“సంక్రాంతి
కదా ఏం చేద్దాం?”
“పిల్లలకు సంక్రాంతి గురించి చెప్దాం”
“ఇంకా...బొమ్మల కొలువు చూపిస్తే ఎలా ఉంటుంది?”
“సూపర్”
“మరి బొమ్మలెలా?”
“ఎవరైనా నేర్పిస్తారేమో చూద్దాం”
“పిల్లలతో చేయిస్తే ఇంకా బావుంటుంది కదూ, వాళ్ళకి
ఇలాంటివి చేయడం ఇష్టంగా కూడా ఉంటుంది.”
ఇది
టీచర్ల మధ్య జరిగిన సంభాషణ. అనుకున్న వెంటనే బొమ్మలు చేయడం వచ్చినావిడను అడిగాం, ఆవిడ ఎంతో
ఉత్సాహంగా ‘చేయిద్దాం’ అన్నారు. ముందు ఆవిడ దగ్గర ఏమేం బొమ్మలు పిల్లలతో చేయించాలో అవి చేయడం నేర్చుకున్నాము. అమ్మాయిలు,
అబ్బాయిలు, సీతారాములు, వినాయకుడు, కొన్ని జంతువులు...... మేం నేర్చుకున్నవి.
తరువాత
పిల్లల పేర్లు, వయసుల ప్రకారం ఏయే బొమ్మలు ఎవరెవరు చేయగలరో అలోచించి మొత్తం
ముప్పయ్యారు మంది జాబితా తయారు చేసి, నాలుగు విభాగాలుగా విభజించి ఒక్కో విభాగానికి
ఎనిమిది మంది పిల్లలు, వారికి నేర్పడానికి ఇద్దరు పెద్దవాళ్ళు ఉండేలా తొలి
ప్రణాళిక సిద్దం చేసుకున్నాము.
తయారీకి కావలసిన వస్తువులు కార్న్ స్టార్చ్ , సాల్ట్ తో తయారు చేసిన క్లే, కావలసిన
రంగులన్నీదాదాపుగా ఆవిడే తీసుకుని వచ్చారు. ఓ రెండు పాకెట్లు మేం కూడా చేసి
అరిసెల పాకం తిప్పిన మోజు తీర్చుకున్నా౦. బొమ్మలు పెట్టడానికి కావలసిన మెట్లు ‘శామ్స్’
లో అట్టపెట్టెలు కావలసిన సైజులో వెతికి పట్టుకొచ్చాం. ఈ మెట్లు కూడా ఆవిడే చేశారు, ఎంత బావున్నాయంటే...మీరే చూడండి.
శుక్రవారం పిల్లలొచ్చే
గంట ముందే నాలుగు ప్లాస్టిక్ షీట్స్ మీద చేయవలసిన బొమ్మల నమూనాలు, అవసరమైన వస్తువులూ..అన్నీ సిద్దం చేసుకున్నాం. పిల్లలు వచ్చిన వెంటనే నిర్ణీత స్థలాలలో కూర్చుని
బొమ్మలు చేయడం మొదలు పెట్టారు.
“అంటీ నేను పిగ్ చేస్తాను”
“అలాగే”
“ఐ లైక్ బేర్”
“తెలుగులో చెప్పు”
నేను బేర్ చేస్తాను”
“అలాగే”
హాండ్స్ ఎలా పెట్టాలి?”
“నాకు రావట్లేదు, కెన్ యు డూ ఇట్?”
“అ అమ్మాయికి కళ్ళు చిన్నవి పెట్టమ్మా”
“ఐ లైక్ ఇట్ లైక్ థిస్”
“సరే కానివ్వు”
“ఆ బొమ్మకు రెండు జడలు వెయ్యాలి”
“నాకు జుట్టు లివ్ చేస్తే ఇష్టం”
“డైనోస్ కి టూత్ పిక్స్ ఒద్దు”
“వుయ్ వాంట్ టూత్ పిక్స్”
ఆ విధంగా కబుర్లు చెప్పుకుంటూ సరిగ్గా అనుకున్న టైంకి బొమ్మలు చేయడం పూర్తిచేయగలిగాము. “అంటీ మా బొమ్మలేవో ఎలా తెలుస్తాయి?” ఓ సందేహం..
“మీ పేర్లు వ్రాసిన కాగితం ఉన్న ట్రేలు ఉన్నాయి
చూడండి. వాటిలో పెడదాం.”
పిల్లలు
వెళ్ళిపోయాక ఆ గది శుభ్రం చేస్తూ “అయితే రంగులు ఎప్పుడు వేద్దాం?”
“ఓ నాలుగు రోజులకు ఆరతాయి అప్పుడు వేద్దాం.” “అయితే
బుధవారం అనుకుందాం, ఉదయం తొమ్మిదికి మొదలు పెడదాం. లంచ్ టైం కి అయిపోతాయి.” “అలాగే”
“కొన్ని క్షతగాత్రులయ్యాయి, కొన్ని నీరసంగా నిలువలేమంటున్నాయి,
మిగిలినవి బావున్నాయి”
“గ్లూతో అంటించి నిలువలేని వాటి కింది క్లే
పెట్టిండి” క్లే పెట్టి చూశాను. అమ్మయ్య కొంచెం పరవాలేదు.
బుధవారం
నాడు తోమ్మిదిన్నరకల్లా ట్రేలు, రంగులు, బ్రష్ష్ లు, గ్లూ అన్నీ రెడీ..ముందుగా
అన్నిటికీ స్కిన్ కలర్, జుట్టుకి బ్లాక్‌తో మొదలు పెట్టాం..తరువాత వాటి డ్రస్సులు..
“ఈ బొమ్మ చీరకేం రంగేద్దాం?”
“గ్రీన్ అండ్ ఆరంజ్”
“మంచి కంబిననేషణ్”
“ఆ అబ్బాయికి ఆరంజ్ షర్టు వేశారా, ప్యాంటు బ్లాక్
వెయ్యండి బావుంటుంది”
“మా అమ్మాయి చుక్కల చీర కట్టి౦దోచ్”
“ఈ అబ్బాయి పంచ చూడండి యెంత స్టైల్ గా ఉందో”
“వినాయకుడి పంచ బ్రంహ౦డంగా ఉంది”
“సీత మరీ పొట్టిగా ఉందే”
“ఈ అమ్మాయి అచ్చం వాణీశ్రీ లా లేదూ”
“అయ్యో ఆ అమ్మయికి బ్లౌజ్ వెయ్యడం మరచి పోయ్యామే”
“మా అమ్మాయి మందార పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో”
“కళ్ళు, నోరు ఇలా పెట్టాలి”
“అయిబ్రోస్ కూడా పెట్టాను, బావుందా?”
“చాలా బావుంది”
ఇలా
సరదా కబుర్లు చెప్పుకుంటూ రంగులు వేయడం పూర్తి చేశాం. అయితే మేం ఓ మూడు గంటలనుకున్నది
కాస్తా సాయంత్రం నాలుగయింది. చెయ్యాల్సిన పని ఇంకా మిగిలే ఉంది. రంగులు ఆరితే కాని
మిగతా పనవదు. అంతటితో ఆ పూటకు రాత్రి ఆపి, రాత్రి టచ్ అప్ వెయ్యడానికి
బొమ్మలను చూస్తే..
“ఏంటి జ్యోతి ఈ అబ్బాయిలు ఏదో డిఫరెంట్‌గా ఉన్నారు”
"అయ్యో ఈ అమ్మాయి జడ విరిగిపోయిందే"
"డైనోసర్లు రెండు సిగ్గుతో మొహం ఎత్తలేక పోతున్నాయి"
జాగ్రత్తగా మళ్ళీ ఒక్కో బొమ్మను చూసి చేయాల్సిన
మార్పులు చేశా౦. అబ్బాయిలకు మీసాలు పెట్టే సరిగి అందంగా తయారయ్యారు. ఆ విధంగా విజయవంతంగా బొమ్మల కొలువు పెట్టేశా౦.
బాగా నచ్చినవిషయం
అందరూ కూడా అనుకున్న టైం కి రావడం.
పిల్లలు పెద్దలూ అందరూ ఉత్సాహంగా పాల్గొనడం.
ధన్యవాదాలు
అడిగిన వెంటనే ఉత్సాహంగా
ముందుకు రావడమే కాకుండా, బొమ్మలు చేయడానికి కావలసిన వస్తువులు, రంగులు అన్నీ తీసుకుని
వచ్చిన పెద్ద మనసుకు.
టీచర్లకు, వాలంటీర్లకు, పిల్లలను సరిగ్గా
టైం కి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు.
అల్లరి చేయకుండా బొమ్మలు చేసిన పిల్లలకు.
మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు
తరాలకు అందించవలసిన బాధ్యత మనందరిమీద ఉంది. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం...