ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం వారు ‘నెల నెలా తెలుగు వెలుగు’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా “నా భాషే నా శ్వాస” అనే అంతర్జాల దృశ్యాసమావేశాన్ని నిర్వహించారు. దానికి నన్ను విశిష్టి అతిధి గా ఆహ్వానించినందుకు తానా వారికి, నిర్వాహకులు డా. తోటకూర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఆ నాటి అంశం “మన మాతృభాషా పరిరక్షణలో మీ కృషి, మీ సూచనలు”. దాదాపుగా నాలుగు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రంలో తెలుగు భాష కోసం కృషి చేస్తున్న మహానుభావులను కలుసుకోవడం, వారు చేస్తునటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకోవడం జరిగింది.
అమెరికా మరియు ఇతర దేశాలలో తెలుగు నేర్చుకుంటున్న పిల్లలకు సులభంగా అర్ధమై, ఆసక్తిగా నేర్పించడానికి మా పాఠశాల చేస్తున్న కృషి, ఆచరిస్తున్న విధానాలు వివరించాను. ఆ కార్యక్రమం లింక్స్ ఇచ్చాను, ఆసక్తి ఉన్నవాళ్ళు చూడవచ్చు.
No comments:
Leave your Comment
వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.