Wednesday, January 11, 2012

హారం పత్రిక 'సరాగ' లో నా కవిత

      హారం పత్రిక నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో నా కవితకు ద్వితీయ బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా హారం పత్రిక సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెలుకు౦టున్నాను. హారం పత్రిక 'సరాగ' ను ఇక్కడ చూడొచ్చు.

చుక్క పొడిచే వేళకైనా...

మంచుతెరను తొలగించుకొని 
భూమిని తాకిందో రవికిరణం!
ఆనందంతో జంటపక్షులు
ప్రభాతగీతం పాడుతున్నాయి! 
రోజులానే!!

నిదురలేచిన నందివర్ధనం 
మనోహరంగా నవ్వుతోంది! 
రెక్కవిచ్చిన మందార౦
సిగ్గురంగును పులుముకుంది! 
ఎప్పట్లానే!!

ఎండవేళ ఆవు, దూడకు
వేపచెట్టు గొడుగయ్యింది!
కొమ్మ మీది కోయిలమ్మ
కొత్త రాగం అందుకుంది!
నిన్నటిలానే!!

పెరటిలోని తులసికోట
దిగులేదో పెట్టుకుంది!
పోయ్యిలోని పిల్లికూన
పక్కకైనా జరగనంది!

చెండులోని మల్లెమొగ్గ 
పరిమళాలు పంచకుంది! 
వీధి గడప ఎవరికోసమో
తొంగి తొంగి చూస్తోంది!

చుక్కపొడిచే వేళకైనా
తలుపు చప్పుడవుతుందా!!

27 comments:

  1. కలము పట్టుకున్న జ్యోతిర్మయి
    కాగితమును తాకిందో ఒక కవిత
    ఆ కవితను చదివి మైమరచి
    ఆనందముతో ఇచ్చారు రసజ్ఞులు
    ఆ కవితకు ద్వితీయ బహుమతి...

    వావ్ చాలా బాగుంది... మీకు ద్వితీయ బహుమతి వచ్చినందుకు మా తెలుగు పాటలు నుంచి మా అభినందనలు... మీరు ఎప్పుడు ఇలా మంచి కవితలు వ్రాయాలని మనసారా కోరుకుంట్టున్నాము...:)

    ReplyDelete
  2. వీధి గడప తొంగి తొంగి చూస్తూ వుంది. జాణ తనమా?బేలతనమా?

    ReplyDelete
  3. మంచి గంధం సుగంధాలను వెదజల్లక మానదు!
    మంచి కవిత సహృదయులను అలరించక మానదు!

    ReplyDelete
  4. శుభాకాంక్షలు జ్యోతిర్మయీ గారు,

    వీధి గడప నొక్క బడితే, వచ్చిన 'మావ'కు పార్టీ దక్కే చాన్సు ఉందంటారా !

    @కష్టే ఫలే వారు,

    ఇది బేలతనం తో కూడిన జాణ తనం - 'అమరిక'తోడి రాగం సరాగం.


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. @ తెలుగు పాటలు గారూ కవితకు కవితనే బహుమతిగా ఇచ్చిన మీ చక్కని వ్యాఖ్య, అంతకుమించి మంచిమనసుతో ఇచ్చిన మీ అభినందన..నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

    @ బాబాయిగారూ నా సమాధానం జిలేబిగారే ఇచ్చేశారు. ధన్యవాదాలు.

    @ సోమార్క గారూ స్వాగతం. చక్కని వ్యాఖ్య మురిపించక మానదు. ధన్యవాదాలు.

    @ జిలేబిగారూ పార్టీలవీ ఇచ్చుకోవడం మన సాంప్రదాయం కాదు కదండీ..ఓ చెంబెడు నీళ్ళు విస్తరి భోజనం ఖాయం. ధన్యవాదాలు.

    ReplyDelete
  6. అందంగా ఉంది మీ కవిత.. ముగింపు వాక్యాలు మరింత అందంగా ఉన్నాయి. సంక్రాంతి బహుమతి గెలుచుకున్నందుకు అభినందనలు. :)

    ReplyDelete
  7. అభినందనలు జ్యోతిర్మయి గారూ..
    మీ కవిత బాగుంది.

    ReplyDelete
  8. అభినందనలు జ్యోతిర్మయి గారు.

    ReplyDelete
  9. మధురవాణి గారూ, రాజి గారూ, లాస్య గారూ, ధన్యవాదాలండీ..

    ReplyDelete
  10. హారం పత్రికవారు నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో మీ కవితకు ద్వితీయ బహుమతి వచ్చినందుకు మా మా అభినందనలు.మీ కవిత'చుక్క పొడిచే వేళకైనా---' మమ్మల్ని ఆకట్టుకుంది. సంక్రాంతి శుభాకాంక్షలు!

    ReplyDelete
  11. మొదట మీకు, మీ కుటుంబ సభ్యులందరికి "సంక్రాంతి సుభాకాంక్షలు".
    My hearty congratulations on your achievement.
    I pray GOD to bless you.

    ReplyDelete
  12. మనసు విచ్చుకున్నప్పుడే మనిషికి అందం. అంత అందంగా ఉందండి మీ కవిత. మీకు నా హృదయ పూర్వక అభినందనలు.

    ReplyDelete
  13. @ నాగేంద్ర గారూ ధన్యవాదాలు. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    @ మూర్తి గారూ ధన్యవాదాలు.

    @ జయ గారూ "మనసు విచ్చుకున్నప్పుడు" చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.

    @ సుధీర్..ఓ ఇవాళ బ్లాగ్ చూసావా..థాంక్ యు.

    ReplyDelete
  14. మొదట మీకు, మీ కుటుంబ సభ్యులందరికి "సంక్రాంతి సుభాకాంక్షలు".
    My hearty congratulations on your achievement.
    I pray GOD to bless you.

    ReplyDelete
  15. తెలుగువారందరికీ వందనం
    ఇంటింటా తెలుగు వెలుగు వెలగాలని ఆకాంక్షిస్తూ మీ ముందుకు వచ్చిన తెలుగువారమండి.నెట్ వెబ్‌సైట్‌కు మీ అందరి ఆదరాభిమానాలు లభిస్తాయని ఆకాంక్షిస్తున్నాను. మీకీ వెబ్‌సైట్ నచ్చినచో ఇతరులకు తెలుపండి.
    www.teluguvaramandi.net

    ReplyDelete
  16. మొదటగా అభినందనలండీ.. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు.

    ReplyDelete
  17. ఇప్పుడే చూసాను మీ కవిత.
    హృద్యంగా వుంది.
    బహుమతి వచ్చినందుకు మనఃపూర్వక అభినందనలు.

    ReplyDelete
  18. @ మూర్తి గారూ ధన్యవాదాలు.

    @ తెలుగు వారూ మీ సైట్ చూశాను. సందేహ నివృత్తి కోసం నాకు చాలా ఉపయోగపడుతుది. ధన్యవాదాలు.

    @ సుభ చాలా రోజులకు కనిపించావు. ధన్యవాదాలు.

    ReplyDelete
  19. @ జాహ్నవి గారూ :) ధన్యవాదాలు.

    @ శ్రీ లలిత గారూ ధన్యవాదాలు...

    ReplyDelete
  20. 'చుక్క పొడిచే వేళకైనా తలుపు చప్పుడౌతుం దా'
    గొప్ప అభివ్యక్తికరణ .మనసును కదిలించింది
    ఇక్కడ తెలుగు మరిచి పోతున్న తరుణంలో
    అమెరికానుంచి ఇంత మంచి కవితలు రావడం ఆశ్చర్యం అద్భుతం .ఈ కలం యిలాగే హృదయ స్పందనలు లిఖించాలని ఆశిస్తున్నాను

    ReplyDelete
  21. నాన్నా నువ్వు బ్లాగు చదవడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  22. ఎప్పటి నుంచో మీ బ్లాగ్ చదవాలనుకుంటున్నాను. ఈ రోజు చదివి తీరాలని కంకణం కట్టుకున్నా..ఒక్కో కవిత చదువుతుంటే, భావాన్ని మనసులో దాచేసుకోవాలనిపిస్తుంది. కళ్ళు మీ కవితల వెనుక పరుగులు తీస్తున్నాయి.. (ఆఫీసు లో మా బాస్ పని చెపితే విసుక్కుంటానేమో అని భయంగా కూడా వుండండి :) )

    ReplyDelete
  23. ప్రవీణ గారూ మీ వ్యాఖ్యలు చూసి మనసు దూదిపింజలా తేలిపోతుంది. కవితలు చదివి ఓపిగ్గా మీ అభిప్రాయం చెప్పినందుకు బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete
  24. చాలా చాలా బాగుందండి!!

    ReplyDelete
    Replies
    1. మీ కవితలంటే ఇష్టమనుకుంటాను. ధన్యవాదాలు విద్యాసాగర్ గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.