Tuesday, October 18, 2011

సంకల్ప౦

ఓ చిన్న విత్తనం
చివురులు తొడిగి...

మొక్కై ఎదిగి
మానై నిలిచింది!

శిఖరాగ్రాన్ని చూస్తూ
ఆసక్తి ఆసరాగా..
ఏకాగ్రత తోడుగా...

ఒక్కో మెట్టూ ఎక్కుతూ..
గమ్యం చేరిననాడు!

అంబరాన్నంటే  ఆనందం
సాగరమంత  సంబరం!

ఈ పయనంలో
దొరికిన ఒక్కో అనుభవం
ఓ అనుభూతికి తార్కాణం!!


9 comments:

 1. ఒక్కో అనుభవం
  ఓ అనుభూతికి తార్కాణం!!
  నిజమే కదూ! ఈ జీవితంలోని ప్రతీ అనుభవం ఒక్కో అనుభూతిని మిగిల్చి పోతుంది!

  ReplyDelete
 2. ఒక్కో మెట్టూ ఎక్కుతూ..
  గమ్యం చేరిననాడు!
  వెనక్కి తిరిగి చూస్తే ఒక్కో అనుభవం ఒక్కో అనుభూతిని కలిగిస్తుంది.. మంచైనా, చెడైనా ఏదైనా ఒక చక్కని పాఠమే.. చాలా చక్కగా చెప్పారండీ..

  ReplyDelete
 3. కోతికి తెలుసు కొమ్మ బలము
  సీతాకోకకు తెలుసు తేనె మాధుర్యము
  అనుభవానికి తెలుసు జీవితము
  వాటిని ప్రభోదించుటయే సజ్జనుడి( మీలాంటి వారి) లక్షణము....
  ఎంతో చక్కగా అనుభవం గురించి చెప్పారు.. అలా పలుకులు ఏరుతూ తింటేనే పప్పుల రుచి తెలుస్తుంది... మీ వాక్యాలు కూడా అలాగే ఉంటాయి ఒక్కోటి ఏరుతూ రుచిని ఆస్వాదించచ్చు..

  ReplyDelete
 4. @ రసజ్ఞ గారూ ధన్యవాదాలు.

  @ సుభ గారూ జీవితమ౦టేనే అనుభూతుల పరిమళం, అనుభవాల సమ్మేళనం కదూ...ధన్యవాదములు.

  ReplyDelete
 5. @ కళ్యాణ్ గారూ కవితేదో రాసేసి భలే వుందే అనేసుకుంటాను. వెంటనే మా వారు అంటారు 'కాకి పిల్ల కాకికి ముద్దని'. కాని మీ వ్యాఖ్య చూసాక నిజంగా అంత బావుందా అని మళ్ళీ చదువుకుంటాను. నా పలుకులు మీ వ్యాఖ్యల మాధుర్యంలో మునిగి పంచదార చిలకలౌతున్నాయంటే నమ్మండి. నన్ను సజ్జనుల సరసన కూర్చో పెట్టేసారు, అవన్నీ ప్రభోదాలు కాదండీ నా అనుభవాలు మాత్రమే. మీకు బోలెడు ధన్యవాదాలు.

  ReplyDelete
 6. జ్యోతి గారూ మన్నించాలి
  ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి మీరు రాసినదానితో నేను కూడా ఏకీభవిస్తున్నాను! మనం రాసినదానిని ఆయన మాటలతో అల్లిన కవితని చదివినప్పుడల్లా నాకు కూడా ఇదే అభిప్రాయం కలుగుతుంది!

  ReplyDelete
 7. @జ్యోతిర్మయి గారు అవి వేమన వేపాకు కావాల్సిన అవసరం లేదు తినగ తినగ తియ్యగా అనిపించడానికి... వివేకుని వాక్యం కాకపోవచ్చు చదివిన వెంటనే ఉత్తేజము కలగడానికి... పెద్దల అనుభవాలే చాలు అవే మావంటి వారికి ప్రభోదాలుగా పనిచేస్తాయి...ఇలానే పంచుకుంటూ ఉండండి ఎంతో ఉపకరిస్తుంది మీకును మాకును.. మీ ఆత్మీయ ప్రశంసకు వినంరుడ్ని మీ అనుభవ పాఠాలకు విద్యార్ధిని :)

  @ రసజ్న్య జ్యోతిర్మయి గారి మాటలతో ఏకీభవించి మీ గొప్పతనాన్ని ఇంకా చాటుకుంటున్నారు చాలా సంతోషం ... ఇలా మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా నేను బాగా రాయగలను విమర్శించగలను .. మళ్ళి మళ్ళి మీకు ధన్యవాదాలు ... :) మీ గాజుల వ్యవహారాలూ చూసాను కాని ఇంకా చదవలేదు పూర్తిగా.. అది తీరిగ్గ కూర్చొని చదివితేనే ఆస్వాదించచ్చు... త్వరలో నా విమర్శను మీకు తెలియజేస్తాను ..

  ReplyDelete
 8. రైటో రైటు.ఇక్కడ అందరి మాటలూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. Well said Kalyan. Keep commenting. Coz ప్రోత్సాహానికి మించిన ఔషధం లేదు..నేను కూడా రసజ్ఞగారి తోను, జ్యోతిగారి తోను ఏకీభవిస్తున్నాను.

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.