Sunday, September 25, 2011

మధురస్మృతులు


ఎన్నాళ్ళుగానో వేచిన తరుణం
సత్యమవుతున్న సుందరస్వప్నం!

మధురమైన ఊహలు....తరగిపోని ఊసులు
పసిపాప నవ్వులతో....కలల కలవరింతలు!

కనుల ఎదుట కలలపంట
సుమధురయానం మనదేనట!
     
          * * * * *
ఎంత ఆశ్చర్యం....
ఎలా వెళ్ళిపోయింది ఈ ఐదేళ్ళ కాలం!

బోసినవ్వుల్ని దాచుకోలేదు...
బుడి బుడి నడకల గురుతులే లేవు!

చిన్నారి పలుకుల్ని తనివి తీరా విననే లేదు,
అక్షరాలు దిద్దించనే లేదు!

చందమామ కధలు చెప్పనే లేదు..
వెన్నెల్లో పాలబువ్వలు కొసరనే లేదు!

ఉరుకులు పరుగుల జీవిత౦లో...
ఏవీ మధురస్మృతుల ఆనవాళ్ళు?

3 comments:

  1. Mi kavita Bagundhi...Jeevitam ante gnapakalu korikalu ninna oka madhurasmruthi repu oka asha, gnapakalu dasuko anubhavalu guthuchuko repati vijayam neede

    ReplyDelete
  2. చాలా చాలా బావుందండి. నిజంగా ఈ నాటి అమ్మ కి బహుశా మధుర స్మృతులు మిగలటం లేదేమో ఉరుకుల పరుగుల జీవితంలో.

    ReplyDelete
  3. తెలుగు పాటలు గారూ థాంక్ యు..
    సుభ గారూ...మిగుల్చుకోవాలని నా కోరిక...థాంక్ యు

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.