నందనవనం
నిన్న ఉదయం బ్లాగు కిటికీ తెరవగనే అంతా రంగురంగుల పువ్వులే కనిపించాయి. కొన్ని పువ్వులు మీ నవ్వులమన్నాయి, ఇంకొన్ని పిల్లల కోసం అశీస్సులమన్నాయి, మరికొన్ని మీ అభినందనలట. తెర వెనుకకు వచ్చి రామాయణం తిలకించి బ్లాగును నందనవనం చేసిన అతిధులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.
బాగుందండీ మీ నందనవనం చూడముచ్చటగా.. ఇలానే ఎప్పుడూ మీ వనంలో మరుల విరులే కాదు హరివిల్లులు కూడా విరబూయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
ReplyDeleteఅయ్యయ్యో! ఇక్కడ నాకిష్టమయిన మల్లెలు, జెర్బరాలు లేవు!ఎలాగా? (ఏదో సరదాకి అన్నా) జ్యోతిగారు మీ నవ్వుల పువ్వులకన్నా మాకేం కావాలి? కనుక ఇందులో ఉన్న కుసుమాలన్నీ నాకే! అంటే మీ నవ్వులన్నీ నాకేగా!!!!!!!!!!!!!!!
ReplyDelete@ మీ సుభాభినందనలే నాకు సుమధరకుసుమాలు.
ReplyDeleteధన్యవాదాలు శుభా..
@ మల్లెలూ, గెర్బరాలు... నాకూ ఇష్టమే మల్లెల్ని జడలో తురిమి గెర్బరాలను వాజ్ లో పెట్టా.. మీకవి ఇష్టమని తెలీదుగా రసజ్ఞ గారూ, లేకపోతే అట్టేపెట్టేదాన్ని. ఇంకా చాలా పూలున్నాయ్ అందంగా.. పట్టుకెళ్ళండి. ధన్యవాదములు.
@జ్యోతిర్మయి గారు తప్పు తప్పు పువ్వులు మట్టుకు విరబూయలేదు వాటితోపాటు వారి మాటల్లా తియ్యని పండ్లు, ప్రేక్షకుల్లా సీతాకోక చిలుకలు, పిల్ల గాలుల్లా కరచాల ధ్వనులు , పచ్చిక వేదికపై అనుభవాల చెట్లు .. ఇలా ఓ నందన వనము లాగ అయిపోయిందండి ...
ReplyDelete