Monday, October 10, 2011

కలకానిది...నిజమైనది

నిన్న రాత్రి ఓ స్వప్నం..
దూరాన ఎచటికో పయనం!

తరంగిణీ తీరాలు...
హరిద్రువ సమూహాలు!

ఆకశాన ఎగిరే గువ్వలు
మధూలికా మంజరులు
అనన్య సామాన్యములు!

ఊహు...ఇవేవీ కావు
నిరంతరాన్వేషణ... 
ఎందాకో ఈ ప్రయాణం!

రాసులుగా  పోసిన రత్నాలు
మరకతమణి మాణిక్యాలు!
ఎన్నటికీ కానేరవు!

వెతుకుతున్నది కానరాక...
దారి తెన్నూ తెలియక
చటుక్కున కళ్ళు తెరిచాను!

ఆ చిరు కదలికకే చెంతకు చేర్చుకున్న
నీ సాంగత్యంలో  తెలిసింది!

కలలో దొరకనిది ఇలలో నాదైనది 
నా కంటే అదృష్టవంతులెవరు?



3 comments:

  1. ఆ చిరు కదలికకే చెంతకు చేర్చుకున్న
    నీ సాంగత్యంలో తెలిసింది! అద్భుతం

    ReplyDelete
  2. మకరంద మరందాలు మీ పదాలు..

    ReplyDelete
  3. @ రసజ్ఞ గారూ మీకు నచ్చింది ఎక్కడున్నా మెచ్చుకోకుండా వెళ్ళలేని మీ మంచి మనసుకు ధన్యవాదాలు.

    @ శుభా నా పదాలేనా మీ వ్యాఖ్య కూడా..ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.