'ఈ పూట కాస్త ఇల్లు సర్దుదా౦' అని పైఅరలో వున్నడబ్బా కిందకు దించి మూత తెరిచాను. కళకళ్ళాడుతూ దేవతల బొమ్మలు, తళతళలాడే తులసి కోటలు, ముచ్చటైన కుంకుమ భరిణలు, మిలమిలలతో వెండిపూలు, ఇంకా అలాంటివే ఏమిటేమిటో దర్శనమిచ్చాయి. "ఇవన్నీ ఏమిటి?" అనుకుంటున్నారా....మీకంతా వివరంగా చెప్తాగా. సత్యన్నారాయణ స్వామి వ్రతాల తాలూకు వెండి కుంకుమ భరిణలు, గృహప్రవేశానికి తులసి చెట్లు, బారసాల కృష్ణులు, ఓణీల పండుగల లక్ష్మీదేవి బొమ్మలు... లాంటివన్నమాట. పాప౦ ఇచ్చిన వాళ్ళు గుర్తుగా ఉంటుందనుకుంటారు. ఓ పది భరిణలు, ఎనిమిది తులసి చెట్లు, తొమ్మిది దేవతలు, ఓ ఇరవై ముచ్చటైన పూలలో ఎవరేది ఇచ్చారో ఎలా గుర్తుపెట్టుకోవడం? ఈ రోజుల్లో బారసాల పిల్లాడి పేరే గుర్తుండడం లేదు ఇక ఈ వస్తువులనేం గుర్తుపెట్టుకుంటాం. వీటన్నింటినీ ఇప్పుడేం చేయాలి? సరే వాటిని పక్కన పెట్టి బెడ్రూం క్లోజెట్ దగ్గరకు వెళ్లాను.
ఇంద్రధనస్సుకొన్ని వందల ముక్కలై అరల్లో సర్దుకున్నట్లుగా గుట్టలు గుట్టలుగా బట్టలు. కొన్నింటికి మెరుపులు అద్దినట్లు తళుకులు కూడానూ...అన్ని బట్టలు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోయి గుండ్రాలు చుడితే...డాలరు ఖర్చు పెట్టడానికి యాభైఐదు సార్లు ఆలోచించే నేను రెండేళ్ళ వరకూ రాముకదా అని కట్టలు కట్టలు వెచ్చించిన సందర్భాలు గుర్తొచ్చాయి. స్వయ౦కృతాపరాధం అంటారా...అబ్బే అదేం కాదు పూర్తిగా వినండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంటికి వెళితే జాకెట్ ముక్క పెట్టడాలు మొదలెట్టారు. ఏదో మన సాంప్రదాయం ప్రకారం బొట్టుపెడితే బావుంటుంది. పైగా ఇప్పుడు మాచింగ్ జాకెట్లూ, డిజైనర్ జాకెట్లూ వేసుకు౦టున్నా౦గా, ఆ జాకెట్ ముక్కలనేం చేసుకోవాలో తెలీదు. అది చాలనట్లు గృహప్రవేశాలకు చీరలు కూడానూ.. వద్ద౦టే మరి పద్ధతిగా ఉండదు...ఏదో ఇష్టం లేని మొగుడుతో అయితే సర్దుకుపోగలం కానీ నచ్చని చీర కట్టలేంగా...

ఇండియా నుంచి వచ్చే ముందు రోజు "అమ్మాయ్ నీకోసం ఈ ఉప్పాడచీర తీసిపెట్టాను." అని ఓ పాకెట్ చేతిలో పెడతారు. ఇలా పెట్టిన చీరలే పెట్టె నిండిపోయాక, కొన్న చీరలు మరోపెట్టెలో సర్దుకుని ఇక్కడకు తీసుకొస్తే ఆ బట్టలన్నీ ఇలా అసూర్యంపశ్యలుగా మిగిలిపోయాయన్నమాట. ఈ మధ్య నాలాంటి వాళ్ళకోసమే ఎయిర్ లైన్స్ వాళ్ళు లగేజ్ బరువు తగ్గించారేమో..ఆ వంకనన్నా ఈసారి నుండి తక్కువ సామానుతో రావచ్చు.
ఇక వంటగది విషయానికి వస్తే పూజలు, వ్రతాల బాపతు ప్లాస్టిక్ గిన్నెలు, డబ్బాలు...చిన్నప్పుడే నయం, అమ్మా వాళ్ళు పసుపు కుంకానికి వెళ్తే చక్కగా బొట్టుపెట్టి కాళ్ళకు పసుపు రాసి స్వీటు, హాటు, పండు, ఆకులు, వక్కపొడి పొట్లం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇంటికి రాగానే తినేవన్నీ పిల్లలం తీసేసుకునేవాళ్ళం. పెద్దవాళ్ళు తాంబూలం వేసుకునేవారు. అంతటితో అవి పూర్తయ్యేవి. ఈ సమస్య ఇక్కడే అనుకున్నాను. పోయినసారి ఇండియా వెళ్ళినప్పుడు మా అత్తగారింట్లో ఒక పెద్ద అద్దాల బీరువా నిండా స్టీలు డబ్బాలు కనిపించాయి. మా అత్తయ్యకు స్టీలు అంటే ఇష్టమని తెలుసు మరీ ఇన్ని స్టీలు డబ్బాలు కోనేంత అనుకోలేదు. అయితే మాటల్లో తెలిసిన విషయం ఏమిటంటే అవి ఆవిడ కొనలేదట, జ్ఞాపకార్ధాలవట. అవి అడ్డం రావడం వల్ల ఆవిడ అవసరమైన గిన్నెలు ఎక్కడో పెట్టుకుని ఇబ్బంది పడుతున్నారు.
వంట గదిలో పాంట్రీలోకి వెళ్లాను. అక్కడ మొదటిసారి భోజనానికి వచ్చిన వారు తెచ్చిన గృహోపకరణాలు, గృహాలంకరణాలు....రకరకాల రంగుల్లో, ఆకారాల్లో కనిపించాయి. వాటిని ఎక్కడా పెట్టలేను అలాగని గుడ్ విల్ లో ఇచ్చెయ్యనూలేను. వాటిని తీసెయ్యాలంటే మనం 'గుర్తుగా ఉంచుకుంటాం అని కదా ఇచ్చారు' అనిపిస్తుంది. అవన్నీ ఓ పక్కన పెట్టాను, వాటినేం చెయ్యాలో తెలీదు.
బయట వాళ్ళ సంగతి సరే...ఇంట్లో వున్న వాళ్ళు "సర్ప్రైజ్" అంటూ బర్త్ డేకి, వాలెంటైన్ డేకి, మారేజ్ డే కి, ఇంకా మదర్స్ డేకి పెర్ఫ్యూమ్స్, చిన్న చిన్న డెకొరేటివ్ పీసెస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి లెండి. దేవుడి అర తీశాను. ఓ యాభై మంది వినాయకుళ్ళు, ఇరవై మంది సాయిబాబాలు, కొలువై వున్నారు. ఇండియా నుండి వస్తూ పుణ్య క్షేత్రాలు దర్శించిన వాళ్ళు తెచ్చి ఇచ్చినవి. ఇంకా చిన్న చిన్న పాకెట్ లలో పసుపు, కుంకుమలు. బాబాలు ఇచ్చిన పూసల దండలు...ఈ లెక్కన పోగు చేస్తుంటే కొన్నాళ్ళ తరువాత ఈ ఇల్లు ఓ మ్యూజియంలా తయారవుతు౦దేమో... సాయినాథా నన్ను నువ్వే కాపాడాలి తండ్రీ...
ఇవాళ ఇల్లు సర్దుదామని మొదలుపెట్టి, ఇలా అనేకరకాల వస్తువుల మధ్య చిక్కుకుని, నిండా ఐదున్నర అడుగుల ఎత్తులేని నాకు ఇన్ని బట్టలా అని విరక్తి చెంది, నా బాధను ఈ బ్లాగులో పెడుతున్నాను. ఇలా ఆలోచిస్తుంటే ఓ కథ గుర్తొచ్చింది. ఒక ఫ్యాక్టరీలో పని చేసే ఆవిడ సాయంత్రం వస్తూ వస్తూ కొంచెం బియ్యం, కూరగాయలు, బట్టల సోడా, నూనె, కిరసనాయలు, కాసిని మల్లెపూలు కొనుక్కుని ఇంటికొచ్చి తెచ్చిన వాటితో ఆ రోజు కానిచ్చి ఆ పూట ప్రశాంతంగా నిద్రపోయిందట. ఇలా హృదయం లేని వస్తువుల మధ్య చిక్కుకునే కష్టాలు లేవు కదా ఆవిడకు...అకటా...నీలాకాశం, వెండిమబ్బులు, పచ్చని చెట్లను చూడకుండా, చక్కని పాటలు వినకుండా ఈ రోజు ఇలా బలయ్యానేమిటి?
అంతా వినేసి "మరీ చోద్యం కాకపోతే ఈ మాత్రం దానికి ఓ టపా" అనుకోకండి. ఈ సమస్య చాలా తీవ్రమైనది ముఖ్యంగా నాలాంటి ఇల్లాళ్ళకు. ఈ రోజుల్లో ఏ ఇల్లు చూసినా గడియారంలో అంకెల్లా పొందిగ్గా కాకుండా, చిక్కుపడిన ఊలు దారంలా గజిబిజిగా వుంటోంది. ఇంట్లో అవసరమైన వస్తువులు ఏవీ కనిపించడం లేదు. పైగా అనవసరమైన వస్తువుల కోసం ధనం, సమయం ఎంత వృధా చేస్తున్నామో చూడండి. ఇలా అయితే మరి ఇక జ్ఞాపకం మాటేమిటంటారా? ఒక మనిషినో లేక వేడుకనో గుర్తుపెట్టుకోవాలంటే వస్తువుల మీద ఆధారపడాలా...వారితో గడిపిన సమయ౦ చాలదా...

ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే నాలుగు పండ్లు ఇచ్చి సంతోషంగా వారితో గడిపివద్దాం. మనం ఇచ్చే వస్తువులు వారికి అఖ్ఖర్లేదు. వారికి కావలసినవి/నచ్చినవి వారినే కొనుక్కోనిద్దాం.