జా ముక్కలు పెట్టాం. అదే రోజు "అమ్మయ్య ఇంక రెండు నెల్ల పాటు తెలుగు బాధ లేద"ని మురిసిపోతున్న అమ్మల చేతికి వేసవి అభ్యాసాలు ఇచ్చి ఇక నుండి ఈ పిల్లలకు తల్లైనా టీచరైనా మీరే. ఇవి పూర్తిచేయించి, ఇప్పటి వరకు నేర్చుకున్నవి మర్చిపోకుండా చూడండి." అని మా టీచర్లు కన్నీళ్ళతో జాగ్రత్తలు చెప్పారు కూడానూ! అదేమిటో గట్టిగా రెండు వారాలు గడిచినట్టు లేదు అప్పుడే మళ్ళీ పాఠశాల తెరిచే రోజులొచ్చేశాయి.
ఇంతకూ టీచర్లందరూ ఏం చేస్తున్నారా అని ఈ వారం ఒక్కోళ్ళకీ ఫోన్ లు చేయడం మొదలెట్టాను. వాళ్ళ అంతరంగమేమిటో మీరు కూడా వినండి.
కదిలించినవి'ట'
అమ్మా మీ వలన నా మనవడు నేను మాట్లాడుకోగలుగుతున్నాం. మంచి పని చేస్తున్నారు తల్లీ అంటూ వచ్చిన ఫోన్ కాల్.
మీరు క్లాసులో ఎలా చెప్తున్నారో ఏమో కాని మా వాడితో నేను రెండేళ్ళ నుండీ చేయించలేని పనులు మీ మాట విని చక్కగా చేస్తున్నాడు థాంక్స్ టీచర్ అన్న ప్రశంస.
ఆరేళ్ళ నుండి షార్లెట్ లో ఉంటున్నాను. నేను ఇంట్లో ఉన్నానో లేనో ఎవ్వరికీ తెలీదు. రెండు వారాలు ఇండియా వెళ్ళి వచ్చేసరికీ "ఏమండీ ఎలా ఉన్నారు? జెట్ లాగ్ ఉందా? వంటా అదీ అని హడావిడి పడక రెస్ట్ తీసుకొండ్. మేము సాయంత్రం కూరలు తెస్తున్నాం" అన్న పేరెంట్స్ వాట్స్ ఆప్ మెసేజెస్.
తెలుగు నేర్పించాలని తపన పడుతున్న మీరు సరస్వతీ దేవితో సమానం. మీ దీవెనలు కావాలంటూ ఇంటికి పిలిచి భోజనం పెట్టి పండు తాంబూలం ఇచ్చి పిల్లాడితో కాళ్ళకు దండం పెట్టించి చేసిన సత్కారం.
ఇప్పటికి రెండు సార్లు అమెరికా వచ్చానమ్మా, ఎప్పుడెప్పుడు తిరిగి వెళ్ళిపోదామా అని ఉండేది. ఈ సారలా కాదు మా పిల్లలిద్దరూ చక్కగా కబుర్లు చెప్తున్నారు థాంక్స్ మ్మా అన్న ఓ ఆంటీ మాటలు.
రగిలించినవి'ట'
ఏదో పార్టీ లో ఒక టీచర్ ని కలసిన పేరెంట్ , "సంవత్సరం నుండి క్లాస్ కు వెళ్తున్నా మా పిల్లలు అస్సలు తెలుగులో మాట్లాడడం లేదండీ" అన్నారట. దానికి ఆ టీచర్ "తెలుగులో మాట్లాడం దాని తీరు తెన్నులు" గురించి ఓపిగ్గా ఓ పావుగంట పాటు వివరించారట. వెళ్ళేప్పుడు ఆ తండ్రి గారు, say good night to uncle. అంటూ పిల్లలకు చెప్పి See you on Sunday అని టీచర్ తో అంటూ వెళ్ళిపోయారట.
"ఫలానా రోజున పరీక్ష ఉంటుందని పంపించిన మెయిల్ కి సమాధానం లేదు. తీరా పరీక్షకు పంపలేదని ఫోన్ చేస్తే నేను ఉద్యోగం చేస్తున్నానండి. నాకు కుదరక తీసుకురాలేదు. మరో రోజు పెట్టండి." అన్న సమాధానం.
"ఈ ఏడాది పాఠాలు చెప్పాం. వచ్చే ఏడాది మా ఇద్దరికీ కుదరడం లేదు, మీరెవరైనా క్లాస్ తీసుకుంటారా అని టీచర్స్ ఓ తరగతి పేరెంట్ ని అడిగితే దానికి "అబ్బే మాకు కుదరండి. ఏదో మీ దగ్గర దింపిన గంటలో గ్రాసరీస్ అవీ తెచ్చుకోవడమో ఇంట్లో పనులేవో చేసుకుంటాం. మాకేలా కుదురుతుందీ అంటూ వచ్చిన సమాధానం.
అదండీ సంగతి. ఎండా వానా రెండూ ఉంటాయ మరి. అయినా ఇవన్నీ తెలిసినవేగా! అప్పట్లోనే ఆవిడెవరో బోలెడు బాధ పడిపోయారు కూడానూ. ఏమిటంటారా? ఇక్కడ నొక్కితే మరొక్కమారు చదువుకోవచ్చు.
ఇక ప్రస్తుతానికి వస్తే ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మరో పది మంది కొత్త టీచర్లు మేం పాఠాలు చెప్తామంటూ ముందుకు వచ్చారు. అందులో తొమ్మిది మంది పాఠశాలకు పూర్తిగా పరిచయం లేని వాళ్ళు. మరో ముగ్గురు వాలంటీర్స్ "పాఠాలు చెప్పమన్నా చెప్తాం లేదా ఎప్పుడు ఏ పని కి సహాయం కావాలన్నా మేం రెడీ" అంటూ ఈ మధ్యే జరిగిన ఓ పిక్నిక్ లో కలిసి చెప్పారు.
పరీక్షలు, పాఠాలు, ఉపాధ్యాయులు, తరగతులు ఓ రెండు నెల్ల పాటు సందడే సందడి. మళ్ళీ కలుద్దాం. అంతవరకూ సెలవ్.
అన్నట్టు ఈ మధ్యే ఓపెన్ హౌస్ లో చెప్పిన మాట మీకు చెప్పడం మరిచేపోయాను.
"ఆవకాయ పెట్టడం పూర్తయ్యింది. ఆగస్ట్ నెలాఖరకు ఉపాధ్యాయులకు అందజేయబడుతుంది. ఉపాధ్యాయులు, "ఆవకాయ అమోఘంగా ఉంది. వారానికి నాలుగు రోజులపాటు తినండ"ని ఒక గిన్నెలోనో డబ్బాలోనే కొంచెం కొంచెంగా ప్రతి వారమూ విద్యార్ధులకు ఇస్తారు.
ఇంటి దగ్గర వారానికో నాలుగు రోజులు అమ్మో, నాన్నో వేడిగా అన్నం వండి, కమ్మని నెయ్యి, కాస్తంత పప్పు కలిపి, పిల్లలకు ప్రేమగా గోరు ముద్దలు తినిపిస్తే దాని రుచి వాళ్ళు ఆస్వాదించ గలుగుతారు. అలా కాదు, ఆ తీరిక మాకు లేదు, ఆదివారం మధ్యాహ్నం రాత్రి మిగిలిన అన్నంలోనో, బిర్యానీ లోనో వారం మొత్తం తినాల్సిన ఆవకాయంతా కలిపేసి, బలవంతంగా పిల్లలకు తినిపించేస్తామంటే ... ఆ కారం తినలేక పిల్లలకు ఆవకాయ మీదే అయిష్టం కలుగుతుంది."

ఇదండీ సంగతి. విన్న వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇంతకూ వారికి విషయం అర్థం అయినట్లా? కానట్లా?
Kannagi avakaya tinnaara aanamdam kaliginchina ee post! You are doing a great job! Congratulations and best wishes Jyothi Garu!
ReplyDeleteThank you Indira garu.
Deleteఓపెన్ హౌస్ లో చెప్పిన మాట నాకు బాగా నచ్చిందండీ... ఈ తెలుగు బడి కోసం వీలైతే 2-3 సంవత్సరాల తర్వాత అయినా Charlotte వచ్చేయలి అనుకుంటున్నాను...
ReplyDeleteవచ్చేయండి వచ్చేయండి మమత గారు. మా ఊరు చాలా బావుంటుంది.
Deleteమీ "కదిలించిన" బడి కబుర్లు బావున్నాయి.
ReplyDeleteమీ తెలుగు బడి ఇలాగే ప్రతి ఏడాది ఆడుతూ-పాడుతూ జరగాలి. శుభాభినందనలు!
~ లలిత
ధన్యవాదాలు లలిత గారు.
DeleteRemebering a dialogue " Amma, Avakaya eppudu bore kottavu" Alage mana matrubasha Telugu Mari mee blog eppudu enjoy chestanu
ReplyDeleteThank you Radha.
DeleteMee andari kashtam bagaa ardhamayindandi..
ReplyDeleteClaps 👏 👏 Radhika (nani)
Thank you Radhika garu.
DeleteNamaste Jyothi garu,na Peru Yamuna.memu Florida lo untamu. Me Patasala blog chala baga nachindi. Ma babu vayasu 2.5 samvatsaralu. Telugu lo ne intlo matladutunnamu. Telugu aksharamala eppudu,ela modalu pettali..vishayalu blog lo pettandi. Maalanti dooramuga unna vallaki upayoga padutundhi.
ReplyDelete