Sunday, November 6, 2011

ఎవరు నీవూ...నీ రూపమేది

ముసురు కమ్మిన వేదనలో
ప్రభవి౦చే రవి కిరణం!

విజయోత్సాహపు అంబరంలో
తేలిపోయే తెలి మబ్బు తునక!

సంక్లిష్ట సమస్యల సంశయంలో
సప్తవర్ణాల ఇంద్రధనస్సు!

దిక్కు తోచని అమావాస నిశిలో
వెలిగే చిరుతారక!

జీవితపు అలల కల్లోలంలో
నావను నడిపే చుక్కాని!

యోజనాల దూరల్లో వున్నా
నీలి మేఘానికి నీటి ముత్యానికి
నడుమనున్నదే స్నేహం!!


ఎంత దూరాన ఉన్నా ఎన్నో సందర్భాలలో నా తోడుగా నిలిచి నన్ను ముందుకు నడిపించిన స్నేహానికి ఓ స్మృతి హారం.


15 comments:

 1. చాలా బాగా వ్రాశారు! నాకు అల్లాయే దిగివచ్చి అనే పాట గుర్తుకొస్తోంది!
  శారీరకంగా దూరంగా ఉన్నా తలపులలో దగ్గరగా ఉండదే స్నేహం
  మన అభిప్రాయాలని సరిగ్గా అంచనా వేయగలిగేదే స్నేహం
  ఎన్ని యుగాల తరువాత కలసినా అదే ఆప్యాయతని పంచే అందమయిన ఆత్మీయం స్నేహం!

  ReplyDelete
 2. మేఘానికీ ముత్యానికీ స్నేహం బాగుందండీ.. ఒక్క చినుకు రాలితేనే ముత్యం రూపు దాల్చుతుంది..స్నేహం పరిమళింతలో అది మెరుపులు చిందిస్తుంది. సంతోషంలోనే కాదు కష్టంలో కూడా చేయందించగలిగేది ఒక్క నిజమైన స్నేహం లోనే ఉంటుంది. అలాంటి స్నేహానికి మీరు వేసిన హారం ఇక్కడ చిక్కని వెలుగులు చిందిస్తోంది.

  ReplyDelete
 3. "యోజనాల దూరల్లో వున్నా
  నీలి మేఘానికి నీటి ముత్యానికి
  నడుమనున్నదే స్నేహం"
  బాగుందండి పోలిక!

  ReplyDelete
 4. బహు ముచ్చటగా ఉందండీ మీరిరువురి స్నేహసౌరభం.. :)

  ReplyDelete
 5. vaaahvaaaaaaaa.good creativity

  ReplyDelete
 6. @ భాస్కర రామి రెడ్డి గారూ..స్వాగతం. నా మిత్రబృందంలో మరొకరు చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

  @ రసజ్ఞ నాకూ ఆ పాటంటే చాలా ఇష్టం. ధన్యవాదాలు.

  @ సుభ ఆ వెలుగువైపు చూడ౦డి మీకు స్నేహితులు కూడా కనిపిస్తారు.ధన్యవాదాలు.

  @ పద్మార్పిత గారూ..ధన్యవాదాలు.

  ReplyDelete
 7. @ మూర్తి గారూ..మీరు ఈ కవితలు చదివారన్న ఆలోచనే ఎంతో సంతోషంగా ఉంటుంది. ధన్యవాదములు.

  @ మధురవాణి గారూ...ధన్యవాదాలు.

  @ నిర్మల్ గారూ స్వాగతం. అది స్నేహం యొక్క గొప్పతనం. మీరు అస్వాది౦చినది ఆ స్నేహ పరిమళం మాత్రమే. ధన్యవాదాలు.

  ReplyDelete
 8. ఎప్పటిలాగే బాగా చెప్పారు. స్నేహ పరిమళాలు సర్వదా వ్యాప్తం. నైస్ వన్. స్నేహాన్ని ఆస్వాదించండి.

  ReplyDelete
 9. హారము హారము హారము
  చూడ చక్కని అక్షర హారము
  వేసుకున్నాక తీయలేరు
  వద్దనుకున్నామనసొప్పుకోదు
  ప్రేమలా మెరిసే అరుదైన హారము
  ముత్యాలు పొదిగిన స్నేహాల హారము
  విలువెంత అని అడగకండి
  తెలుసుకోవాలంటే జ్యోతి గారితో స్నేహము చేయండి

  జోతిర్మయి గారు అక్షరాల గొడవేంటో నాకు తెలీదు కాని చిట్ట చివర హారము ఇచ్చారే అది మాత్రం భేష్ భలే ఉంది ...

  ReplyDelete
 10. వనజ గారూ ధన్యవాదాలు.

  కళ్యాణ్ గారూ మీ కవితకు హారం నచ్చినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 11. చాలా చాలా బాగుంది. మీ బ్లాగుని ఇదే నేను మొదటిసారి చూడడం. మీ పిక్నిక్ గురించి మీరు ఇల్లు మారడం గురించి రాసినవి చదివాను. చాలా చక్కగా ఉన్నాయి.

  ReplyDelete
 12. గోపాల కృష్ణ గారూ స్వాగత౦..మీలాంటి పెద్దలకు నచ్చడం చాలా సంతోషంగా ఉంద౦డీ. ధన్యవాదములు.

  ReplyDelete
 13. ఇంతకుముందు మీ ఫోటో బ్లాగును చూశాను.బాగున్నాయనుకున్నాను. మీరు ఇలాంటి బ్లాగు ను వ్రాస్తున్నారని గమనించలేదు.నెల్లూరు యాస బాగుంది.నేను డిగ్రీ సర్వోదయలో చదివాను.అందుకని బాగా పరిచయం ఆ యాసంటే .మీ టపాలు కొన్ని చదివాను .చాలా సహజంగా వున్నాయి.చాలా దగ్గరివారు కబుర్లు చెబుతున్నట్టు వ్రాస్తున్నారు .నిదానంగా మిగతావి చదువుతాను.కొనసాగించండి
  ఇక మీ స్నేహం ఫై కవిత లో మంచి feel వుంది .అలాటి స్నేహాలు దొరకటం అదృష్టం.స్నేహం ఫై నేను వ్రాసిన ఒక వ్యాసాన్ని చదవమని మీకు నా బ్లాగుకు ఆహ్వానం .

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.