Friday, September 2, 2011

చేజారిన స్వప్నం


ఆనవాలు కోసం ...అంతులేని ఆరాటం
నేనడచిన దారి... నన్ను విస్మరించింది
ముక్కలైన నమ్మకం...మంటలు రేపుతోంది!!

మాధుర్యం..మమత...స్వరూప౦ శూన్యం 
స్మృతులన్నీ..చెదల పాలయ్యాయి
ముసుగు తీసిన మమకారం...వికటాట్టహాసం చేస్తోంది!

జీవనయానంలో ..అనుక్షణం 
ఆస్థిత్వానికై... అన్వేషణ
గుట్టలుగా దొరికిన నిరాశా శిధిలాలు!

చేజారిన స్వప్నం..దిగులు పాట పాడింది 
భారమైన కాలం.. మౌనానికి నేస్తమైంది!!

తొలి ప్రచురణ 

4 comments:

  1. మధుర గారూ నా బ్లాగ్ తొలి నెచ్చెలి మీరే.
    Thank you..

    ReplyDelete
  2. కొన్ని మనకు వెంటనే ప్రతిఫలం ఇవ్వకపోయినా.. ఎప్పుడో వాటివిలువ తెలుస్తుంది.. ఆరోజు మనకు కలిగిన సంతోషం మాటలలో చెప్పలేము..

    ReplyDelete
  3. తెలుగు పాటలు గారూ జీవితంలో ఎదురు చూడని కొన్ని సంఘటనలు అలా పలికించాయి. ఇప్పుడు ఆ పలుకులే ఆత్మీయుల్ని పరిచయం చేశాయి. ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.