మునిమాపు వేళల్లో
సంధ్యాకాంత సింగారాలు!
వినువీధుల అరుణిమల్లో
విహంగాల విహారాలు!
వడగాల్పుల వేడిమిలో
పిల్లతెమ్మెరల వింజామరలు!
విరజాజుల జావళిలో
మొగ్గవిచ్చు మల్లియలు!
వేచియున్న వాకిటిలో
చిరపరిచిత పదసవ్వడులు!
గాజుల సడి నేపధ్యంలో
కడకొంగుతో మంతనాలు!
ఎదను మీటిన వలపుల్లో
చిలిపితనపు చిరునగవులు!!
సంధ్యాకాంత సింగారాలు!
వినువీధుల అరుణిమల్లో
విహంగాల విహారాలు!
వడగాల్పుల వేడిమిలో
పిల్లతెమ్మెరల వింజామరలు!
విరజాజుల జావళిలో
మొగ్గవిచ్చు మల్లియలు!
వేచియున్న వాకిటిలో
చిరపరిచిత పదసవ్వడులు!
గాజుల సడి నేపధ్యంలో
కడకొంగుతో మంతనాలు!
ఎదను మీటిన వలపుల్లో
చిలిపితనపు చిరునగవులు!!
మది మోహన రాగం ఆలపించినట్టు..
ReplyDeleteఈ కవితను చూసిన కన్నుల్లో చెప్పలేని ఎన్నో సంగతులున్నట్టు..
చదివిన పెదవులపై మధువులూరినట్టూ
బాగుందండీ మీ భావనల తేనెపట్టు...
మీ భావ వ్యక్తీకరణ బాగుందా? లేక ఆ భావాన్ని చెప్పడం కోసం వాడిన అక్షరాల అమరిక బాగుందా అంటే చెప్పడం కష్టమే! అంత చక్కగా, ముచ్చటగా ఉంది!
ReplyDelete@ శుభా నా కవితమో కాని మీ వ్యాఖ్య మాత్రం మధువు చి౦దినట్లుగా ఉంది. ధన్యవాదములు.
ReplyDelete@ రసజ్ఞా ఆ రెండిటి కంటే మీ వ్యాఖ్య బావుంది. ధన్యవాదాలు.
అక్కడ గ్రోలిన మధువే ఇక్కడ కొంచెం చింది ఉంటుందండీ.. అంతకంటే ఏం కాదు.
ReplyDeletechalaa baagundi...... meelaa raayalani tapana... kaani enduko raayalekapotunna
ReplyDelete...
మీ అభిమానానికి ధన్యవాదాలు నరసింహా రెడ్డి గారూ..మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
ReplyDelete