రోమ్ కు వెళ్ళిన మూడవ రోజు ఉదయాన్నే ఏడు గంటలకల్లా మెట్రోలో వాటికన్ సిటీ కు బయలుదేరాము. వాటికన్ సిటీ రోమన్ కాథలిక్స్ కు పవిత్రమైన ప్రదేశం. ఆ దేశం పోప్ ఆదేశానుసారం నడుస్తుంది. మరో విశేషం కూడా ఉంది, అది ప్రపంచంలోనే అతి చిన్న దేశం, అంతా కలిపి పంతొమ్మిది మైళ్ళు ఉంటుంది. అక్కడ చూడవలసినవి వాటికన్ మ్యూజియమ్స్, సెయింట్ పీటర్స్ బసిల్లికా, సిస్టీన్ చాపెల్.
వాటికన్ సిటీ చూడడానికి ముందుగానే టూర్ బుక్ చేసుకున్నాము. మెట్రో దిగి టూర్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళే సరికి ఏడున్నర అయింది. ఆ ఆఫీస్ పక్కనే ఉన్న కేఫ్ లో బ్రేక్ ఫాస్ట్ చేసేసరికి టూర్ గైడ్, టూరిస్ట్ లు అంతా సిద్దంగా ఉన్నారు.
టూర్ ఆఫీస్ నుండే మొదలైంది మా టూర్అ. టూర్ ఆఫీస్ కు వాటికన్ సిటీ నడిచే దూరంలోనే ఉందండంతో అక్కడకు నడుస్తూ వెళ్ళాము. వెళ్తున్నాంత సేపూ గైడ్ ఆ సిటీ విశేషాలు చెప్తూ ఉన్నాడు. హెడ్ ఫోన్స్ పెట్టుకోవడంతో అతను చెప్పేది స్పష్టంగా వినిపించింది.
మేము వెళ్ళేసరికి వాటికన్ సిటీ గేట్ ఇంకా తెరువలేదు కానీ అప్పటికే అక్కడ పెద్ద లైన్ ఉంది. మేము టూర్ టికెట్స్ తీసుకున్నాము కాబట్టి తలుపులు తెరిచిన వెంటనే మమ్మల్ని లోపలకు పంపించారు.
నేలంతా మార్బుల్స్ పరిచి అక్కడక్కడా అందమయిన డిజైన్స్ ఉన్నాయి.
ఎంతో ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఆ మ్యూజియం లో ఉన్న మ్యాప్ లు. పదహారవ శతాబ్దంలో ఇటాలియన్ రీజియన్ ను విపులంగా చిత్రీకరించిన వారి పరిజ్ఞానికి జోహార్లు.
మ్యూజియమ్ లో ఉన్న సిస్టీన్ చేపెల్ లో ఎటు చూసినా వర్ణ చిత్రాలు. చిత్రాలు గోడల మీద వేయడం సరే పైకప్పు మీద వేయడం ఎంత కష్టం. అవన్నీ వేయడానికి మైకెలాంజిలో కి నాలుగు సంవత్సరాలు పట్టిందట.
మ్యూజియమ్ నుండి సెయింట్ పీటర్స్ బసిల్లికాకు వెళ్ళాము. అద్భుతం మరో మాట లేదు. అక్కడ స్తంభాలు, గోడలు, పైకప్పు ఎంతో శ్రద్ధతో చెక్కినట్లు ఉన్నాయి. శిల్పాలైతే చెప్పనే అక్కర్లేదు. ఒక శిల్పంలో దుప్పటి మడతలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో విశేషం అక్కడ ప్రశాంతత. ఎంత మంది మనుషులు ఉన్నా, నిశ్శబ్దంగా, శుభ్రంగా ఉంది ఆ ప్రాంతం అంతా.
Which month did you go andi
ReplyDeleteజూన్ 2 వ వారంలో రోమ్ లో ఉన్నాము.
ReplyDelete