కొట్టకల్ లో ఉన్న మూడు వారాలలో ఒక్క సినిమా చూడలేదు, పగలంతా ఎవరినీ కలిసిందీ లేదు. ఉదయాన్నే పార్కులో నడక, కాంటీన్ లో టిఫిన్, పుస్తకాలు చదవడం, సాయంత్రం గుడి దగ్గర అక్కడకు వచ్చిన వాళ్ళతో కబుర్లు, రాత్రి భోజనం, ఇలా ఉండేది దినచర్య. ఎప్పుడూ చుట్టూ మనషులు, ఉద్యోగాలు, వారాంతంలో పాఠశాల, పార్టీలు ఇలా హడావిడిగా ఉండే మా ఇద్దరికీ చాలాకాలం తరువాత తీరుబడి చిక్కింది. జీవితపు ఈ మజిలీలో కలకాలం గుర్తుంచుకోవలసిన పరిచయాలు, గుర్తుండిపోయే క్షణాలు కొన్ని.
వివేక్ విజయన్, పి.కె.వారియర్ గారి మనుమడు, అక్కడే కైలాసమందిరంలో ఉంటున్నారు. వివేక్ బహుముఖ ప్రజ్ఞాశాలి, వేదం చదువుకున్నారు, ఆస్ట్రాలజీ తెలుసు, రచయిత. జీవితం విసిరిన సవాల్ ను ఆత్మస్థైర్యంతో ఎదుర్కుంటున్న అతనిని చూసి ఎంతో నేర్చుకోవచ్చు అనిపించింది.
డాక్టర్ సరోజ్ బజాజ్, అక్కడకు పేషెంట్ గా వచ్చారు. హిందీ సాహిత్యంలో పి.హెచ్.డి పట్టా పుచ్చుకుని, ప్రొఫెసర్ గా పనిచేసి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. హైదరాబాద్ లో మహిళల కోసం సుమన్ జూనియర్ కాలేజ్, మహిళా దక్షత సమితి కాలేజ్ ఫర్ విమెన్, సుమన్ వొకేషనల్ కాలేజ్ ఫర్ గాళ్స్, నర్సింగ్ కాలేజ్ లు నడుపుతున్నారు. పేద విద్యార్థినిలకు అక్కడ పూర్తిగా ఉచితం. నేషనల్ సిటిజన్స్ అవార్డ్, మహిళా శిరోమణి, మహిళా రత్న పురస్కార్, బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డ్ లాంటి ఎన్నో అవార్డ్స్, బంగారు పతకాలు రాష్టపతి గ్యాని జైల్ సింగ్ యాదవ్, మదర్ థెరిస్సా, శంకర్ దయాళ్ శర్మ గారి సతీమణి విమలా శర్మ లాంటి నుండి అందుకున్నారు.
నేను సరిగ్గా చదవలేదేమో..అసలు మీరు ఇక్కడ దేని గురించి వైద్యం చేయించుకున్నారు తెలియచేస్తారా ?
ReplyDeletehttp://themmera.blogspot.com/2023/01/6.html పోస్ట్ లో ఇక్కడకు ఎలాంటి సమస్యలతో వస్తారో వ్రాసానండి. ఇంకా వివరంగా కావాలంటే https://www.aryavaidyasala.com/index.php ఈ సైట్ లో ఫోన్ నంబర్ కు ఫోన్ చేస్తే డాక్టర్ తో మాట్లాడొచ్చు.
Deleteమాబంధువులు కొట్టకల్ ఆర్యవైద్యాశాలలో వైద్యం చేయించుకున్నారట. అక్కడ వైద్యం చాలా ఖరీదు అన్నట్లుగా చెప్పారు. అలాగే తెలుగువాళ్ళకు అక్కడి భోజనం తినటం కష్టం అని కూడా అన్నారు.
ReplyDeleteశ్యామల రావు గారు అక్కడ ట్రీట్మెంట్ కు ఎంత ఖర్చు అవుతుందో http://themmera.blogspot.com/2023/01/3.html ఈ పోస్ట్ లో రాసాను. ఒకప్పుడు అక్కడ భోజనం బావుండేది కాదట. ఇప్పుడు బావుంటోందని తరచుగా అక్కడకు వస్తున్న వాళ్ళు చెప్పారు.
Deleteఆరోగ్యం బాగవటం ముఖ్యమా భోజనం ముఖ్యమా ? :)
DeleteThanks for covering most of your experience in Kottakkal. Sure this will be very useful for those needed.
ReplyDelete