చూపులు కలసిన శుభవేళ
కలసిన మనసుల ఆనందహేల!
కలబోసుకున్న కబుర్లు
నవజీవన సోపానాలు!
ఉత్సాహం ఉరకలు వేసింది
ఉల్లాసం పరుగులు తీసింది!
నీవే నేనను మధురభావం
ఇరు హృదయాలకి ప్రణయవేదం !
పరిచయం చిరునామా మార్చుకుంది
ఒంటరితనం జంటను చేరుకుంది!!
కలసిన మనసుల ఆనందహేల!
కలబోసుకున్న కబుర్లు
నవజీవన సోపానాలు!
ఉత్సాహం ఉరకలు వేసింది
ఉల్లాసం పరుగులు తీసింది!
నీవే నేనను మధురభావం
ఇరు హృదయాలకి ప్రణయవేదం !
పరిచయం చిరునామా మార్చుకుంది
ఒంటరితనం జంటను చేరుకుంది!!
baagundi...Thank you
ReplyDeleteపరిచయం చిరునామా మార్చుకుంది
ReplyDeleteఒంటరితనం జంటను చేరుకుంది!!
ఈ ఒక్క భావన చాలండి ఈ కవితకి.. ఏదో మధురానుభూతి..!
మీ ఈ ప్రయత్నం చాల కొత్తగా వుంది..... ఆరంభం అభిప్రాయం స్నేహం ప్రేమ అనుబంధం విరహం అనింటిని కలిసి కలవ నీకుండ చక్కగా చేకూర్చారు చాల బాగుంది అందులో అంతరార్ధం...
ReplyDelete@ వనజ గారూ ధన్యవాదాల౦డీ.
ReplyDelete@ నా కవిత మీలో మధురానుభూతి కలిగించిందంటే ఏ కవితకైన ఇంతకన్నా ఇంకేం కావాలి. ధన్యవాదాలు శుభ గారూ.
@ కళ్యాణ్ గారూ మీ వ్యాఖ్యే ఓ కవితలా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందండీ. ధన్యవాదాలు
పరిచయం చిరునామా మార్చుకుంది
ReplyDeleteఒంటరితనం జంటను చేరుకుంది!!అంటే పెళ్లి అయ్యిందనా? అది మధురభావమో కాదో అన్నది వచ్చినవాడి మీద కదండీ ఆధారపడేది? అందరికీ అదే భావన ఉంటే బాగుండును, ఉండాలని ఆశిద్దాం!
ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు ..
ReplyDelete@ వచ్చిన వాడు మంచి వాడనే ఆశిద్దాం రసజ్ఞ గారూ..
ReplyDeleteధన్యవాదాలు.