మా చిన్నప్పుడు ఏ సాయంత్రమో పొలం నుండి వస్తూ గోరింటాకు తెచ్చేవాడు మామయ్య. పిల్లలందరమూ కూర్చుని ఆకులు దూసి పుల్లలు వేరు చేసేవాళ్ళం. అత్త పెరట్లోని రోట్లో వేసి కాటుకలా రుబ్బి కొబ్బరి చిప్పలో తీసిపెట్టేది. ఈలోగా అమ్మమ్మ సాయంకాలం వంట పూర్తి చేసేది. ఏడు గంటలకల్లా అన్నాలు తినేసి పిల్లలందరం గోరింటాకు పెట్టించుకునేవాళ్ళం. చుక్కలూ, చెంద్రుడు మా అరచేతుల్లో ఉంటే ఆ రోజు అమావాస్య అయినా మేడ మీద వెన్నెల పరుచుకున్నట్లనిపించేది. ఆ గోరింటాకు ఆరిందాకా కథలు, కబుర్లు చెప్పుకునే వాళ్ళం. తెల్లవారి చూసుకుంటే అరచేతుల్లో ఎర్రగా సూర్యుడు ఉదయించేవాడు.
ఈ గోరింటాకు పెట్టుకునే సరదా మన దేశంలో దాదాపుగా నాలుగు, ఐదవ శతాబ్దాలలో మొదలైందట. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ మెహందీ మొఘలులు భారతదేశానికి తీసుకుని వచ్చిన కళ అనుకున్నారట కానీ అప్పటికే భారతదేశంలో ఉన్నదనడానికి సాక్ష్యంగా అజంతా గుహల్లోని శిల్పాలకు కూడా అరచేతిలో గోరింట ఉన్నదట.
ఇక మన కథలోకి వద్దాం.
డిసెంబర్ ఏడవ తేదీ సంగీత్ డెకరేషన్ చూడడానికి హాల్ కి వెళ్ళాం కదా! తిరిగి వచ్చేటప్పటికి సాయంత్రం మూడవుతోంది. అప్పటికి మెహందీ డెకరేషన్ మొదలే పెట్టలేదు. ఇంకా చిన్న చిన్న పనులు చాలానే ఉన్నాయి. అప్పటి వరకు ఎవరు వచ్చి సహాయం చేస్తామన్నా ఫరవాలేదు మేము చేసుకోగలం అంటున్న వాళ్ళం ఆ రోజు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసాం.
సాయంత్రం వాళ్ళు వచ్చేటప్పటికి ఇల్లంతా వస్తువులతో నిండి పోయి ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ అయితే మిమ్మల్ని అలా వదిలివేసి ఏ సహాయమూ చేయలేకపోయామని చాలా నొచ్చుకున్నారు. ఏం చేస్తాం అందరం గృహ నిర్భంధం లో ఉండవలసిన రోజులు కదా! అప్పటికప్పుడు ఇల్లు సర్దడం మొదలుపెట్టి ఓ గంటలో ఒక కొలిక్కి తెచ్చారు.
ఆ సాయంత్రం అందరం తలా ఒక పనిలో తల మునకలై ఉన్నాం. మధ్య గదిలో మెహందీ ఫంక్షన్ కి డెకరేషన్ చేస్తున్నారు ఓ ముగ్గురు. పెరట్లో ఓ ఐదుగురు మంగళస్నానాలకు డెకరేషన్ చేసే పనిలో ఉన్నారు. గరాజ్ లో పూల పందిరి, బ్యాక్ డ్రాప్ పెడుతున్నారు మరో నలుగురు. ఆ రోజు అనుకున్నాం ఈ కోవిడ్ లేకపోయి ఉంటే పెళ్ళికి పదిహేను రోజుల ముందు నుండే ఇల్లు ఇలా సందడిగా ఉండేది అని. పోనీలే ఈ ఒక్క రోజు అయినా ఈ ముచ్చట తీరింది అనుకున్నాం. ఆ పూటంతా ఇంట్లో వాళ్ళం, ఫ్రెండ్స్ అందరమూ మాస్క్ లు పెట్టుకునే ఉన్నాం.
సాయంత్రం కరిగి రాత్రయింది. "అక్కా, ఈ కర్టెన్ పొడవు సరిపోతుందా"? "పెద్దమ్మా మొత్తం ఎన్ని గిఫ్ట్స్ పాక్ చెయ్యాలి"? "అక్కా, లిల్లీస్ ఇంకా ఉన్నాయా, ఇవేనా"? ఇలా అందరూ అడుగుతూ ఉంటే ఆ రోజు కాళ్ళకు చక్రాలు కట్టుకుని పరుగెడుతున్నాను. పాపం వచ్చిన వాళ్ళకు టీ కూడా ఇవ్వలేదని గుర్తు వచ్చింది. మా మరదలు, తోడికోడలు కోసం చూస్తే వాళ్ళిద్దరూ పూల పందిరి దగ్గర బిజీగా ఉన్నారు. వంటగదిలోకి వెళ్ళాను. జ్యోతిగారూ ఒకసారి వచ్చి ఈ ఫ్రేమ్ వచ్చిందో చూడండి. గరాజ్ లోనుండి పిలుస్తున్నారు. అప్పుడే అటువైపు వచ్చిన మా మరిది వదినా నేను టీ పెడతాను నువ్వా పని చూడు అన్నాడు. నువ్వా అన్నాను ఆశ్చర్యంగా ఇండియాలో ఉన్నప్పుడు రోజుకు పదమూడు గంటలు మెళ్ళో స్టెత్ వేసుకుని ఉండడమే చూసాను కానీ ఇలా వంట గదిలో ఎప్పుడూ చూడలేదు తనను. దాదాపుగా ఇరవై మందిమి ఉన్నాం ఇంట్లో. ఎన్ని పాలు, ఎంత పొడి వెయ్యాలో చెప్పబోతున్నాను తనకు. "జ్యోతీ త్వరగా రండి" అంటూ మళ్ళీ పిలుపొచ్చింది గరాజ్ లో నుండి. నేను చూసుకుంటాగా నువ్వెళ్ళు అన్నాడు. ఓ అరగంటలో పొగలు గక్కే టీ చిక్కని కాఫీ తయారు.
స్నేహమో, బంధుత్వమో మన చుట్టూ అల్లుకుని ఉంటాయి. ఆ స్పర్శ తెలిసేది ఇటువంటి సందర్భాలలోనే.
ఈ ఫేవర్ మార్ట్ లో తెప్పించిన కర్టెన్స్ మా కజీన పంపిన గొడుగులు, దిండు కవర్స్ తో మా ఫ్రెండ్ ఇంకా పెళ్ళి కూతురి ఫ్రెండ్ కలసి ఎంత చక్కగా డెకరేట్ చూశారో చూడండి.ఉదయం తొమ్మిది గంటల కంతా మెహందీ పెట్టేవాళ్ళు వచ్చేసారు. పెళ్ళికూతురికి ఒకరు మిగిలిన వారికి పెట్టడానికి ఒకరు. స్నానాలు చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి మెహందీ పెట్టించుకోవడం మొదలు పెట్టారు.
ఈ మెహందీ డిజైన్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి. ఇండియన్ డిజైన్స్ మన సంస్కృతి ప్రతిబింబించే విధంగా సన్న గీతలతో మామిడి పిందెలు, పువ్వులు, నెమళ్ళతో డిజైన్ చేతుల నిండుగా ఉంటుంది. పెళ్ళి కూతురికి పెట్టే డిజైన్స్ లో పల్లకి, కలశము, పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు, పూల మాలలు లాంటి చిత్రాలు చిత్రీకరిస్తారు.
పెళ్ళికొడుకు పేరును మెహంది డిజైన్ లో ఎక్కడో వ్రాసారట. ఎక్కడుందో చెప్పమని పరీక్ష పెట్టింది పెళ్ళి కూతురు.
ఆడవాళ్ళం మెహందీ పెట్టించుకున్నప్పుడు మగవాళ్ళంతా సంగీత్ కోసం షాపింగ్ చేసే హడావిడిలో ఉన్నారు. ఐదు గంటల కల్లా మెహందీ డెకరేషన్ తీసేసి తరువాత రోజు ఉదయాన్నే జరగబోయే పెళ్ళి కూతురు ఫంక్షన్ కి బ్యాక్ డ్రాప్ పెట్టేశారు.
పెళ్ళి కూతురికి మెహెందీ పెట్టినవారు రాజీ. ఇక్కడే మా ఊర్లోనే ఉంటారు, చాలా ఓపిగ్గా చక్కగా పెట్టారు.
ఈ ఫేవర్ మార్ట్ లో తెప్పించిన కర్టెన్స్ మా కజీన పంపిన గొడుగులు, దిండు కవర్స్ తో మా ఫ్రెండ్ ఇంకా పెళ్ళి కూతురి ఫ్రెండ్ కలసి ఎంత చక్కగా డెకరేట్ చూశారో చూడండి.
ఈ మెహందీ డిజైన్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి. ఇండియన్ డిజైన్స్ మన సంస్కృతి ప్రతిబింబించే విధంగా సన్న గీతలతో మామిడి పిందెలు, పువ్వులు, నెమళ్ళతో డిజైన్ చేతుల నిండుగా ఉంటుంది. పెళ్ళి కూతురికి పెట్టే డిజైన్స్ లో పల్లకి, కలశము, పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు, పూల మాలలు లాంటి చిత్రాలు చిత్రీకరిస్తారు.
మా పెళ్ళి కూతురి చేతిలో అవన్నీ మీకు కనిపిస్తున్నాయా?
పాకిస్థానీ డిజైన్స్ కూడా సన్నని గీతలతో ముస్లిం సంస్కృతి ప్రతిబింబించే విధంగా లో డోమ్స్, లతలు, మాస్క్ లాంటివి చిత్రీకరిస్తారు. ఈ డిజైన్స్ కూడా చెయి మొత్తం నిండుగా ఉంటుంది. అరబిక్ డిజైన్ మరీ సన్నని గీతలతో కాక కొంచెం వెడల్పుగా పువ్వులు లతలతో చాలా అందమైన పెయింటింగ్ లా ఉంటుంది. ఇండో అరబిక్ డిజైన్స్ హంసలు, మామిడి పిందెలు, లతలతో ఎంతో అందంగా ఉంటాయి.
ఆఫ్రికన్ మెహంది డిజైన్స్ జామెట్రిక్ డిజైన్స్ లో అంటే చతురస్రము, త్రికోణాకారము లాంటి ఆకరాలలో చుట్టూ చిన్నచిన్న ఆకులతో చూడడానికి ఒక క్రమ పద్దతిలో అందంగా ఉంటుంది.
ఈ కార్యక్రమం అంతా పూర్తయ్యేసరికి సాయంత్రం నాలుగయింది. మెహందీ పెట్టడానికి ఇద్దరినే కాకుండా మరో ఇద్దరిని పిలిస్తే త్వరగా అయ్యుండేది. అప్పటికీ వాళ్ళ దగ్గర కోన్స్ తీసుకుని ఇంట్లో వాళ్ళు కూడా పెట్టినా అంత టైమ్ పట్టింది.
పెళ్ళికొడుకు పేరును మెహంది డిజైన్ లో ఎక్కడో వ్రాసారట. ఎక్కడుందో చెప్పమని పరీక్ష పెట్టింది పెళ్ళి కూతురు.
పెళ్ళి కూతురికి మెహెందీ పెట్టినవారు రాజీ. ఇక్కడే మా ఊర్లోనే ఉంటారు, చాలా ఓపిగ్గా చక్కగా పెట్టారు.
మధ్యాహ్నమే మేకప్ ఆర్టిస్ట్ వచ్చి పెళ్ళికూతురికి హెయిర్ సెట్ చేసి మేకప్ వేసింది. మిగిలిన వాళ్ళం కూడా మెహందీ చేతులు కడిగేసుకుని సాయంత్రం ఆరుగంటల కల్లా సంగీత్ కి తయారయి పోయాం. ఆ కబుర్లు ఇక్కడ చదవొచ్చు
*********************
ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళి, ఆచారాలు వ్యవహారాలు, పెళ్ళికి కావలసినవి, అలంకరణ, అరిసెలూ అవాంతరాలు, స్వప్నలోకం, నిశ్చయ తాంబూలాలు, అంటూ ఏడు రోజుల నుండీ కబుర్లు చెప్పుకుంటున్నాం. నిన్నటి కబుర్లు ఇక్కడ చదవొచ్చు.