“అమ్మా
ఇవాళ టిఫినే౦టి?” మేడ మెట్లు దిగుతూ మా అమ్మాయి.
“ఏం
కావాలి నాన్నా?”
“దోశ వు౦దా?”
ఇప్పుడే
పిండి గ్రైండ్ చేశాను. రేపటికి రెడీ అవుతుంది.
“ఇడ్లీ
ఉందా?” ఫ్రిడ్జ్ డోర్లు రెండూ తీసి పట్టుకుని.
“లేదు,
ఉప్మా చెయ్యనా?”
“ఇంకేం
లేదా?” ఇంకా ఫ్రిజ్ లోనే వెతుకుతూ..
“ఉహూ..”
“సరే
చెయ్యి”
లాప్
టాప్ తీసి పక్కన పెట్టి లేవబోయాను.
“అమ్మ
ఏదో రాసుకు౦టున్నట్లుంది. ఇవాళ టిఫిన్ మనం చేద్దాం" అంటూ ఒళ్ళో ఉన్న లాప్టాప్ పక్కన పట్టి వంట గదిలోకి వెళ్ళారు శ్రీవారు.
రాయడం మొదలెట్టాను
‘బీటలు
వారిన నేలపై
స్వాతి
చినుకుల
“ఉల్లిపాయలు, చిల్లీస్ ఇంకా ఏం కావలి జ్యోతీ
ఉప్మాకి”
“ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు”
“గుర్తొచ్చాయిలే నువ్వు రాసుకో”
బీటలు
వారిన నేలపై
జీడిపప్పుల
సంబరం!
ఛీ ఛీ జీడిపప్పేమిటి
స్వాతి చినుకుల సంబరం!
"అమ్మలూ ఇది ఉప్మా రవ్వో ఇడ్లీ రవ్వో అమ్మని
అడిగిరా డిస్టర్బ్ చేయకుండా వచ్చెయ్ ఏదో రాసుకుంటుంది పాపం."
ఆ రవ్వేదో
చూపించాను.
మోడువారిన
రవ్వపై ఏ రవ్వబ్బా, ఏ రవ్వేమిటి నా మొహం
మోడువారిన
నేలపై
చివురాకుల
కలకలం!
"జ్యోతీ టమోటోలు అయిపోయినట్లున్నాయే?"
"గరాజ్ ఫిడ్జ్
లో ఉన్నాయ్"
"ఎన్ని
టమోటోలు వెయ్యను?"
"రెండు
వెయ్యండి."
"మూడు
వేస్తా."
"ఎన్నోకన్ని
వెయ్యండి."
"అంత చిరాకెందుకు రాసుకునేప్పుడు చాలా ప్రశాంత౦గా ఉండాలి”
వసివాడిన
పసిమొగ్గ
"లవంగాలు
ఎక్కడున్నాయ్?"
"పా౦ట్రీలో
చిన్న బాక్స్ లో ఉన్నాయ్."
వికసిస్తున్న
లవంగం!
నాన్నా
లవంగాలు వద్దు “ఐ హేట్ లవగంస్.”
“తీసెయ్యడానికి వీలుగా సగం దంచి వేస్తాగా”
“సగం దంచుతారా! ఇంకా నయం సగం దంచి వేస్తే తీయడం కష్టం. పౌడర్ చెయ్యండి కలసి పోతుంది. లేకపోతే మొత్తంగా వేస్తే పిల్లలకు తీయడానికి వీలుగా ఉంటుంది. ”
“యు
ఆర్ రైట్, యు నో వాట్, యువర్ అమ్మా ఈజ్ సో స్మార్ట్”
ఒ౦టరియైన
ఆమ్మకు
నెలవంక
స్నేహితం!
"ఉప్మా ఈజ్
రెడీ. అమ్మలూ ప్లేట్లు గ్లాసులు పెట్టు"
ముసురేసిన
ప్లేటును దాటి
"అమ్మా
డిష్ వాషేర్లో ప్లేట్స్ కడిగినవేనా?"
"ఆ కడిగినవే."
దూసుకు
వస్తున్న రవికిరణం!
"జ్యోతీ
రా టిఫిన్ తిందాం."
"ఒక్క
నిముషం ఇది పూర్తిచేసి వస్తున్నా"
భారమైన
టిఫినుకు
ఆలంబన ఉప్మా
వేదం!!
"చూశావా
నేను ఎంత మంచి హస్బెండునో నిన్నసలు డిస్ట్రబ్ చేయకుండా రాసుకోనిచ్చాను."
":)"
"ఇంతకూ కవితకు ఏం పేరు పెట్టావ్?
"ఉప్మా వేదం"
"ఎలా ఉంది ఉప్మా?"
":)"
"ఇంతకూ కవితకు ఏం పేరు పెట్టావ్?
"ఉప్మా వేదం"
"ఎలా ఉంది ఉప్మా?"