పెళ్ళి కాకుండానే తల్లిని కాబోతున్నానని దానికి తనను ప్రేమించిన వాడు ఒప్పుకోవడం లేదని ఓ కూతురు తల్లితో చెప్పడం... దానికి ఆవిడ సమాజం, తల ఎత్తుకోవడాలు, భవిష్యత్తు, వగైరా, వగైరాలతో తను బెంబేలుపడి తను కూతుర్ని కంగారు పెట్టి గందరగోళం చెయ్యకుండా ఓ దర్శకుడు ఆ కుటుంబాన్ని, ప్రేక్షకులని కాపాడిన అపురూప చిత్రం పా. దర్శకుడు ఆర్. బాలక్రిష్ణన్.
ఈ జంజాటం అంతా వద్దు అబార్షన్ చేయించుకోమన్న కారణంగా తన ప్రియుడు అమోల్(అభిషేక్ బచ్చన్)కు దూరంగా వచ్చేసి బిడ్డను కంటుంది విద్య(విద్యా బాలన్). కాని ఎలాంటి బిడ్డ పుట్టాడు? ఆరేళ్ళ పిల్లలు అరవై ఏళ్ళ వృద్ధులుగా కనిపించే అరుదైన వ్యాధి ప్రొజేరియాతో. జన్యు కారణమైన లోపం వలన వచ్చే ఈ వ్యాధి బారిన పడిన వారు పదహారేళ్ళకు మించి బ్రతకరు. ఏ పరిస్థితులలో కూడా విద్య అమోల్ సహాయం తీసుకోవాలనుకోక పోవడం ఆ పాత్ర ఆత్మగౌరవానికి నిదర్శనం. ఈ రోజుల్లో హీరోయిన్ పాత్రకు ఇంతటి ఆత్మగౌరవం ఉండడం అరుదైన, అపురూపమైన విషయం కదూ! విద్యా బాలన్ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చారు.
సన్నగా, పీల గొంతుతో ఉండే ఆరో పాత్రలో అంత పొడుగు అమితాబ్ ఎలా సరిపోయారన్నది ఊహకందని విషయం. పైగా డబ్బింగ్ కూడా లేదుట. ఈ సినిమాలో అమితాబ్ తన నటనా కోశల్యం చూపించారు. ఓ విధివంచితుడైన పిల్లాడి చుట్టూ అల్లిన సినిమాలో హృదయాన్ని పిండేసే సన్నివేశాలు ఏవీ కనిపించక పోవడం ఈ దర్శకుని ప్రతిభకు నిదర్శనం. ఈ సినిమాలో మరో ప్రత్యేకత కథలో ఇమిడిపోయిన హాస్యం.
అమ్మమ్మ(అరుంధతీ నాగ్)ను అల్లరి పెడుతూ, సరదాగా సంతోషంగా ఉండే ఆరోకు అసాధారాణమైన తెలివి తేటలు ఉన్నాయి. 'నీ', 'నా' లేకుండా 'మన' అనే భావన ఉండాలని ఓ తెల్లని గ్లోబ్ ను తాయారు చేస్తాడు ఆరో. ఈ దిశలో ఎవరూ అలోచించి ఉండరు కదూ!

ఈ సినిమాలో తోటి పిల్లలు ఆరోతో ప్రవర్తించిన తీరు ఎంతో ముచ్చటేస్తుంది. ఆరో తనకు తెలియకుండానే తండ్రికి దగ్గరౌతాడు. వారిద్దరి ప్రయాణం, అమోల్ మీడియా మీద సంధించిన బాణాలు, అమ్మమ్మతో మనవడి అల్లరి ....ఇవన్నీ చూడవలసిన ఘట్టాలు. ఈ సినిమాలో మనం ప్రధానంగా చెప్పుకోవలసింది క్రిస్టీన్ టిన్స్లే , డామినీ టిల్ మేకప్ గురించి. ఇళయ రాజా సంగీతం సమకూర్చిన శ్రావ్యమైన పాటలను ఇక్కడ వినొచ్చు.
nenu intavaraku chudaledu kaani ippuduchustanandi. tanks.
ReplyDeleteచూశాక ఏమనిపించిందో చెప్పండి మరి.
Delete