Friday, September 2, 2011

చందమామ సాక్షిగా...

చినుకు... చినుకు... మధ్య కలసి చిందులేశా౦
రావి ఆకుల గలగలలో.. రాలుగాయిలమై తిరిగాం!

వెన్నెల్లో.. చెమ్మ చక్క లాడాం
కోయిలతో... గొంతులు కలిపాం!
భేతాలుడి పొడుపు కధలు విప్పాం
ఇసుక తిన్నెల్లో... గవ్వలెన్నో ఏరాం!

ఎక్కడికేళ్లి పోయింది... ఎప్పుడెళ్లిపోయింది?
పంట చేను గట్టు మీద పైరగాలై పోయిందా..
అమ్మ పెట్టిన గోరింటాకులో.. చందమామై పోయిందా..

కారులొద్దు మేడలొద్దు
మిడిమేలపు పయనమొద్దు!
పొరుగు తెలియని బ్రతుకులొద్దు
కాలంతోటి పరుగులొద్దు!

అయ్యయ్యో
ఇప్పుడెలా...ఎక్కడని వెతకను?
చుక్కల పరదా చాటునా...మబ్బుల పల్లకి లోనా...
విరజాజి పరిమళంలోనా..సెలయేటి గలగలల్లోనా...

మీక్కనిపిస్తే  కాస్త జాడ చెప్పరూ...
ఎక్కడున్నా తెచ్చుకుంటా!
నా బాల్యాన్ని గుండెల్లో దాచుకుంటా!
చందమామ సాక్షిగా...వెన్నెలమ్మ మీదొట్టు!

తొలి ప్రచురణ తెలుగు నాడిలో.....

4 comments:

  1. ఒకటే మాట ఊహు..కాదు..రెండు....బాల్యం లాగే అద్భుతమైనదీ, అమూల్యమైనదీ.

    ReplyDelete
  2. ధన్యవాదాలు సుధ గారూ....

    ReplyDelete
  3. ఇది చదువుతుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.. సాయంత్రం ఏడు దాటగానే ఉరి బయటకు వెళ్ళేవాళ్ళం.. నేను మా జీతం చేసే వారి అబ్బాయి.. ఇద్దరం కలిసి అల వెళ్లి రాత్రి మిణుగురు పురుగులు పట్టుకొని వచ్చేవాళ్ళం వాటిని చూసుకొంటూ రాత్రి ఎప్పుడు నిడురపోఎవాదినో తెలియదు..ఆరోజులు మల్లి వస్తే ఎంతబాగుండునో కదా...

    ReplyDelete
  4. తెలుగు పాటలు గారూ మిణుగురు పురుగులు చీకట్లో భలే ఉంటాయి కదూ. బావున్నాయండీ మీ చిన్నప్పటి కబుర్లు..ఆ రోజులు మళ్ళీ రావాలంటే చిన్నపిల్లలతో స్నేహం చెయ్యడమే..ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.