Sunday, December 11, 2011

నేనూ దిగనా...

కనిపించినంత మేరా అటూ ఇటూ పెద్ద చెట్లు.... ఎండ పడకుండా రోడ్డుకు గొడుగు పడుతున్నాయి. జీప్ లో పొల౦ చూడడానికి వెళుతున్నాం. మట్టిరోడ్డు పట్టేసరికి సాయ౦త్రమైంది. జీప్ వెనక లేచిన ఎర్రమట్టి, నీరండతో కలసిపోయింది. పొలాల్లో పనిచేస్తున్న మనుషులు జీప్ శబ్దానికి ఆగి చూస్తున్నారు. గతుకుల రోడ్డు మీద జీప్ మెల్లగా వెళుతుంది.
“బుజ్జమ్మా మనమిప్పుడు ఎక్కడకెళ్తున్నామో తెలుసా?” అడిగింది నాన్నమ్మ .
“తోతకు నాన్నమ్మా?”
“గుండూస్ తోటలో ఏముంటయ్ రా?” మామయ్య.
“తోతలో మత్తిలు, చెత్తులు ఉంతయ్”.
“హహహ ‘మత్తిలు, చెత్తులు’ ఉంటాయా, ఎవరు చెప్పారు సుబ్బులూ?” బాబాయ్.
“అమ్మ చెప్పింది బాబాయ్”.
“ఇంకా ఏము౦టాయ్?” బాబాయ్.
“...........”
“చెప్పమ్మా ఇంకా ఏముంటాయి?” తాతయ్య.
“అందలూ నన్నే అదుగుతున్నాలు మీతు తెలీదా?”
“హ హ హ” అందరూ..
చిట్టితల్లి వాళ్ళనాన్న భుజంపై తలవాల్చి పడుకుంది. ఇంకొంచెం దూరం వెళ్ళాక..
“ఇవేం చెట్లయ్యా?” తాతయ్య.
“పామాయిల్ చెట్లు, ఇప్పుడివి బాగా వేస్తున్నారు.” ఇంకో తాతయ్య.
“జ్యోతీ, పాపకు ఇంకో డ్రెస్ పెట్టావా?” అమ్మమ్మ.
“ఆ... రెండు డ్రెస్ లు పెట్టాను. నీళ్ళు చూస్తే అసలాగదు మొత్తం తడిపేసుకుంటుంది.” అమ్మ.
ము౦దున్నదంతా  ఎగువ ప్రాంతం....జీపు పైకి ఎక్కుడం కష్టంగా ఉంది.
“ఏమైంది మస్తాన్?” నాన్న.
“అప్ లో జీప్ ఎక్కలేకపోతుంది సార్?” మస్తాన్.
“బరువెక్కువైనట్లుంది, కొంచెం జీప్ ఆపు మస్తాన్, మేం దిగుతాం.” బాబాయి. 
బాబాయి, నాన్న, మామయ్య దిగారు. 
తాతయ్య దిగబోతుంటే “మీరు దిగొద్దులే మామయ్యా” అన్నాడు నాన్న.
జీపు మరికొంచెం ముందుకు పోయింది.
“అమ్మలూ, అక్కడేవో కనిపిస్తున్నయ్ చూడు.” తాతయ్య.
“ఎత్తల తాతయ్యా?”
“దూరంగా...అక్కడ” తాతయ్య.
“బల్లెలు?”
“హ హ హ “ అందరూ..
“అబ్బో..మా అమ్మకి బర్రెలు కూడా తెలుసే” నాన్నమ్మ.
“చిట్టికన్నలూ, బర్రెల్ని ఇంగ్లిష్ లో ఏమంటార్రా?” అమ్మమ్మ
“ఇంగ్లీచులో....ఇంగ్లీచులో.....”
“బఫెలోస్” అందించాడు తాతయ్య.
“బఫెలోచ్”.
జీపు పైకెక్కడం ఇంకా కష్టమైంది.
“మస్తాన్ జీప్ ఆపయ్యా ఇంకాస్త బరువు తగ్గిద్దాం." తాతయ్య
“నేను కూడా దిగనా?” ఇంకో తాతయ్య. తాతయ్యలిద్దరూ కిందకు దిగుతున్నారు.
అమ్మ దగ్గర నుండి కిందకు జారి “నేనూ దిగనా?” చిట్టితల్లి.
“హహహ” అందరు.


17 comments:

 1. cinnapillalani takkuvagaa amcanaa veyakudadau mari.okkokappudu vaalla spamdana manalni kadilistumdi.

  ReplyDelete
 2. okkokkasari chinnapillalaku vachhina alochana, vivekam peddavallaku vundadu. chinnakathalo chaala baaga chepparu.

  ReplyDelete
 3. Jyothirmayee,

  Where did you get this narrative technic? Grandfather or Grandmother? You sustain interest in whatever you say. congrats.

  ReplyDelete
 4. @జ్యోతిర్మయి గారు హహహ బాగుంది పాపడి మాటలు. ఇలాగే మేము 2 వారాల ముందు తిరుమలకి వెళ్ళాం నా చిన్న అల్లుడికి కోడలికి గుండు కొట్టించి పోగులు వేయాలని. సరే ఎలాగో వచ్చాం కదా అని చిన్నోడితో పాటు పెద్ద అల్లుడికి కూడా కొట్టిన్చాం. సరే ఆ తతంగం అంతా పూర్తయ్యి తీరిగ్గా బైటకొచ్చాం . పక్కన ఇంకొంతమందికి గుండు కొడుతుంటే ఇంతలో పెద్దోడికి ఓ సందేహం వచ్చింది నేను తమ్ముడు మామయ్యా వొళ్ళో కూర్చొని కొట్టిన్చుకున్నాం కదా వాళ్ళు మామయ్యా వొళ్ళో కూర్చొని ఎందుకు కొట్టించుకోవట్లే అని. ఇంక అంతే అందరు గొల్లున నవ్వుకున్నాం. అ చిన్ని మెదడులో ఇంత పేద సందేహమా అని :)

  ReplyDelete
 5. nenu matram diganu comment rayatam lo hahaha bagundi andi

  ReplyDelete
 6. @ బాబాయిగారూ అప్పటికి పాప వయస్సు రెండున్నరేళ్ళ౦డీ. పిల్లలకు పెద్దవాళ్ళను చూసి నేర్చుకు౦టారనడానికి ఇది ఓ చక్కని నిదర్శనం. ధన్యవాదాలు.

  @ గీత యశస్వి గారూ...ధన్యవాదాలండీ..

  @ మూర్తిగారూ అదే౦ లేదండీ..ఏదో తోచినట్లుగా వ్రాస్తున్నాను. మీ లాంటివారి ప్రోత్సాహం అంతే. ధన్యవాదాలు.

  ReplyDelete
 7. @ కళ్యాణ్ గారూ..మీ అల్లుడికి భలే సందేహం వచ్చిందండీ..రెండు వారాలక్రితం చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేసారన్నమాట. బావుంది. ధన్యవాదాలు.

  @ తెలుగు పాటలు గారూ అస్సలు దిగొద్దండీ.
  :)
  ధన్యవాదాలు.

  ReplyDelete
 8. “నేనూ దిగనా?” చిట్టితల్లి.


  "వద్దులే తల్లీ, మొత్తం జీపునే దింపేశాము" !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 9. @ తెలుగు పాటలు గారూ :)

  @ జిలేబిగారూ..ధన్యవాదములు.

  ReplyDelete
 10. తెలుగు పాటలు బ్లాగ్ కనిపించటం లేదు సంకలిని లో కనపడుట లేదు? మాలిక లో కనపడటం లేదు? మీకు ఎవరికీ అయిన కనిపించినను నాకు తెలియపరచండి
  ఇట్లు
  మీ తెలుగు పాటలు బ్లాగ్
  అడ్రస్: తెలుగువారి వీది,
  ఉరు : ఆంద్రప్రదేశ్
  ఇగా నేను వెళ్లి వెతుకుతా ధన్యవాదములు

  ReplyDelete
 11. తెలుగు పాటలు గారూ మీకు రెండు బ్లాగులు ఉన్నాయా?

  నిన్న బ్లాగులో 'సూరే సె౦ద్రులతోటి, సుక్కల్ల తోటి ఆటాడుకుందాము అడనే ఉందాము' అని పాట పెట్టినట్టున్నారు. మీరెళ్ళమన్నారనుకుని బహుశ అక్కడికెళ్ళి వుంటుంది. మనందరమూ కలసి వెతుకుదాము. మీరేమీ కంగారు పడకండి.

  ReplyDelete
 12. చాలా బాగా లాసాలందీ. ఒక్క చనం ఇలాంతిదే ఓ సంగతన గుల్తొచ్చింది...(చాలా బాగా రాసారండి. ఒక్క క్షణం ఇలాంటిదే ఓ సంఘటన గుర్తొచ్చింది...)

  ReplyDelete
 13. ధన్యవాదాలు తెలుగు భావాలు గారూ..

  ReplyDelete
 14. ఇందు మూలముగా అందరికి తెలియజేయునది ఏమి అనగ? మేము పేరు మార్చుకొని వచ్చాము మా పేరు మీ అందరికి నచ్చుతుంది అని ఆశతో మీ మౌనముగా మనసుపాడినా బ్లాగ్

  ReplyDelete
 15. హహ్హహ్హా... very cute! :)
  కళ్యాణ్ గారూ.. మీ జ్ఞాపకం కూడా బాగుంది.. చిన్నపిల్లలకి భలే భలే సందేహాలొస్తాయి.. :)

  ReplyDelete
 16. @ మౌనముగా నీ మనసు పాడినా గారూ...మీ బ్లాగు పేరు బావుందండీ..మీ బ్లాగులో పాట విన్నప్పట్ను౦చీ మనసులో అదే తిరుగుతోంది..కాని పిలవాలంటేనే చాలా పొడవుగా ఉంది. పిలవడానికో పేరు సూచి౦చ౦డీ..

  @ మధుర గారూ తీరిగ్గా,మఓపిగ్గా బ్లాగులో అవీ ఇవీ చదివి వ్యాఖ్యానించి ప్రోత్సహిస్తున్నారు. ధన్యవాదాలు.

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.