Friday, January 13, 2012

చిట్టి చేతులతో చేసిన బొమ్మల కొలువు


“సంక్రాంతి కదా ఏం చేద్దాం?”
“పిల్లలకు సంక్రాంతి గురించి చెప్దాం”
“ఇంకా...బొమ్మల కొలువు చూపిస్తే ఎలా ఉంటుంది?”
“సూపర్”
“మరి బొమ్మలెలా?”
“ఎవరైనా నేర్పిస్తారేమో చూద్దాం”
“పిల్లలతో చేయిస్తే ఇంకా బావుంటుంది కదూ, వాళ్ళకి ఇలాంటివి చేయడం ఇష్టంగా కూడా ఉంటుంది.”
  

      ఇది టీచర్ల మధ్య జరిగిన సంభాషణ. అనుకున్న వెంటనే బొమ్మలు చేయడం వచ్చినావిడను అడిగాం, ఆవిడ ఎంతో ఉత్సాహంగా ‘చేయిద్దాం’ అన్నారు. ముందు ఆవిడ దగ్గర ఏమేం బొమ్మలు పిల్లలతో చేయించాలో అవి చేయడం నేర్చుకున్నాము. అమ్మాయిలు, అబ్బాయిలు, సీతారాములు, వినాయకుడు, కొన్ని జంతువులు...... మేం నేర్చుకున్నవి.


తరువాత పిల్లల పేర్లు, వయసుల ప్రకారం ఏయే బొమ్మలు ఎవరెవరు చేయగలరో అలోచించి మొత్తం ముప్పయ్యారు మంది జాబితా తయారు చేసి, నాలుగు విభాగాలుగా విభజించి ఒక్కో విభాగానికి ఎనిమిది మంది పిల్లలు, వారికి నేర్పడానికి ఇద్దరు పెద్దవాళ్ళు ఉండేలా తొలి ప్రణాళిక సిద్దం చేసుకున్నాము.


       తయారీకి కావలసిన వస్తువులు కార్న్ స్టార్చ్ , సాల్ట్ తో తయారు చేసిన క్లే, కావలసిన రంగులన్నీదాదాపుగా ఆవిడే తీసుకుని వచ్చారు. ఓ రెండు పాకెట్లు మేం కూడా చేసి అరిసెల పాకం తిప్పిన మోజు తీర్చుకున్నా౦. బొమ్మలు పెట్టడానికి కావలసిన మెట్లు ‘శామ్స్’ లో అట్టపెట్టెలు కావలసిన సైజులో వెతికి పట్టుకొచ్చాం. ఈ మెట్లు కూడా ఆవిడే చేశారు, ఎంత బావున్నాయంటే...మీరే చూడండి.


     శుక్రవారం పిల్లలొచ్చే గంట ముందే నాలుగు ప్లాస్టిక్ షీట్స్ మీద చేయవలసిన బొమ్మల నమూనాలు, అవసరమైన వస్తువులూ..అన్నీ సిద్దం చేసుకున్నాం. పిల్లలు వచ్చిన వెంటనే నిర్ణీత స్థలాలలో కూర్చుని బొమ్మలు చేయడం మొదలు పెట్టారు.

“అంటీ నేను పిగ్ చేస్తాను”
“అలాగే”
“ఐ లైక్ బేర్”
“తెలుగులో చెప్పు”
నేను బేర్ చేస్తాను”
“అలాగే”
హాండ్స్ ఎలా పెట్టాలి?”
“నాకు రావట్లేదు, కెన్ యు డూ ఇట్?”
“అ అమ్మాయికి కళ్ళు చిన్నవి పెట్టమ్మా”
“ఐ లైక్ ఇట్ లైక్ థిస్”
“సరే కానివ్వు”
“ఆ బొమ్మకు రెండు జడలు వెయ్యాలి”
“నాకు జుట్టు లివ్ చేస్తే ఇష్టం”
“డైనోస్ కి టూత్ పిక్స్ ఒద్దు”
“వుయ్ వాంట్ టూత్ పిక్స్”


ఆ విధంగా కబుర్లు చెప్పుకుంటూ సరిగ్గా అనుకున్న టైంకి బొమ్మలు చేయడం పూర్తిచేయగలిగాము. “అంటీ మా బొమ్మలేవో ఎలా తెలుస్తాయి?” ఓ సందేహం..
“మీ పేర్లు వ్రాసిన కాగితం ఉన్న ట్రేలు ఉన్నాయి చూడండి. వాటిలో పెడదాం.”
  
పిల్లలు వెళ్ళిపోయాక ఆ గది శుభ్రం చేస్తూ “అయితే రంగులు ఎప్పుడు వేద్దాం?”
“ఓ నాలుగు రోజులకు ఆరతాయి అప్పుడు వేద్దాం.” “అయితే బుధవారం అనుకుందాం, ఉదయం తొమ్మిదికి మొదలు పెడదాం. లంచ్ టైం కి  అయిపోతాయి.” “అలాగే”

“జ్యోతీ బొమ్మలెలా ఉన్నాయి?” రెండు రోజుల తరువాత ఓ ప్రశ్న.
“కొన్ని క్షతగాత్రులయ్యాయి, కొన్ని నీరసంగా నిలువలేమంటున్నాయి, మిగిలినవి బావున్నాయి”
“గ్లూతో అంటించి నిలువలేని వాటి కింది క్లే పెట్టిండి” క్లే పెట్టి చూశాను. అమ్మయ్య కొంచెం పరవాలేదు.


బుధవారం నాడు తోమ్మిదిన్నరకల్లా ట్రేలు, రంగులు, బ్రష్ష్ లు, గ్లూ అన్నీ రెడీ..ముందుగా అన్నిటికీ స్కిన్ కలర్, జుట్టుకి బ్లాక్తో మొదలు పెట్టాం..తరువాత వాటి డ్రస్సులు..
“ఈ బొమ్మ చీరకేం రంగేద్దాం?”
“గ్రీన్ అండ్ ఆరంజ్”
“మంచి కంబిననేషణ్”
“ఆ అబ్బాయికి ఆరంజ్ షర్టు వేశారా, ప్యాంటు బ్లాక్ వెయ్యండి బావుంటుంది”
“మా అమ్మాయి చుక్కల చీర కట్టి౦దోచ్”
“ఈ అబ్బాయి పంచ చూడండి యెంత స్టైల్ గా ఉందో”
“వినాయకుడి పంచ బ్రంహ౦డంగా ఉంది”
“సీత మరీ పొట్టిగా ఉందే”
“ఈ అమ్మాయి అచ్చం వాణీశ్రీ లా లేదూ”
“అయ్యో ఆ అమ్మయికి బ్లౌజ్ వెయ్యడం మరచి పోయ్యామే”
“మా అమ్మాయి మందార పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో”
“కళ్ళు, నోరు ఇలా పెట్టాలి”
“అయిబ్రోస్ కూడా పెట్టాను, బావుందా?”
“చాలా బావుంది”

      ఇలా సరదా కబుర్లు చెప్పుకుంటూ రంగులు వేయడం పూర్తి చేశాం. అయితే మేం ఓ మూడు గంటలనుకున్నది కాస్తా సాయంత్రం నాలుగయింది. చెయ్యాల్సిన పని ఇంకా మిగిలే ఉంది. రంగులు ఆరితే కాని మిగతా పనవదు. అంతటితో ఆ పూటకు రాత్రి ఆపి, రాత్రి టచ్ అప్ వెయ్యడానికి బొమ్మలను చూస్తే..

“ఏంటి జ్యోతి ఈ అబ్బాయిలు ఏదో డిఫరెంట్గా ఉన్నారు”
"అయ్యో ఈ అమ్మాయి జడ విరిగిపోయిందే"
"డైనోసర్లు రెండు సిగ్గుతో మొహం ఎత్తలేక పోతున్నాయి"

జాగ్రత్తగా మళ్ళీ ఒక్కో బొమ్మను చూసి చేయాల్సిన మార్పులు చేశా౦. అబ్బాయిలకు మీసాలు పెట్టే సరిగి అందంగా తయారయ్యారు. ఆ విధంగా విజయవంతంగా బొమ్మల కొలువు పెట్టేశా౦.   బాగా నచ్చినవిషయం
అందరూ కూడా అనుకున్న టైం కి రావడం.
పిల్లలు పెద్దలూ అందరూ ఉత్సాహంగా పాల్గొనడం.

ధన్యవాదాలు
అడిగిన వెంటనే ఉత్సాహంగా ముందుకు రావడమే కాకుండా, బొమ్మలు చేయడానికి కావలసిన వస్తువులు, రంగులు అన్నీ తీసుకుని వచ్చిన పెద్ద మనసుకు.  
టీచర్లకు, వాలంటీర్లకు, పిల్లలను సరిగ్గా టైం కి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు.
అల్లరి చేయకుండా బొమ్మలు చేసిన పిల్లలకు.

     మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మనందరిమీద ఉంది. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం... 


36 comments:

 1. జ్యోతిగారూ,మీరు పిల్లలకి ఏమైనా ఫుల్ టైం స్కూల్ నడుపుతున్నారా? లేక వీలు చిక్కినప్పుడు నేర్పిస్తున్నారా?

  ReplyDelete
 2. భాస్కర్ గారూ ఆదివారం సాయంత్రం ఓ గంట తెలుగు తరగతి ఉంటుందండీ..ఈ బొమ్మలు చేయడం కోసం ఆసక్తి ఉన్న పిల్లల్ని పోయిన శుక్రవారం సాయంత్రం ఓ గంటన్నర రమ్మన్నాం. ఇక మిగతా వివరాలన్నీ బ్లాగులోనే ఉన్నాయి. ధన్యవాదాలు.

  ReplyDelete
 3. బొమ్మలు బావున్నాయి. ఇలా ముందుగా అనుకుని అందరూ కలిసి చెయ్యడం ఇంకా బావుంది. సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete
 4. చిట్టిచేతులతో చేసిన చిట్టిపొట్టి బొమ్మలు భలే బాగున్నాయండి!సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete
 5. భలే ఉన్నాయి మీ కొలువు ముచ్చట్లు చిన్నారి బొమ్మలతో చిట్టి బొమ్మలను చేయించారనమాట! మా యూనివెర్సిటీలో పని చేసే వాళ్ళందరి పిల్లలకి ఒక స్కూల్ ఉంటుంది. పదేళ్ళ వయసు లోపు పిల్లలు ఉంటారు. నేను ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళందరికీ పేపరు క్రాఫ్ట్సు నేర్పిస్తా (నెలకొక సారి అంతే!). వాళ్లింకా చిన్న వాళ్ళు కావడంతో కేవలం కాగితంతో, కాగితం గుజ్జుతో నేరిస్తున్నాను.

  ReplyDelete
 6. బొమ్మలు భలే బాగున్నాయి......
  చిట్టి చిట్టి చేతులతో పిల్లలు ఇంత చక్కని బొమ్మలు చేసారంటే నిజంగా మెచ్చుకోవలసిన విషయం....
  మీ అందరి ఓపికకి సవినయంగా నమస్కరిస్తున్నాను....

  మీకూ మీ ఇంటిల్లిపాదికి సంక్రాంతి శుభాకాంక్షలు....

  ReplyDelete
 7. పిల్లలో నేర్చుకోవాలనే తపన వుంటుంది. సృజనాత్మకత పెద్దవారికంటే యెక్కువ. దానిని మీరు బయటకు తెస్తున్న విధానం బాగుంది. మీకు, చిన్నారులకు సంక్రాంతి శుభాకాంక్షలు

  ReplyDelete
 8. Kashtephale vaaru, mee srujanaatmakata mundu maadi eepaati. Annatlu mundugaa bhogi subhaakamkshalu.

  ReplyDelete
 9. భాస్కర రామి రెడ్డిగారు,
  ముఖే ముఖే సరస్వతి. మన చేతిలో యేమీ లేదండి. నాది కాలంతో వచ్చినది, పిల్లలది తెలుసుకోవాలనే తపన

  ReplyDelete
 10. చిట్టి చేతులతో చేయించిన బొమ్మలు ఎంతో ముద్దుగా ఉన్నాయి. పిల్లలతో చేయించి కొలువవ్వటం దేవుళ్ళందరికీ ఇష్టం.
  సంక్రాంతి శుభాకాంక్షలు!

  ReplyDelete
 11. బుజ్జిబొమ్మలు ముచ్చటగా ఉన్నాయండి. సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete
 12. పిల్లలు తమ చిట్టి చేతులతో చేసిన బొమ్మలు ఎంతో ముద్దుగా ఉన్నాయి. టీచర్లకు, చిన్నారులకు, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు!

  ReplyDelete
 13. @ లలితగారూ చాలా రోజులకు కనిపించారు..ధన్యవాదాలు.

  @ పద్మార్పిత గారూ ధన్యవాదాలు.

  @ రసజ్ఞా మంచి పని చేస్తున్నావు..ధన్యవాదాలు.

  @ మధురవాణి గారూ ధన్యవాదాలు.

  ReplyDelete
 14. @ మాధవి గారూ బొమ్మలు చేయడం వారిక్కూడా చాలా నచ్చింది. అయ్యో నమస్కారాలు ఎందుకండీ..మీతో పంచుకుందామనే ఈ టపా..మీ సహృదయతకు ధన్యవాదాలు.

  @ బాబాయి గారూ మీ శుభాకాంక్షలను చిన్నారులకు అందజేస్తానండీ..ధన్యవాదాలు.

  ReplyDelete
 15. @ చిన్ని ఆశ గారూ ధన్యవాదాలు.

  @ బాలూ గారూ ధన్యవాదాలు.

  @ నాగేంద్ర గారూ మీ శుభాకాంక్షలు పిల్లలకు, టీచర్లకూ
  అందజేస్తానండీ..ధన్యవాదాలు.

  ReplyDelete
 16. !! జ్యోతిర్మయి !!గారు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. ఈ సంక్రాంతి ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!!

  ReplyDelete
 17. జ్యోతిర్మయి గారూ..
  "చిట్టి చేతులతో చేసిన బొమ్మల కొలువు"
  చాలా బాగుందండీ..
  మీకు,పిల్లలకు సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete
 18. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు, భారతీయులకు, ప్రపంచ వ్యాప్త హిందూ సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.....

  ReplyDelete
 19. ఆ బుజ్జి బుజ్జి బంగారు చేతుల మలచిన బొమ్మలు ఎలా ఉన్నాయో చెప్పటం సాధ్యమేనా!!! మీ అందరికీ ఆనందమయ శుభాకాంక్షలు.

  ReplyDelete
 20. చిట్టి చేతుల తో చేసిన బొమ్మలు ముచ్చటగా వున్నాయి .
  సంక్రాంతి శుభాకాంక్షలు .

  ReplyDelete
 21. @జ్యోతిర్మయి గారు
  మీ ఈ ప్రోత్సాహకరమైన పనులు అది చిన్న పిల్లలతో చేయించడం అనేది చాలా బాగుంది. భవిష్యత్తు రూపకల్పనకు వారే శిల్పులు. అలాంటి వారికి గురువులే దైవ సమానులు. మీ పిల్లలు చాలా అదృష్టవంతులండి . వారి మనసులాగనే అ బొమ్మలు కూడా బాగున్నాయి. "imperfection is the beauty of nature" అని అంటారు చూడండి అ చిన్న పిల్లలు ఇలా చేయడమే అందంగా వుంటుంది వారి ఆలోచనలు ఎంతో విలువైనవి వాటికి ఆరంభానిస్తున్నారే మీరు అది ఇంకా బాగుంది. ఇలానే కొనసాగించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబానికి మీ చిన్నారులకు సంక్రాంతి శుభాకాంక్షలు. :)

  ReplyDelete
 22. చిన్న పిల్లల చేత చేయించిన బొమ్మలు చాలా బాగున్నాయి. ఇలా చేయించాలి అన్న ఆలొచన వచ్చినందుకు అభినందనలు.

  ReplyDelete
 23. చాలా ముచ్చటగా ఉన్నాయండి చిన్నపిల్లలు చేసిన బొమ్మలు.

  ReplyDelete
 24. జ్యోతిర్మయీ వారికి,

  సంక్రాంతి శుభాకాంక్షలు.

  మీ బుజ్జి పండు హాట్రిక్ చేసి సంక్రాంతీ పర్వ దినాన శంకరాభరణం కొలువు చేరి పోయాడు !

  శుభాభినందనలు. !!!


  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 25. @ తెలుగు పాటలు గారూ మీక్కూడా సంక్రాంతి సుభాకాంక్షలండీ..

  @ రాజి గారూ మీ శుభాకాంక్షలు పిల్లలకు అందజేస్తాను. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

  @ రాఫ్ సన్ గారూ మీక్కూడా సంక్రాతి శుభాకాంక్షలు.

  ReplyDelete
 26. @ జయ గారూ పిల్లల బొమ్మలు నచ్చినందుకు చాలా సంతోషం. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

  @ మాలా కుమార్ గారూ బొమ్మలు నచ్చినందుకు చాలా సంతోషం. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

  @ కళ్యాణ్ గారూ..పిల్లలే దైవ సమానులండీ..వారితో కలసి ఏపని చేసినా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇవాళ కొలువు చూడడానికి అందరూ వస్తున్నారు. వారి మోహంలో సంతోషం చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete
 27. @ లాస్య గారూ బొమ్మల కొలువు చూపించేదానికన్నా బొమ్మలు వారితోనే చేయిస్తే ఆసక్తిగా ఉంటుందని చేయించాము. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

  @ రామకృష్ణ గారూ స్వాగతం..పిల్లల బొమ్మల నచ్చినందుకు సంతోషం. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

  @ జిలేబి గారూ చూశానండీ...ఇవాళ ఇంకా రాలేదేమా అని చూస్తున్నాను, వచ్చేశారు.మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు..

  ReplyDelete
 28. మీ సంక్రాంతి బొమ్మలకొలువు శోభని ఇప్పుడే చూసాను.
  పిల్లలలో సృజనాత్మకతను పెంచడానికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం.
  పిల్లలు ప్రాణం పెట్టి చేసిన బొమ్మలు చాలా బాగున్నాయి.
  మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

  ReplyDelete
 29. శ్రీ లలిత గారూ పిల్లల బొమ్మలు నచ్చినందుకు చాలా సంతోషం. మొన్న పండుగ రోజు వచ్చి బొమ్మలు చూసుకున్న వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాడానికైనా ఇలాంటివి చేయిన్చాలనిపిస్తుంది. ధన్యవాదాలు.

  ReplyDelete
 30. chaalaa rojula tarvaata konchem teerika dorikindi yee roju...mee posts daadaapu gaa annee chadivaanu...baagunnaayi

  ReplyDelete
 31. ఎన్నెల గారూ మీ తీరిక సమయాన్ని నా బ్లాగ్ చదవడం కోసం వెచ్చించి నందుకు బోలెడు ధన్యవాదాలు.

  ReplyDelete
 32. అబ్బా.. బొమ్మలు ఎంత బాగున్నాయో! చాలా ముచ్చటగా వున్నయి. Very lively! :)

  ReplyDelete
 33. లక్ష్మి శిరీష గారూ స్వాగతమండీ. మీ కథలంత ముద్దుగా ఉన్నాయా..పిల్లలు మళ్ళీ చేద్దామంటున్నారు. ఈ వేసవిలో చేయాలి. ధన్యవాదాలు.

  ReplyDelete
 34. Replies
  1. జ్యోతిర్మయి గారు స్వాగతమండి. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

   Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.