గున్న మావి కొమ్మల్లోన కోయిలమ్మ రాగాలు
పంటచేల దారుల్లోన పైరగాలి సరాగాలు!
సందె గాలిలో తేలియాడే సన్నజాజి పరిమళాలు
పైరు నిండుగ విరగబూసే బంతిపూల సోయగాలు!
అరుణారుణ సమయాన వెనుతిరిగే గోమాతలు
మర్రిచెట్టు ఊడలతో ఆటలాడే మర్కటాలు!
కార్తీకాన చెరువుల్లో ప్రాతఃకాల దీపాలు
పుష్య మాస వేకువల్లో వెల్లి విరిసేటి రంగవల్లులు!
ఎదురొచ్చి పలకరించే అమ్మమ్మల అనురాగాలు
ఎనలేని ప్రేమగల తాతయ్యల ముద్దుమురిపాలు!
ఇలా ఎంత చెప్పినా తరగవు
మా వూరి ముచ్చట్లు!!
పంటచేల దారుల్లోన పైరగాలి సరాగాలు!
సందె గాలిలో తేలియాడే సన్నజాజి పరిమళాలు
పైరు నిండుగ విరగబూసే బంతిపూల సోయగాలు!
కొండ మీద గుడిలోన జే గంటల సవ్వడులు
చెరువు కింద వాగులోన బాల కృష్ణుల కేరింతలు!
చెరువు కింద వాగులోన బాల కృష్ణుల కేరింతలు!
అరుణారుణ సమయాన వెనుతిరిగే గోమాతలు
మర్రిచెట్టు ఊడలతో ఆటలాడే మర్కటాలు!
కార్తీకాన చెరువుల్లో ప్రాతఃకాల దీపాలు
పుష్య మాస వేకువల్లో వెల్లి విరిసేటి రంగవల్లులు!
ఎదురొచ్చి పలకరించే అమ్మమ్మల అనురాగాలు
ఎనలేని ప్రేమగల తాతయ్యల ముద్దుమురిపాలు!
ఇలా ఎంత చెప్పినా తరగవు
మా వూరి ముచ్చట్లు!!
మావముచ్చట్లు, ఊరిముచ్చట్లు బాగున్నాయండీ.
ReplyDeleteఊరిముచ్చట్లు బాగున్నాయండీ.
ReplyDeleteఊరిముచ్చట్లు బాగున్నాయండీ.
ReplyDeleteమందాకినీ గారూ, జాన్ హైడ్ గారూ థాంక్స్ అండి.
ReplyDeleteచక్కగా అక్షరాలు మలుస్తున్నారు...keep it up.
ReplyDeleteఅహా...చాలా బాగా రాసారు. మీ ఊరితో పాటూ మా ఊరు కూడా గుర్తుకు వచ్చేసింది.
ReplyDelete@ శశి కళ గారూ మీ ప్రోత్సాహ౦, కొత్త ఉత్సాహం నింపుతుంది.
ReplyDelete@శ్రీ గారూ..ఊరు జ్ఞాపకం ఎప్పుడూ మధురంగా ఉంటుంది కదూ..
మీ వ్యాఖ్యానానికి ధన్యవాదాలు.
జ్యోతిర్మయి గారూ,
ReplyDeleteమీరు రాసే విధానం,వర్ణన చాలా బాగుందండి
మాధవిగారూ..ధన్యవాదాలు
ReplyDeleteపల్లెను బాగా వర్ణించారు.
ReplyDeleteబ్లాగ్ అంతా చదువుతున్నట్లున్నారే...ధన్యవాదాలు రవిశేఖర్ గారూ..
ReplyDeletewoooowwwwww... very nice :)
ReplyDeleteహర్ష గారూ మా వూరి ముచ్చట్లు మీకు బాగా నచ్చాయన్నమాట. ధన్యవాదాలండీ..
Delete