మార్చిలో ఎక్కడికైనా వెళ్ళాలంటే చలి. లేదూ కాదూ అంటే పక్కనే కరేబియన్ ఐలాండ్స్. ఆ విధంగా ఈసారి జమైకా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. వెళ్ళే ముందు జమైకా, బహామాస్ లో ఒక ద్వీపమనే తెలుసు. కాని అక్కడకు వెళ్ళి స్థానికులతో మాట్లాడి, వారి జీవన విధానం తెలుసుకున్నాక చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.
విశేషాలలోకి వెళ్ళేముందు అక్కడి చరిత్ర తెలుసుకుందాం. అప్పుడు అక్కడి ప్రాంతాలతో పరిచయం ఏర్పడుతుంది. సుమారుగా క్రీశ 600 కాలంలో జమైకా తీరప్రాంతాలలో ప్రజలు నివసించిన ఆనవాళ్ళు ఉన్నాయట. ఆ తరువాత సౌత్ అమెరికా నుండి టహానాస్(Taíno) జాతి ప్రజలు వలస వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది.
క్రీశ 1200 నాటికి వారు ఇల్లూ, వాకిలీ, ఊరు, వాడా ఏర్పరుచున్నారు. కుర్చీలు, మంచాలు లాంటి సామానులు వెండి, బంగారాలు సమకూర్చుకున్నారు. ఆటా పాటా కూడా ఉండేవట. గ్రామాలు నిర్మించుకుని, గ్రామ పెద్దల పాలనలో సుఖంగా కలసి మెలిసి జీవించేవారట.
అలా ఎప్పటివరకూ అంటే కొలంబస్ కి అక్కడో ద్వీపముందని తెలిసే వరకూ. అంటే క్రీశ 1450కు. ఆ తరువాత మొదలైయ్యాయి వారి కష్టాలు. స్పానిష్ వారు రావడం ద్వీపాన్ని ఆక్రమించుకోవడం, ఆ తరువాత స్థానికులు పేరు తెలియని రోగాలతోనూ, బానిసత్వం భరించలేకనూ చనిపోవడం, కొందరు పర్వతాల మీదున్న అడవులలోకి పారిపోవడం జరిగాయట. అలా పారిపోయిన వారిని మెరూన్స్ (Maroons) అంటారు.
క్రీశ 1200 నాటికి వారు ఇల్లూ, వాకిలీ, ఊరు, వాడా ఏర్పరుచున్నారు. కుర్చీలు, మంచాలు లాంటి సామానులు వెండి, బంగారాలు సమకూర్చుకున్నారు. ఆటా పాటా కూడా ఉండేవట. గ్రామాలు నిర్మించుకుని, గ్రామ పెద్దల పాలనలో సుఖంగా కలసి మెలిసి జీవించేవారట.
www.jamaicaglobalonline.com |
ద్వీపంలో గొప్ప బంగారం నిధులేమీ లేవని స్పానిష్ వారికి తెలిసిపోయింది. ఆ ద్వీపాన్ని ఆహారం, తోలు పంపిణీ చేసే కేంద్రంగా వాడుకున్నారు. మరి ఈ పనులన్నీ చెయ్యడానికి మనుషులు కావలిగా. అందుకోసం ఆఫ్రికా నుండి నల్లజాతీయులను బానిసలుగా తీసుకొచ్చారు.
క్రీశ 1509–1655 వరకూ స్పానిష్ వాళ్ళు జమైకా లో స్థావరాలు ఏర్పరచుకున్నారు. అక్కడ బంగారం కూడా లేదు ఇక పోయేదేం ఉందిలే అని వాళ్ళు ద్వీపాన్ని పెద్దగా కట్టుదిట్టం చెయ్యలా. అప్పుడు జరిగిందట మరో పెద్ద ఘోరం. ఇంగ్లాండ్ వాళ్ళు ద్వీపానికి వచ్చి ఇక మీరు పొండని స్పానిష్ వారిని తరిమేశారు. వీరు క్రీశ 1655–1962 వరకూ ఆ ద్వీపాన్ని ఆక్రమించుకున్నారు.
బానిస్వత్వపు కోరల నుండి తప్పించుకుని పర్వతాలలో నివాసం ఏర్పరచుకున్నారు. వీరి ననుసరించి ఎంతో మంది అలా అడవులలోకి వెళ్ళిపోయారట. వీరంతా కలసి నేనీ అధ్వర్యంలో యూరోపిన్ల మీద దాడి చేసి దాదాపుగా వెయ్యిమందిని బానిసత్వం నుండి విముక్తి కలిగించారు.
https://www.youtube.com/watch?v=-US3_OxhEsk
https://www.youtube.com/watch?v=3cm-WFvOpLI
https://en.m.wikipedia.org/wiki/Nanny_of_the_Maroons
sites.google.com/site/thejamaicanmaroons |
బ్రిటిష్ వారు అక్కడ చక్కెర ఉత్పత్తి చేయడం మొదలు పెట్టారు. చక్కెర అంటే మరి మాటలు కాదు బోలెడంత మంది పని వాళ్ళు కావాలి. ఆఫ్రికా నుండే కాక ఆసియా ఖండం నుండి ముఖ్యంగా చైనా, ఇండియా నుండి పనివాళ్ళను తీసుకుని వచ్చారు. అలా వెళ్ళిన మన వాళ్ళను జమైకాలో కూలీ అని పిలిచేవారట. చైనా వారికి ఎక్కడైనా సులువుగా కలిసిపోయే తత్వం ఉంది. కాబట్టి వారు అక్కడివారితే తేలికగా కలిసిపోయారు. ఇక మిగిలింది మనం. భారతీయులను మిగిలిన వారందరూ చాలా చిన్న చూపు చూసేవారట. జీతం కూడా మిగిలిన వారికంటే తక్కువ ఉండేదట. అప్పుడే కాదు ఇప్పటికీ కూడా ఇండియన్స్ అని చెప్పాలంటే కూలీ అనే అంటారు.
ఇక చక్కర ఉత్పత్తి పెంచడం అధిక సంఖ్యలో బానిసలను తీసుకురావడం ఇలా జమైకాలో ఆంగ్లేయుల కంటే ఆఫ్రికన్ల సంఖ్య బాగా పెరిగి పోయింది. ఈ అడవులలోకి వెళ్ళి ఎవరి ఆధిపత్యానికి లొంగక స్వతంత్రంగా జీవిస్తున్న మెరూన్స్ తరువాత వచ్చిన ఆఫ్రికన్స్ తో కలసి చేసిన యుద్దాల ఫలితంగా 1962 ఆగస్ట్ 6 వ తేదీన జమైకాకు స్వాతంత్య్రం వచ్చింది. అదీ క్లుప్తంగా కథ. వివరించాలంటే భాషకందని దారుణాలు, శతాబ్దాల తరబడి బానిసత్వం. అణచివేత, మెరూన్స్ వీరోచిత పోరాటాలు... చెప్పుకోవాలంటే చాలా ఉంది.
http://toronto.mediacoop.ca/ |
టహానా(Taíno) అని వీరికి పేరెలా వచ్చిందంటే, కొలంబస్ మొదటిసారి వీరిని కలసినప్పుడు వాళ్ళు "టహానా టహానా" అన్నారట. అంటే దానర్ధం మేము మంచి వారిమి అనట. కొలంబస్ కు వారి అరవకన్ భాష రాదుగా వాళ్ళు టహానా తెగ అనేసుకుని ఆ పేరు స్థిరం చేసేశారు. ఈ ద్వీపాన్ని స్థానికులు గ్జెమైకా అనేవారట అంటే కొయ్య, నీటి ప్రాంతం అని అర్ధం. అది క్రమేనా జమైకాగా మారింది. మనం వాడే హామక్, కనో, బార్బిక్యూ, టుబాకో, హరికేన్ ఈ పదాలన్నీ ఆ భాషనుండి వచ్చినవే.
మెరూన్స్ చేసిన యుద్దాల గురించి చెప్పుకోవాలంటే నేనీ(Nanny) "క్వీన్ అఫ్ మెరూన్స్" గురించి చెప్పుకోవాలి. నేనీ తన సోదరులతో కలసి
http://funtimesmagazine.com |
మెరూన్స్, నేనీ వారి వీరోచిత పోరాటాలు గురించి ఈ క్రింది లింక్స్ లో తెలుసుకోవచ్చు. ఇంత హింసకు, పీడనకు గురై ఎన్నో విధాల బాధలు అనుభవించిన ఆ ద్వీప ప్రజలు ఎలా ఆలోచిస్తారు? డబ్బు, నాగరికతలలో అన్ని విధాల ముందున్నాయని చెప్పబడుతున్న దేశ ప్రజలు జమైకాను సందర్శించినపుడు అక్కడి వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? స్వాతంత్య్రం తరువాత అక్కడి స్థితి గతులలో వచ్చిన మార్పులు ఏమిటి? వారి ఆర్ధిక పరిస్థతి ఎలా ఉంటుంది? అక్కడి ఆచార వ్యవహారాలు, చూడవలసిన ప్రదేశాలు వీటన్నిటి గురించి తరువాత చెప్పుకుందాం.
https://www.youtube.com/watch?v=-US3_OxhEsk
https://www.youtube.com/watch?v=3cm-WFvOpLI
https://en.m.wikipedia.org/wiki/Nanny_of_the_Maroons
ReplyDeleteఎన్నాళ్ళ కెన్నాళ్ళకు !
హారీ బెల్లా ఫాంటే ని గుర్తుకు తెచ్చేరు :)
జిలేబి
మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయో నాకెప్పటికీ అశ్చర్యమే. థాంక్ యు జిలేబి గారు.
Delete