Monday, January 9, 2012

అమ్మా మన్నుతినంగనే...


        ఆ మూడంతస్తుల భవనంలో మొత్తం తొమ్మిది వాటాలు. మూడొవ అంతస్తులో ముచ్చటగా ఓ చిన్ని కుటుంబం, ఓ అమ్మ, నాన్న, పాప. అప్పుడు సమయం ఉదయం పది గంటలు. గదిలో చిట్టితల్లి లియో టాయ్స్ ముందేసుకుని ఆడుకుంటోంది. అమ్మ వంటింట్లో బెండకాయలు తరుగుతూంది. కాసేపటికి పాప కనిపించలేదు.

చిట్టితల్లీ ఎక్కడున్నావ్?”
ఇక్కలున్నా..
అక్కడేం చేస్తున్నావ్?”
మత్తి తింతున్నా..

అమ్మ పరుగెత్తుకెళ్ళి గోడమూలలో చీమలు పెట్టిన మట్టి దగ్గరున్న పాపను తీసుకుని కుళాయి దగ్గరకెళ్ళి నోరు కడుగుతూ మట్టి యాక్కీ, తినకూడదు నాన్నా
యక్కీ
అవును మట్టి తింటే పొట్టలో పాములు వస్తాయి. ఇంకెప్పుడూ తినకు. పాప పెద్దపెద్ద కళ్ళతో అనుమానంగా చూసింది. అమ్మ చెప్పిన విషయం ఏ మాత్రం నమ్మినట్టులేదు.

     మరోరోజు, ఇంకోరోజు పాప మట్టి తింటూ కనిపించడంతో అమ్మ మట్టి కనిపించిన దగ్గరల్లా కొంచెం కారం కలిపేసింది. ఇంకేముంది పాప కొంచెం నోట్లో పెట్టుకోగానే కారం. అంతటితో ఊరుకుందా మట్టి దొరికే అన్ని ప్రదేశాలకి వెళ్లి రుచి చూసింది. అమ్మ వారం పాటు రోజూ మరచిపోకుండా కారం చల్లింది.

       ఇంతలో సంక్రాంతి పండుగొచ్చింది. పాప, అమ్మ, అమ్మమ్మ గారింటికి వెళ్లేట్టు నాన్న తరువాతొచ్చేట్లు నిర్ణయమైంది. రిక్షా దిగగానే చిట్టితల్లి మొహం సంతోషంతో పుచ్చపువ్వులా విరిసింది. ఎందుకో తెలుసా హైదరాబాదులోలా మట్టి కోసం మూల మూలలా వెతుక్కోనఖ్ఖర్లా ఇక్కడ ఎక్కడ చూసినా మట్టే. అమ్మ చిట్టితల్లి ఆంతర్యం గ్రహించేసి 'మట్టి' ప్రహసనం గురించి అమ్మమ్మ తాతయ్యలకు చెప్పేసింది.  వాళ్ళు పక్కనున్న ఇంకో అమ్మమ్మకు, ఆవిడ వీధిలో వాళ్ళకు ఇలా అందరికీ చెప్పేశారు. దాంతో చిట్టితల్లి 'మట్టి తినడం' గురించి ఊరు వాడా తెలిసిపోయాయి. ఇక కట్టుదిట్టాలు మహా బందోబస్తుగా జరిగిపోయాయి.

     ఒక రోజు ఉదయం తాతయ్య వరండాలో కూర్చుని తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నాడు. పాప గేటు పట్టుకుని ఆడుతూ ఓపిగ్గా ఎదురుచూస్తోంది. ఎదురుగా ఊరిస్తూ వాకిట్లో బోలెడంత మట్టి.

"తాతయ్యా, ఆపీచుకి వెల్లవా?"
"వెళతానమ్మా" పేపర్ పక్కకు తీసి పాపను చూస్తూ.
"తొందరగా వెల్లూ, లేతుగా వెల్తే మీ మాత్తాలు కొలతాలు."
పెద్దగా నవ్వేసి "నేను వెళితే మట్టి తి౦దామనా" అన్నాడు తాతయ్య.
పాప సిగ్గుగా నవ్వేసింది. ఈ పెద్దవాళ్లకి అన్నీ ఎలా తెలిసిపోతాయో అని ఆశ్చర్యపోతూ... 

      అక్కడున్నంత కాలం పాప మట్టి తినకుండా.....పిన్నులో, మామయ్యలో, తాతయ్యలో ఎవరో ఒకరు ఆ చిన్ని ప్రాణానికి. ఆ విధంగా ఊరిలో కూడా మట్టి తినడం కుదరలేదు. పాపా వాళ్ళు పండుగవగానే తిరిగి హైదరాబాదు వచ్చేశారు.  
                                 *      *    *

      పాపావాళ్ళ బిల్డింగ్లో వున్న తొమ్మిది పోర్షన్లలో బోలెడంతమంది పిల్లలు. దాదాపుగా అందరూ ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళే. అందులో మన చిట్టితల్లే చిన్నది. అందువల్ల పిల్లలూ, పెద్దలూ  అందరూ చిట్టితల్లిని చాలా ముద్దు చేసేవారు. రోజూ సాయంత్రాలు పిల్లలు స్కూల్ నుండొచ్చాక  అ౦దరూ టెర్రస్ మీదకెళుతూ చిట్టితల్లిని కూడా తీసుకెళ్ళేవారు.  అమ్మ వాళ్లకు "పాప మట్టితినకుండా చూడమని" బోలెడు జాగ్రత్తలు చెప్పేది. అప్పుడప్పుడూ పైకెళ్ళి తణిఖీలు కూడా చేసేది....పాప చిన్నగా గోడ మూలల్లోని మట్టి తినడం మానేసింది.

       మట్టి తినడమైతే మానేసింది కాని మన గడుగ్గాయి కొత్త మార్గం కనిపెట్టింది. అదేంటంటే గోడకున్న సున్నం నాకడం. అమ్మకు రోజంతా పాపను కాపలా కాయడమే పని. రోజూ లాగే ఆ రోజు కూడా పిల్లలు పాపను మేడపైకి తీసుకెళ్ళారు. అమ్మ రోజూలాగే జాగ్రత్తలు చెప్పింది కూడా..

     ఓ అరగంట గడిచాక, చిట్టితల్లి ఏం చేస్తుందో చూద్దామని అమ్మ పైకి వెళ్ళింది. పైకెళ్ళిన అమ్మ ఆశ్చర్యంగా నిలబడిపోయింది. ఇంతకూ అమ్మకు ఏం కనిపించిందంటారా?

గోడ పొడవునా రెండేళ్ళ చిట్టితల్లికి తోడు పదిమంది పిల్లలు గోడ నాకుతున్న దృశ్యం.
34 comments:

 1. హి హి హి.. గోడలకి కాకరకాయ రసం కలిపి నేరోలాక్ పెయింట్ వేయించండి చేదు తగిలితే గోడలు నాకరు..

  ReplyDelete
 2. హ హ..హ్హ్హ్హ .. పిల్లల మాటలు, అమాయకపు చేష్టలు..పెద్దలకి మురిపాలు. జాగ్రత్త తీసుకుంటాం అనుకోండి. పెద్దయ్యాక వాళ్ళకి చెపితే.. అసలు నమ్మరు.

  ReplyDelete
 3. హ..హ..హ... అప్పుడు చిట్టితల్లి ఒక్కతే కాబట్టి కట్టడి చేయగలిగారు. ఇప్పుడు చిట్టిగ్యాంగ్ మొత్తాన్ని ఎవరు కంట్రోల్ చెయ్యగలరు.

  ReplyDelete
 4. చక్కగా క్యాట్బరీ క్రీం తో గోడలు అంగుళం మందం అద్దొచ్చుగా:-)

  ReplyDelete
 5. @ తెలుగు పాటలు గారూ మీ ఐడియా బావుంది, మనం నేరోలాక్ వాళ్లకు ఇద్దాం. ధన్యవాదాలు.

  @ శ్రావ్య గారూ :)) ధన్యవాదాలు.

  @ వనజ గారూ ఇప్పుడీ విషయం చెపితే మా అమ్మాయి నవ్వేస్తుంది. ఆ నవ్వుకు అర్ధమెంటో మరి. ధన్యవాదాలు.

  @ బాలు గారూ నిజమే సుమండీ..మంచి సందేహమే..ధన్యవాదాలు

  ReplyDelete
 6. @ నారాయణస్వామి గారూ :) ధన్యవాదాలు.

  @ మాలా కుమార్ గారూ :)) ధన్యవాదాలు.

  @ పద్మార్పిత గారూ బావుందండీ పిల్లల తరపున వకాల్తా...ధన్యవాదాలు.

  ReplyDelete
 7. బాల కృష్ణుని లీల ఇది, మీరూ యశోద అయిపోయారు.

  ReplyDelete
 8. hahaha..chitti tallini kaasta mannu tinaniste mee sommem poyindee..mallee peddayyaka tinamante thintundaa yentee??

  ReplyDelete
 9. మనం చేసిన పని మన పిల్లలు చేస్తే తప్పేమిటండీ?.... దహా

  పద్మార్పిత గారి సలహా కి రెండు లైక్ లు.

  ReplyDelete
 10. నాకో సందేహం,

  ఆ చిట్టి తల్లే ఏమన్నా ఇప్పుడు శర్కరీ బ్లాగ్ గోడల్ని అందం గా తీర్చి దిద్దు తుందేమో నని !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 11. చదివిన వెంటనే నాకు గుర్తొచ్చింది ఇది ..... మన్నైనా తినవోయి కాని మసాలా తినకోయి అని, ఈ కాలపు మసాలా కంటే మన్నే మేలు అని చిట్టి తల్లి అప్పుడే చెప్పేసింది కాబోలు ...

  ReplyDelete
 12. @ శర్మ గారూ నిజంగానే చిట్టితల్లి ఆ చిన్ని కృష్ణుడు చేసిన౦త అల్లరి చేసేదండీ...ఒకసారి తప్పనిసరి పరిస్తితులలో చిట్టితల్లిని వాకర్లో ఉంచి సిలిండర్ కి కట్టేయాల్సి వచ్చింది. అయినా నవ్వుకుంటూ దాని చుట్టూ గిరగిరా తిరగడమే..

  @ ఎన్నెల గారూ మీరప్పుడు ఆ చుట్టుపక్కల లేరు ఉంటే నేను చూడకుండా చిట్టితల్లికి మట్టి తినిపించే వారే.
  :) ధన్యవాదాలు.

  @ బులుసు గారూ మీరు కూడా వెనుకేసుకొస్తున్నారా
  అసలు ఇంతమంది చిట్టితల్లి తరపుకు మారిపోతారని తెలుసుంటే నేను ఈ టపా వ్రాయకనేపోదును.
  ధన్యవాదాలు.

  ReplyDelete
 13. @ జిలేబి గారూ చిట్టితల్లి ఆ వయసు దాటేసింది..ఇక ఫరవాలేదు. మన గోడలు క్షేమమే..ధన్యవాదాలు.

  @ కళ్యాణ్ గారూ చిట్టితల్లి సందేశాన్ని చక్కగా అర్ధం చేసుకున్నారు...ఇంకెప్పుడు మసాలా తిన్నా మీ మాటే గుర్తొచ్చేస్తుంది. ధన్యవాదాలు.

  ReplyDelete
 14. జ్యోతిర్మయి గారు,
  హారం పత్రికలో ఈ పేరుతో వచ్చిన కవితలో కొసమెఱుపు చాలా బాగుంది. అభినందనలు.

  ReplyDelete
 15. అబ్బ నాకు మళ్ళీ సున్నం గుర్తుచేసారా...అయ్యో నాలుక జివ్వుమంటోంది. :D

  ReplyDelete
 16. ఆ.సౌమ్య గారు ఏమిటి అలా అనేశారు :-O

  ReplyDelete
 17. పిల్లలను సవ్యంగా పెంచడం అంటే యఙ్ఞం చేసినంత పని...
  బాగా చెప్పారు..

  ReplyDelete
 18. @ మందాకినీ గారూ అక్కడ చదివొచ్చి మరీ ఇక్కడ వ్యాఖ్య వ్రాశారా..చాలా సంతోషంగా ఉందండీ..ధన్యవాదాలు.

  @ అయ్యో సౌమ్య గారూ మీరూనా...
  :) ధన్యవాదాలు.

  @ తెలుగు పాటలు గారూ సౌమ్య గారు ఉత్తుత్తినే అనుంటారు, మీరేమీ కంగారు పడకండి.

  @ లలిత గారూ యజ్ఞమే..ఎంతో ఇష్టంగా చేసే యజ్ఞం..ధన్యవాదాలు.

  ReplyDelete
 19. హహహ చాలా బాగుందండీ..
  చివర్లో ట్విస్ట్ ఐతే అసలు సూపరండీ..

  ReplyDelete
 20. హ హ హ..... భలే బాగా చెప్పారు.....
  పిల్లలంటే అంతే కదా.......!!

  ReplyDelete
 21. no doubt about it andee...oka saari tinipinchi aa tarvaata bcomplex chukkalu , calcium chukkalu moodu pootlaa ...hahahahah

  ReplyDelete
 22. @ వేణూ శ్రీకాంత్ గారూ..స్వాగతం. ఇది పూర్తిగా యదార్ధ గాధేనండీ. పిల్లలు నాకలాగే ట్విస్ట్ ఇచ్చారు మరి. ధన్యవాదాలు.

  @ మాధవి గారూ :)) టపా రాశాక మీకోసం చూడడం నాకు బాగా అలవాటయిపోయింది. ధన్యవాదాలు.

  @ ఎన్నెల గారూ..తిన్నాక వెయ్యాల్సిన మందుకూడా చెప్పేస్తున్నారా! హెంత శ్రద్ద..హెంత శ్రద్ద.
  ఇవాళెందుకో కొంచెం దిగులుగా ఉన్నది మీ వ్యాఖ్య చూడగానే చిరునవ్వు తోసుకుని వచ్చి ఆ పక్క బ్లాగులో ఓ తింగరి కామెంట్ పెట్టి వచ్చా......ధన్యవాదాలు.

  ReplyDelete
 23. బావుంది..కాకపోతే ఎందుకు మట్టి తిన్నావు అంటే వాళ్ళు చెప్పే కారణాలు ఇంకా సూపర్ గా ఉంటాయి.నాకు మీ చిట్టి తల్లి సూపర్ గా నచ్చేసింది.

  ReplyDelete
 24. హహహ! బాగుంది!చక్కగా గోడలన్నిటినీ ఐస్ క్రీముతో చేయిస్తే ఎంత బాగుంటుందో!!!! మా స్నేహితులు కూడా ఇలా చాలా మండే బంక మట్టి, చాక్ పీసులూ, సున్నం, సుద్దా ముక్కలూ, బలపాలూ, పెన్సిళ్ళు, చెట్టు బెరడ్లు, పుల్లలు, ఇలా చాలా చాలా తినేవారు ప్చ్ ఏంటో నేను ఒక్కసారి కూడా రుచి చూడలేదు!

  ReplyDelete
 25. చిన్నికృష్ణులు రోటికిగాక గోడకు కట్టుబడిపోయినట్టుంది!

  ReplyDelete
 26. @ శైలబాలా గారూ చాలా రుజులకు కనిపించారు. ధన్యవాదాలు.

  @ రసజ్ఞా అయ్యో చిన్నప్పుడు నువ్వలాంటివేమీ తినలేదా. నేను కూడా తినలేదు(ట).ప్చ్..పోనీ ఇప్పుడు ట్రై చేద్దామా. ;) ధన్యవాదాలు.

  @ ఉమాదేవి గారూ స్వాగతం..బావుంది మీ వ్యాఖ్య.
  ధన్యవాదాలు.

  ReplyDelete
 27. ayyo digulugaa undaa..alaa digulugaa unnappudallaa 22 number bus ekkesi canadaalo digeyyadame...bus stop lo ninchuni 'ennelaa' ani okka keka pedite chaalu ...aa kekaki evaraite oka nimushamlo haajaravutaaro..adey ennela (nenaa kaadaa annadi tarvaataa alochinchukovachchu)!!!!!

  ReplyDelete
 28. Replies
  1. ప్రియవర్ధానబాబు గారు చిట్టితల్లికి ప్రమోషన్ వచ్చేసిందండి. :) ధన్యవాదాలు.

   Delete
 29. Replies
  1. ప్రియవర్ధనబాబు గారు మీ అభిమానానికి ధన్యవాదాలండి.

   Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.