ఆకాశమంతా చాలా కోలాహలంగా వుంది. సూర్యుడు, చెంద్రుడు, మేఘాలు, నక్షత్రాలు, మెరుపులు అన్నీ కొలువు తీరి వున్నాయి. ఓ మేఘం చాలా కోపంగా కనిపించింది. మేఘం ఆగ్రహానికి కారణమేమిటని నెలరాజు ప్రశ్నించగా 'సమస్త చరాచర జగత్తుకి మన ఉనికి ఎంతో అవసరం కదా! అలా టి మనల్ని మానవుడు పూర్తిగా పట్టించుకోవడం మానివేశాడు' అని మేఘం సమాధాన మిచ్చింది. అయితే మనమందరం మన మన ప్రయత్నాలు చేద్దాం. ఈ మనుష్యులకు మరో అవకాశం ఇద్దాం, అంతే కాదు ఎవరు మనుషులను తమ వైపు తి ప్పుకుంటారో వారే గొప్ప అని కూడా తీర్మానించుకున్నాయి.
*************
ఉదయాన్నే బాలభానుడు నులి వెచ్చని కిరణాలతో ఆకాశమంతా రంగులమయం చే శాడు. వినీలాకాసం వింత కాంతులతో కన్నుల పండువగా వుంది కాని మనుష్యులేవరూ అసలు పైకే చూడలేదు. చిన్నబుచ్చుకున్న సూర్యుడు మేఘం చాటున దాక్కున్నాడు. మేఘం గర్వంగా ఓ నవ్వు నవ్వి రకరకాల ఆకృతులతో ఆకాశంలో బొమ్మల కొలువు పెట్టింది. ఏ మనిషీ కనీసం తల కూడా తిప్పలేదు.
మేఘాన్ని, సూర్యుడిని చూసి మల్లెలూ, మందారాలు విరగబడి నవ్వాయి. గర్వభంగమైన మేఘం నీలం గా మారి ఓ ఉరుము ఉరిమింది. కోపజ్వాల మెరుపై మెరిసింది. ఆ ఉరుము, మెరుపుల కొలహలానికి మనుష్యులు హడావిడిగా ఇళ్ళకు చేరాలని తొందర పడ్డారు కాని. ఆ నీలి మేఘాల సొగసులని మెరుపుల సోయగాన్ని చూద్దమనైనా అనుకోలేదు.
చల్లగాలి మేఘాన్ని చూసి జాలిపడి స్వాంతన వచనాలు పలికి సాయం చేద్దామని బలంగా వీచింది. కిటికీలు బిగించుకున్నారు తప్ప ఆ సందడికీ ఎవరూ స్పందించలేదు. వర్షం ఫక్కున నవ్వుతూ మీ అందరివల్లా కాదు చూడండి మనుష్యలకి నీళ్ళంటే ప్రాణం ఇప్పుడు చూడండి ఎలా పరవశించి పోతారో అంటూ ఝల్లు ఝల్లున కురవడం మొదలెట్టింది. తమ పనులకు అడ్డం వచ్చిందని విసుక్కుంటూ తలుపులు బిగిచుకుని TV ల ముందు కూర్చున్నారు. చిన్నబుచ్చుకున్న వర్షం టక్కున నిలిచి పోయింది.
స్టార్ సేరెమొనీ అట. మీ అందర్నీ పట్టించుకోని మనుష్యులు మా కోసం విందులు వినోదాలు ఏర్పాటు చేశారు వెళ్లి వచ్చి మీకు విశేషాలు చెప్తామని చుక్కలన్నీ సింగారించుకుని ఆ రాత్రి మరింత ప్రకాశవంతంగా ఆకాశంలొ అందంగా మెరిసి పోతున్నాయి. మనుషులు చాలామంది వస్తున్నారు. అంతా సందడి సందడిగా వుంది. చుక్కలన్నీ ముసిముసి నవ్వులతో మురిసి పోతున్నాయి. చల్లని సాయంత్రం కరగి రాత్రయింది. ఎవరూ ఆకాశం వైపు కన్నెత్తైన చూడలేదు. సరికదా అర్ధం కాని చెవులు హోరిత్తించే సంగీతాన్ని భరించలేని చుక్కలన్నీ వెలవెల పోయాయి.
ఇలా కాదు ఏక నా ప్రతాపం చూపిస్తాను. మనుష్యుల౦దరకూ నేనంటే ప్రత్యేక మైన ఇష్ట౦ . 'నెలారాజా వెన్నెలరాజా' అంటూ నా మీద మధురమైన పాటలు వ్రాసారు. అంటూ నిండు జాబిలి పున్నమి వెలుగులతో ప్రత్యక్ష మైంది. అసలు మనుష్యులకు అమావాశ్య ఎప్పుడో, పౌర్ణమి ఎప్పుడో చూసే తీరికే లేదని చంద్రుడికి తెలియదు పాపం. ఎవరూ పట్టించుకోని చెంద్రుడు పాపం రోజు రోజుకూ చిక్కిశల్యమై ఆకాశంలో అవసాన దశకు చేరాడు.
ఇదంతా చూసిన పుడమి ఇక భరించలేక తన స్నేహితుల భాదలను గమనించి కదలి పోయింది. సముద్రుడు విలయ తాండవం చేసాడు. ప్రపంచమంతా జలమయం. సూర్యుడు, చెంద్రుడు, చుక్కలు, మేఘాలు, మెరుపులు, ఏవీ లేవు ఎటుచూసినా నీరే. ప్రపంచమంతా నీళ్ళల్లో మునిగి పోతో౦ది.
*****************
ఉలిక్కి పడి నిద్ర లేచాడు ప్రకాష్. భావన ప్రక్కనే నిద్ర పోతుంది. తలుపు తెరిచి బయటకు వచ్చాడు. పక్షుల కిల కిలా రావాల నేపద్యం లో ఓ గులాబి నవ్వుతూ తల ఊపింది. పచ్చని గరిక మీద మెరుస్తున్న మంచు బిందువులు, చిరుగాలికి వుగిసలాడే చివురాకులు. నీలకాశ౦లో వెండి మబ్బులకు బంగారు పూత వేస్తున్న కిరణాలు, గుంపులుగా ఎగురుతున్న పక్షుల సోయగం కనిపించాయి. ఇంత అద్బుత సోయగానికి చిత్తరువై అలోకికమైన అందాన్ని చవిచూచాడు.
మనషి కూడా ప్రకృతిలో భాగమేనని తనకు వచ్చిన కలని గుర్తు చేసికుంటూ, ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని తన కుటుంబంతో పంచుకోవడాని ఓ అడుగు ముందుకు వేసాడు.
తొలి ప్రచురణ వాహినిలో....
తొలి ప్రచురణ వాహినిలో....
జ్యోతిర్మయిగారు,
ReplyDeleteనా బ్లాగుకి వచ్చి వ్యాఖ్యతో పలకరించకపోతే...ఎంత అద్భుతమైన రచనని చదవకుండా ఉండేదాన్నోకదా...ప్రతి ఉదయం, రాత్రి అద్భుతమైన అందాలను ఆవిష్కరిస్తూ మన చుట్టూ ఉంటున్నా దానిలో భాగంగానే ఉంటున్నా ఆ ప్రకృతిన ఉనికిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఎన్ని అనుభూతులను దూరం చేసుకుంటున్నామో..చెప్పకనే చెప్పిన విధానం ఎంతో బావుంది.
సుధ గారూ,
ReplyDeleteనా మొదటి చుట్టం మీరే నండోయ్. మీ వ్యాఖ్య చూడగానే ఎంత సంబరపడ్డానో ...కథ నచ్చి౦దన్నందుకు ధన్యవాదాలు.
ఇప్పుడే చదివానండీ.. చాలా బాగుంది
ReplyDeleteశుభా ఎప్పుడో వ్రాసిన కథ..వెనక్కు వెళ్లి మారీ చదివారన్నమాట. ధన్యవాదాలు
ReplyDeleteఇలా ప్రకృతిని అందంగా వర్ణించడాలూ అవీ ఎలా వస్తాయో, నాకు చదవడం భలే ఇష్టం..కానీ వ్రాద్దామనుకుంటేనే కష్టం(నాకు కాదండీ చదివే వాళ్ళకి!!)
ReplyDeleteఎన్నెల గారూ..అనుకొని వేళ వచ్చారు. స్వాగతం. నిజం చెప్పమంటారా? నాక్కూడా తెలియదండీ..ధన్యవాదాలు.
ReplyDeleteప్రకృతి గురించి బలే రాశారు అండి
ReplyDeleteతెలుగు పాటలు గారూ...మనం కూడా ప్రకృతిలో ఒక భాగం. ఈ రోజుల్లో ఆ స్పృహ లేకుండా బ్రతికేస్తున్నాం అనిపిస్తుంది. ఇది నా తొలి కథా ప్రయత్నం. ధన్యవాదాలు.
ReplyDeleteరూపాయలు, డాలర్ల వెంట పరిగెడుతున్న జనానికి, ఇక ప్రకృతిలోని అందాలను ఆస్వాదించడానికి టైం ఎక్కడుంది జ్యోతిర్మయి గారు..మనం కథల్లో రాసుకొని ఇలా పంచుకోవడం తప్ప. నిన్ననే మా పిల్లలను టెర్రస్ మీదకు తీసుకెళ్ళి, అప్పుడే పైకి ఎగబాకుతూ వెన్నలను ప్రసరింప చేస్తున్న నిండు చందమామను చూపించాను. తన్మయత్వానికి లోనయ్యారు వారు. చాలా బాగా వ్రాసారు. మీలాంటి ప్రకృతి ఆరాధకులను బ్లాగులోనైనా కలసినందుకు సంతోషిస్తున్నాను. ప్రకృతి మీద నేను వ్రాసిని కథ "అందరూ బాగుండాలి!" ఆంధ్రభూమిలో ప్రచురింపబడింది. నా బ్లాగులో అదే నా మొదటి పోస్ట్ కూడా. వీలైతే చదవండి.
ReplyDeleteసురేష్ గారూ మిమ్మల్ని కలసినందుకు నాకూ చాలా సంతోషంగా ఉందండీ..మీ కథ తప్పకుండా చదువుతాను. అమెరికాలో ఉన్న వాళ్ళు ప్రకృతిలో గడపడం కొంతవరకూ ఫరవాలేదేమో..ఇండియాలో నగరాలలో ఉన్నవాళ్ళనుండే..ప్రకృతి చాలా దూరంగా పారిపోయింది.
ReplyDeleteధన్యవాదాలు.
మీ తరంలో పుస్తకాలు , నవలలు , ఇంకా ఇంటి కాడ పెద్దవాళ్ళు , చుట్టూ అందరితో కబుర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో గమ్మతైన కథలు మీ వరకు చేరేవి .....
ReplyDeleteకానీ మా తరానికి...అబ్బో!... వాటిలో కొన్నింటి స్థానాన్ని ఇలా బ్లాగులు భర్తీ చెయ్యడం చూస్తుంటే చాలా ఆనందంగా వుంది .
ముని రాజా గారు...మీరు చెప్పింది అక్షరాలా నిజమేనండి. థాంక్యు.
Delete