Tuesday, January 24, 2012

ఓ కన్నీటి బిందువు

ఎద వ్యధగా మసలిన వేళ
రెప్పల మాటున ఒదిగి౦ది!

మనసు భారమై వగచే వేళ
ఓదార్పై నిలిచింది!

చీకటి నిండిన ఏకాంతంలొ
వాగై వరదై పొంగింది!

మబ్బులు వీడిన మరునిముషాన
ఆనవాలే లేక అదృశ్యమైంది !!
24 comments:

 1. మబ్బులు వీడిన మరునిమిషాన ఆనవాలేలేక లేక అదృశ్యమయింది. ఇది బాగుందనుకుంటున్నా. యెప్పుడూ యిలాగే వుండాలని కామన.

  ReplyDelete
 2. "మబ్బులు వీడిన మరునిముషాన
  ఆనవాలే లేక అదృశ్యమైంది !!"
  బాగుందండీ..
  నాకు కూడా ఇదే నచ్చింది.

  ReplyDelete
 3. "ఎద వ్యధగా మసలిన వేళ
  రెప్పల మాటున ఒదిగి౦ది!

  మనసు భారమై వగచే వేళ
  ఓదార్పై నిలిచింది!

  చీకటి నిండిన ఏకాంతంలొ
  వాగై వరదై పొంగింది!"..... నిజంగా ఎంత బాగుందో... నాకు భలే నచ్చేసింది జ్యోతిర్మయిగారు...

  ReplyDelete
 4. మనసు అంతులేని సంతోషం కలిగిన వేళా
  ఆనందభాష్పంలా సంతోషం పంచుకుంది

  నైస్ అండి, అది ఏమిటో తెలియదు గాని నవ్వినా ఏడ్చినా కన్నీరే వస్తాయి...
  చిన్నప్పుడు ఒక సారు చెప్పేవారు ఆడువారికి తలమీద నీటి కుండ ఉంటది అని
  ఏ చిన్న విషయానికి అయినా బడ బడ కన్నీరు కారుతుంది అని

  ReplyDelete
 5. కన్నీటి బొట్టంత నిర్మలంగా భారంగా ఉంది...

  ReplyDelete
 6. @జ్యోతిర్మయి గారు కన్నీటి జీవిత చక్రాన్ని బాగా వివరించారు...
  ఆనవాలు లేని అ మేఘాలు చినుకుల్లా మరల మీ వసంతాల తోటను పూలతో నింపాలని , రంగులు చల్లే సీతా కోక చిలుకలతో కళకళలాడాలని కోరుకుంటున్నాను....

  ReplyDelete
 7. జ్యోతిర్మయి గారూ మీ కవిత చిన్నదే అయినా అందులోని భావం చాలా గొప్పగా ఉంది.

  ReplyDelete
 8. @ బాబాయి గారూ సుఖాంతం ఎప్పుడూ అందంగానే ఉంటుందండీ..మీ అభిమానానికి ధన్యవాదాలు.

  @ అపర్ణ గారూ ధన్యవాదాలు.

  @ రాజి గారూ మీక్కూడా సుఖాంతమే నచ్చుతు౦దన్నమాట. ధన్యవాదాలు.

  ReplyDelete
 9. @ శోభ గారూ కవిత మొత్త౦గా నచ్చేసిందన్నమాట. బోలెడు ధన్యవాదాలు శోభ గారూ..

  @ తెలుగు పాటలు గారూ "నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి" అని మూగమనసుల్లో పాట గుర్తు చేశారు. నేను మీకు మీ మాష్టారిని గుర్తుచేసినట్లున్నాను. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

  @ వాసుదేవ్ గారూ స్వాగతం. చిన్న పదాల్లో అందంగా చెప్పారు. ధన్యవాదాలు.

  ReplyDelete
 10. @ కళ్యాణ్ గారూ చాలా రోజులకు కనిపించారు. ఎలా ఉన్నారు? మీ అభిమానం మెండుగా ఉన్న పూతోట ఎల్లవేళలా వసంతంలా విరిసే ఉంటుందడీ. ధన్యవాదాలు.

  @ నాగేంద్ర గారూ అది అర్ధం చేసుకునే మనసునుబట్టి ఉంటుందండీ..ధన్యవాదాలు.

  ReplyDelete
 11. బాగుందండీ జ్యోతిర్మయిగారు...
  మీ కన్నీటి బిందువు కవితకివే పన్నీటి జల్లులు...
  :-)

  ReplyDelete
 12. @జ్యోతిర్మయి గారు చాలా సంతోషం నేను బాగున్నాను :) ఓ తిక్క పని చేసాలెండి ;) ఓ సాయంత్రం అలా మొక్కలు ఎలా ఉన్నాయా అని చూడటానికి అడవికి వెళ్లాను సాయంత్రం పూట... అంతటితో ఆగక అక్కడ అడవి పండ్లు (చిన్ని రేగికాయి అంటారు) ఆవగింజలాగా వుంటుంది . అది తింటూ జింకల వెంట తిరుగుతూ ఉండిపోయా బాగా ఆలస్యం ఐపోయింది ... అ పులుపు వగరు మంచు కలగలసి గొంతు ముక్కును దాడి చేసాయి ఇంకా రాలేకపోయాను కొన్ని రోజులు ... అది సంగతి :)

  ReplyDelete
 13. చక్కని భావం,స్పష్టమైన వ్యక్తీకరణ!కన్నీటి బిందువు అటు ఆనందానికి ఇటు విషాదానికి రెండింటికీ సమవర్తే కదా!

  ReplyDelete
 14. "ఎద వ్యధగా మసలిన వేళ
  రెప్పల మాటున ఒదిగి౦ది!
  ....
  ...
  మబ్బులు వీడిన మరునిముషాన
  ఆనవాలే లేక అదృశ్యమైంది !!"

  మీ కవిత బావుందండి

  ReplyDelete
 15. @ మాధవి గారూ మీ పన్నీటి జల్లుల్లో కవిత పరవశించింది..ధన్యవాదాలు.

  @ కళ్యాణ్ గారూ అడవిలో జింకలతో ఫ్రెండ్షిప్ అన్నమాట. బావుంది బావుంది..మాకు ఫొటోలన్నీ చూపించండి.

  @ ఉమాదేవి గారు ధన్య్వవాదాలు.

  @ శ్రీకాంత్ గారూ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

  ReplyDelete
 16. ఒక నీటి బిందువు
  ఓ కన్నీటి బిందువు
  ఒక నీతి బిందువు !!  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 17. జిలేబిగారూ ధన్యవాదాలు.

  ReplyDelete
 18. మా మనసులను కదిలించిన క్షణాన
  అందరిని ఆనందపరిచే జ్యోతిర్మయమైంది.....!!!

  ReplyDelete
 19. సంతోష్ రెడ్డిగారూ ధన్యవాదాలు.

  ReplyDelete
 20. ధన్యవాదాలు రామకృష్ణ గారూ..

  ReplyDelete
 21. చిన్న చిన్న పదాలలో ఎంత లోతైన భావాన్ని బంధించారు...

  ReplyDelete
  Replies
  1. థాంక్యు ప్రవీణ గారు..

   Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.