Sunday, October 2, 2011

పూలు గుసగుసలాడేనని...


చిలిపిగ తొంగి చూస్తోంది
దాగని చిరునవ్వొకటి!

పువ్వూ అందమే, ముల్లూ అందమే
గరికా అందమే, విరిగిన కొమ్మా అందమే!

నేల నొదిలి, నింగి కెగరి
చుక్కల లోకంలో, వెన్నెల తీరంలో!

తనువు మరచి, తరుణం మరచి
నన్ను నేనే మరచి!

చెంగున లేడిలా గంతులేయాలని
చేప పిల్లలా ఈదులాడాలని!

అణువణువున ఉత్సాహం
మానసాన  ఆనందతాండవం!!


2 comments:

  1. ఈ కవితా అందమే సుమండీ ! !

    ReplyDelete
  2. సుభాగారూ...థాంక్స్.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.