Thursday, December 29, 2011

ప్రయాణం

అటక మీద పెట్టెలన్నీ
నట్టింటికి చేరాయి!

పయనమయ్యే వస్తువులేవో
పెట్టెలోన కూర్చున్నాయి!

అలసి సొలసిన ఇస్త్రీపెట్టె
పగటి నిద్రకు జోగుతోంది!

గోడుకున్న కిటికీలన్నీ
తెరల మాటున తప్పుకున్నాయి!

అరలోని తాళం కప్ప
తలుపు గడియను చేరింది!

ఒంటరియైన ఇల్లు మాత్రం
దిగులు మొహం వేసుకుంది!!

9 comments:

  1. పయనమయ్యే మనుషులలో క్రొత్త ఉత్సాహం నిండింది!

    ReplyDelete
  2. నచ్చేసిందిగా:-)

    ReplyDelete
  3. @జ్యోతిర్మయి గారు

    చాలా బాగా వివరించారు మన వస్తువులు కూడా మనపాటి మనసున్నవే అని అనిపిస్తుంది చదివితే. ఇలా నాకు తోచింది రాస్తున్నాను.
    ఇల్లు మాత్రమే కదండి ఈ కింది రెండు కూడా దిగులు మొహం వేస్కున్నాయి. వారి మనోగతం.

    తాళం కప్ప తాళం చెవి ఇద్దరు మంచి స్నేహితులు. ఎప్పుడు కప్ప చెవితో గుస గుస లాడుతూ వుంటుంది. కాని ఒకరోజు వాళకు బదులు ఇంట్లో గుస గుసలు ఎక్కువైనాయి. అంతా హడావిడిగా వుంది. కప్ప చెవిని అడిగింది చెవి చెవి నేను ఎప్పుడు బైటే వుంటాను నాకు తెలియదు, ఏంటి లోపల ఎప్పుడు లేనంత హడావిడి అని. చెవి చెప్పింది వాళు ఊరెల్తున్నారట అని బిక్కం మొహం వేస్కుంటూ. ఊరెల్తే ఏముంది నువ్ ఎందుకు దిగులుగా వున్నావ్ అని చెవిని అడిగింది కప్ప . చెవి కాస్త దీర్గాలు తీస్తూ అయ్యో కప్ప, ఊరెల్తే నన్ను పట్టుకెల్తారు మనం కలిసి ఉండలేము అని. కప్ప అది విని దిగాలుగా కూర్చుంది. ఇంటిల్లి పాది ప్రయాణమయ్యారు కప్ప చెవి కొన్నాలు విడిపోయారు. కప్పకు ఏమి చేయాలో తోచక అక్కడే ఉండిపోయింది జ్ఞాపకాలు నెమర వేసుకుంటూ. చెవి ఇంకా నేను ఎవ్వరి మాటలు వినను అని అలా ఉండిపోయింది సంచి లోపల. కొన్నాళ్ళ తరువాత తిరిగి వచ్చారు ప్రయాణం ముగిసింది దూరం తగ్గింది ఎంత దూరమైనా నీవు లేకుండా నేను లేను నేను లేకుండా నువ్వు లేవు అని పాడుకుంటూ రెండు సంతోషంగా కాలం గడిపాయి.

    ReplyDelete
  4. చాలా ఆలశ్యంగా చూసానండోయ్.. భలే అల్లేసారు బుల్లి బుల్లి పదాలతో..

    ReplyDelete
  5. @ తెలుగు పాటలు గారు, శర్మ గారు, రసజ్ఞ, పద్మార్పిత గారు, సుబ్రహ్మణ్యం గారు, సుభా..అందరికీ ధన్యవాదాలు..

    @ కళ్యాణ్ గారూ..తాళం కప్ప, చెవి స్నేహం చాలా బావుందండీ..ధన్యవాదాలు..

    ReplyDelete
  6. ఒంటరియైన ఇల్లు మాత్రం
    దిగులు మొహం వేసుకుంది

    ఎంత నిజ్జం ఇది.
    చాలా నచ్చింది.

    ReplyDelete
  7. శైలబాల గారూ..నిన్న బ్లాగంతా చదివినట్లున్నారే. ధన్యవాదాలు

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.