Thursday, October 20, 2011

ఓ చిన్ని వ్యాఖ్య

అనుకోని వేళల్లో
అదాటుగా ఎదురౌతుంది!

చూపులతోనే
చిరునవ్వులు పూయిస్తుంది!

అంతరంగాన్ని
నూతనోత్సాహంతో ని౦పేస్తు౦ది!

ఓ అనుభూతిని
బహుమతిగా ఇస్తుంది!

వెన్నుతట్టి
మున్ముందుకు నడిపిస్తుంది!!


8 comments:

  1. ఆ వేళలో ఆ చిరునవ్వును నేనే అవుతా
    ఆ ఉత్సాహం నేనై వస్తా
    ఆ అనుభూతిని నేనై ముందుకు నడిపిస్తా...
    మరి నాకు ఏమి ఇస్తారు బహుమతి?
    మీ వ్యాఖ్యే ఒక బహుమతిలా ఉంది.. మంచి స్పూర్తి నిచ్చే కవిత. బాగుందండి.

    ReplyDelete
  2. అవునండి చాలా చక్కగా చెప్పారు చిన్నిధైనా ఎంతైనా చేయగలదు ...
    అలరారు అందాల ఆ చిన్ని నవ్వులే అమ్మంటి ఆ ఎశోదను కరిగిపోయేలా చేసేవి వాని అల్లరి మరచిపోయేలా చేసేవి ... ( కాని అందులో ప్రేమ పెద్దది )
    కాదు పొమన్న ఆ చిన్ని వాక్యమే ఏకలవ్యుడిని గొప్ప విద్యార్ధిని చేసింది నిస్వార్ధమైన గురు భక్తిని చాటింది.. ( ఇందులో భక్తి పెద్దది )
    జ్యోతిర్మయి గారి చిన్ని చిన్ని వాక్యాలే మాకు బోలెడంత ఆత్మ విశ్వాసాన్ని ఇస్తాయి.. ( వాటిలో నిజము పెద్దది )
    నూరేళ్ళ జీవితమైనా తొలినాటి ఆ చిన్ని క్షణాలే చివరిదాకా గుర్తుంటుంది.... ( ఇది కొలవలేనంత పెద్దది )
    చూసారా అక్కడక్కడ చిన్ని చిన్నవి అయినా ఎంత ప్రభావితం చేస్తాయో..

    ReplyDelete
  3. మీ కవిత ఎంత బాగుందో! లెస్స పలికితిరి! మీ ప్రతీ టపాకి వ్యాఖ్యని నేనై వచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీ వెనకాల నడవాలని ఉంది!

    ReplyDelete
  4. @ సుభ గారూ బహుమతి కావాలా? మీ అభిమానానికి మించిన బహుమానం నేనివ్వగలను? అభివందనాలు తప్ప. అవే మీకు వేనవేలు సమర్పించుకుంటున్నా.

    @ కళ్యాన్ గారూ మీకు నేను ఆత్మ విశ్వాసం ఇవ్వడమేమిట౦డీ మీ పలుకులే నాలో బోలెడంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయ్. ధన్యవాదములు.

    @ రసజ్ఞ గారూ నా వెనకాల నడవడం కాదు నా ముందు౦డి చేయందిస్తున్నారు. ధన్యవాదములు

    ReplyDelete
  5. మీ మరో బ్లాగులో చూపిన గులాబీ మీది చిరు నీటిబిందువుల్లా, చెప్పకుండా మన బ్లాగుమీద వాలిన వ్యాఖ్యలు, క్షణికమైనా, ఒక మధురమైన అనుభూతినిస్తాయనడంలో సందేహం లేదు. ఆపాటి లౌల్యం లేకపోతే ఈ వ్రాతలకి ప్రతిఫలం ఏముంటుంది? మీ కవిత EF Schumacher చెప్పిన "Small is beautiful" కి లక్ష్యంలా ఉంది. అభినందనలు.

    ReplyDelete
  6. మూర్తి గారూ మీ లాంటి పెద్దలు వ్యాఖ్య పెట్టడం నిజంగా నా అదృష్టం. మీ వ్యాఖ్య అనుకోని వేళ అదాటుగానే వచ్చింది. మీ వ్యాఖ్య ద్వారా 'లౌల్యం' అనే పదం పరిచయమయ్యింది. ధన్యవాదములు.

    ReplyDelete
  7. కొత్తావకాయ గారూ ధన్యవాదములు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.