Friday, October 14, 2011

"వెళ్ళాలని వుంది కానీ...."

అమెరికాలో ఉన్న తెలుగు వారు, అమెరికా వచ్చిన దగ్గరనుండి ఇండియా 'వెళ్ళాలని ఉంది కానీ..' అంటూ ఉంటారు. మరి వాళ్ళు ఇండియా వెళ్ళకుండా ఎందుకు ఉండిపోయారో వాళ్ళనాపేసిన కారణాలేంటో వాళ్లనే అడిగి తెలుసుకుందామా..(ఇది సరదా సరదా నాటిక ఎవర్నీ ఉద్దేసించి వేసినది కాదు)

వెళ్ళాలని ఉంది కానీ...1

వెళ్లాలని ఉంది కానీ...2

3 comments:

  1. హహహ నాకు ఆఖరిలో వచ్చిన ఆవిడ వేషధారణ, మాట తీరు అబ్బబ్బబ్బో ఎంత నచ్చేశాయో! అవోకార్డోతో కారం కారంగా ఆవకాయ సూపరు ఐడియా కదూ!

    ReplyDelete
  2. బాగుందండీ.. కానీ కొంచెం స్పీడ్ ఉండాలి. డైలాగ్స్ చాలా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపించింది. సొ ఆ ఫీల్ రాకుండా చూస్కోవాలి. లాస్ట్ లో వచ్చిన సీమ జేన్ కి కూడా డైలాగ్స్ లో స్పీడ్ ఉంటే అదిరిపోయేది. మొత్తానికి ఏవేవో కారణాలతో ఇండియా ని వదిలేస్తున్నారన్నమాట. దర్శకత్వం కూడా ఒ.కె అనిపించింది. కానీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కాబట్టి మిమ్మల్ని తప్పని సరిగా అభినందిచాల్సిందే. మంచి ప్రయత్నం. Keep it up and All the best.

    ReplyDelete
  3. @ రసజ్ఞ గారూ మీకు నాటిక బాగా నచ్చినట్లు౦దండీ..ఆ ఆఖరలో వచ్చిన అమ్మాయికి 'మీరు బాగా నచ్చేసారట' అని మీ మాటగా చెపుతానులెండి. పనిలో పని అవకాడోతో ఆవకాయ్ రెసిపీ కూడా అడిగేద్దాం. Thank you so much.

    @ సుభ గారూ మీ సలహా తప్పకుండా పాటిస్తాము. స్టేజి మీద చూసినప్పుడు నాటిక వేరుగా ఉంటుంది. నచ్చిన ప్రతి వాక్యం దగ్గరా ప్రేక్షకుల స్పందన చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నాటికలో నటించిన వారిలో ఎక్కువమందికి తొలి అనుభవం. కాని చాలా చక్కగా నటించారు. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.