ఓ చూపు స్నేహంగా నవ్వింది
బిడియం రెప్పల పరదా వేసింది!
ఉత్తరం కుశలమడిగింది
సంశయం సమాధానమిచ్చింది!
మానసం మధుకరమై మసలింది
సేనము ప్రసూనమై విరిసింది!
సఖునికి సంవాసము సమకూరింది
చెలువ చెంతకు చేరింది!
సహవాసం సరిగమలు పలికించింది
సంసారం సౌహిత్యంగా సాగింది!!
బిడియం రెప్పల పరదా వేసింది!
ఉత్తరం కుశలమడిగింది
సంశయం సమాధానమిచ్చింది!
మానసం మధుకరమై మసలింది
సేనము ప్రసూనమై విరిసింది!
సఖునికి సంవాసము సమకూరింది
చెలువ చెంతకు చేరింది!
సహవాసం సరిగమలు పలికించింది
సంసారం సౌహిత్యంగా సాగింది!!
ఓ చూపు స్నేహంగా నవ్వింది
ReplyDeleteబిడియం రెప్పల పరదా వేసింది!
ఉత్తరం కుశలమడిగింది
సంశయం సమాధానమిచ్చింది!
ఎంత చక్కగా కూర్చారండీ పదాలని! చాలా బాగుంది అనే పదం చిన్నదేమో!
సహ జీవనానికి కొత్త గమనం చూపారు. బాగుందండీ...ఎంత చక్కగా కూర్చారండీ పదాలని! చాలా బాగుంది అనే పదం చిన్నదేమో! అన్న రసజ్ఞ గారి మాటలతో నేను ఏకీభవిస్తున్నాను...
ReplyDeleteమల్లె లేని తీగ ఎంత అల్లిన దానిని పటించుకునే నాధుడు ఉండడు... మీరు రాసే వరుసలు తీగైతే వాటికి విరబూసిన అక్షరాలు మల్లలే ... సహజీవనం అనేది మాములే మాలాంటి వాలకి ఇంకా ఏమిటో తెలియదు... ఎంత ఊహించుకున్నా కూడా అది నిజము కాన్నంత వరకు తెలియదు అందులో ఏముంటుంది అని .. కాని అది ఇలా ఉంటుంది నయనల్లారా అని అమ్మమ్మ కధ చెప్పినట్టు చెప్పేశారు :) .. " మానసం మధుకరమై మసలింది సేనము ప్రసూనమై విరిసింది! సఖునికి సంవాసము సమకూరింది చెలువ చెంతకు చేరింది! " దీనికి కాస్త అర్థము చెప్పమని మనవి ...
ReplyDeleteకళ్యాన్ గారూ మీ ప్రతి వ్యాఖ్య ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటుంది. సహజీవనం గురించి చెప్పాలంటే, మనసులు కలిసిన జీవనం మల్లెపందిరిలా ఉంటుంది.
ReplyDelete"మానసం మధుకరమై మసలింది
సేనము ప్రసూనమై విరిసింది!"
మధుకరమంటే తుమ్మెద, సేనము అంటే శరీరము, ప్రసూనమంటే పుష్పము అని అర్ధం.
"సఖునికి సంవాసము సమకూరింది
చెలువ చెంతకు చేరింది!"
భార్యా భర్తలిరువురూ కొత్త కాపురం మొదలెట్టారని అర్ధము. ధన్యవాదములు
@ రసజ్ఞ గారూ మీ దగ్గరనుండి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం టపా చూసిన వెంటనే వ్యాఖ్య పెట్టడం. ధన్యవాదములు.
ReplyDelete@ సుభ గారూ చాలా బావుంది అనే పదం చిన్నది కాదండి అది అనంతమైనది. ధన్యవాదములు
@జ్యోతిర్మయి అర్థమే ఇలా ఉంటే ఇంక ఆ అనుబంధం చక్కగా ముచ్చటగా ఉంటుంది .. ధన్యవాదాలు
ReplyDeletechala baga rasarandi
ReplyDelete