Thursday, February 14, 2013

నీకో అరుదైన బహుమానం ఇవ్వాలని....


కొమ్మపై ఊయలలూగే కోయిలమ్మ నడిగాను 
నీ పిలుపుకన్నా మధురమైన పాటేదీ లేదన్నది! 

మాపటేళ మరులు గొలిపు మరుమల్లియ నడిగాను 
నీ స్పర్శకు మించిన లాలిత్యం తనకేదన్నది! 

తోటలన్నీ తిరిగాను! చెట్టు చెట్టునూ వెతికాను 
నీ మనసుకన్నా అందమైన సుమమేదీ లేదన్నవి ! 

నీరెండ జల్లుల్లో విరిసే ఇంద్రధనస్సు నడిగాను 
నీ నవ్వుకు సరితూగే వర్ణం తన దరి లేదన్నది! 

నిశీధి వీధుల్లో మెరిసే చుక్కని కలిశాను 
నీ కళ్ళలోని కాంతిముందు తన మెరుపేపాటిదన్నది! 

శ్రావ్యమైన పాట కోసం రాగాలను సాయమడిగాను, 
నీ అనురాగానికి మించిన రాగమేదీ లేవన్నవి! 

మదిలోని భావనను కవితను చేసి కానుకివ్వాలనుకున్నాను 
నీ ప్రేమకు సరితూగే భాషలేదని తెలుసుకున్నాను! 

నిండు మనసు తప్ప వేరేమీ ఇవ్వలేని పేదరాలిని 
రిక్తహస్తాలతో నీ ఎదుట నిలిచాను! 

నీ కౌగిలి చేరిన మరుక్షణ౦ రాణినయ్యాను! 
సామ్రాజ్ఞినయ్యాను!! 


26 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు వేణు శ్రీకాంత్ గారు.

      Delete
  2. కవిత చాలా బాగుంది జ్యోతిర్మయి గారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కిషోర్ వర్మ గారు.

      Delete
  3. అతని పిలుపు కన్న నాపాత మథురమౌ
    పాట లేదను ప్రియ భావన గన
    అతని కన్న భువిని నత్యంత సంపన్ను
    డుండ బోడు ప్రేమ భాగ్య శాలి

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారు ఒకరికొకరుగా మెలగు వారివురూ అదృష్టవంతులే...మీ పద్యం చాలా బావుంది. ధన్యవాదాలు.

      Delete
  4. చాలా రోజులకి మీ కవిత మళ్ళీ.
    Simply superb!

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారు బాగానే గమనించారే...వచనం మొదలు పెట్టాక కవిత వ్రాయడం కాస్త కష్ట౦గా వుంది. ధన్యవాదాలు.

      Delete
  5. నిండు మనస్సు-
    ఇంతకంటే గొప్ప బహుమానం ఏముంటుంది చెప్పండి.
    simply superb.

    ReplyDelete
    Replies
    1. హరి గారు నిజమేనండి. ధన్యవాదాలు.

      Delete
  6. మీవారికి ప్రేమికుల రోజు కానుకా? చాలా బాగుందండి

    ReplyDelete
    Replies
    1. హై హై నాయక గారు ఏదో కథాంశం కోసం వెతుకుతుంటే డ్రాఫ్ట్స్ లో సంగం వ్రాసిన కవిత దొరికిందండి. పూర్తిచేసాను. అది యాదృచ్చికంగా ప్రేమికుల రోజే అయింది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.

      Delete
  7. చాలా బావుంది జ్యోతిర్మయి గారు.

    ReplyDelete
    Replies
    1. లోకేష్ శ్రీకాంత్ గారు చాలా రోజులకు కనిపించారే...ధన్యవాదాలు.

      Delete
  8. Replies
    1. ధన్యవాదాలు అనురాధ గారు.

      Delete
  9. భావగీతమొకటి ఎదలోయలలో ఝుమ్మన్నది
    ఎన్నెన్నో కవి సమయాల సాయం కోరుకున్నది
    రాగమైనా అనురాగమైనా మనసులోనే ఉన్నది అని తెలుసుకున్నది
    ఆ హృదయాన మధూదయం అడుగిడినది
    అంత ఒక సామ్రాజ్యమే కట్టెదుట కనబడినది
    దానికి తానే సామ్రాజ్ఞి ఐనది

    అరుదైన భావాలకు అభినందనం
    అందమైన కవితకు కవితాభి వందనం

    ReplyDelete
  10. నీరెండ జల్లులోని విరిసే ఇంద్రధనస్సు నడిగాను,
    ని నవ్వుకి సరితూగే వర్ణం తన దరి లేదన్నది !

    నీ కౌగిలి చేరిన మరుక్షణం రాణినయ్యాను
    సామ్రాజ్ఞినయ్యను

    చాలా చాలా బాగుందండి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు విద్యాసాగర్ గారు.

      Delete
  11. చాలా బావుంది జ్యోతిర్మయి గారు..."మదిలోని భావమును కవితగా.......భాష లేదని తెలుసుకున్నాను" ఇది మాత్రం నాకు బాగా నచ్చేసింది...

    ReplyDelete
    Replies
    1. ఎగిసే అలలు గారు నా బ్లాగుకు స్వాగాతమండి. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  12. కవిత చాలా బాగుంది జ్యోతిర్మయి గారు.
    ఒకసారి మా బృందావనం చూసి మీ అభిప్రాయం తెలియచేయండి
    www.brundavanam.org

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శైలబాల గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.