Saturday, October 1, 2011

కౌముదిలో నా కవిత 'ఎడబాటు'


ఈ దారిలోనే కదూ నా చిన్నారి
బుల్లి బుల్లి అడుగులతో పరుగులు తీసింది!
అదిగో ఆ తోటలోనే మునుపెన్నడో
ఊయల ఊగిన సందడి!

ముచ్చటైన సైకిలును చూసి
మోమున మెరిసిన సంతోషం!
చారడేసి కళ్ళతో బెంగగా
స్కూలుకు వెళ్ళిన వైనం!

శాంతాతో ఫోటోలు, జింజెర్ బ్రెడ్ హౌసులు,
హాలోవీన్ డ్రస్సులు, ఈస్టర్ ఎగ్ హంట్లు,
కోరస్ పాటలు, టెన్నిస్ ఆటలు
ఓహ్! ఎన్నెన్నో!
అవన్నీ నిన్న మొన్నలా లేదూ!

ప్రతి మలుపులో వేలు పట్టుకుని నడిపించాను!
మలుపులన్నీ దాటి చూద్దును కదా
ఆ చివర మలుపు తిరుగుతూ
ప్రగతి పథంలో తాను!

తన జ్ఞాపకాల బాసటగా
ఈ చివర నేను!

నా కవిత 'కౌముది'ఇంటర్నెట్ మాసపత్రిక 'అక్టోబర్ 'సంచికలో ప్రచురితమైంది.

నా కవితను ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను.

10 comments:

  1. Very nice Jyothi gaaru.. kavitha publish cheyabadinaduku hearty congrats.

    ReplyDelete
  2. చాలా బాగా చెప్పారు.నీ జ్ఞాపకాల బాసటగా
    ఈ చివర నేను!! chaalaa baagundi. abhinandanalu jyotirmayi garu.

    ReplyDelete
  3. @సుభ గారూ.. నా కవితను మెచ్చుకోవడమే కాకుండా బాపు బొమ్మను బహుమతిగా ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు.

    @వనజగారూ..థాంక్స్ అండి.

    ReplyDelete
  4. jyothi
    oka adbhutam anipistomdi
    kavitalanni goppagaa vunnaayi
    nenu garvistunnaanu intagaa nuvvu edigi poyinanduku
    ilaage munduku nadavaalaNI AASISTUNNAANU
    naanna

    ReplyDelete
  5. నాన్నా నీ వాఖ్యలో నా మీదున్న ప్రేమ కనిపిస్తు౦ది. నాకు తోచింది వ్రాసుకు పోతున్నాను తప్ప అందులో గొప్పతనమేమీ లేదు. బ్లాగు చూసి వ్యాఖ్య పెట్టిందుకు చాలా సంతోషంగా ఉంది.

    ReplyDelete
  6. పిల్లల గురించిన మీ టపాలు ఒకటొకటే చదువుతూ సంతృప్తితో వెనక్కి వెళ్ళిపోతున్నాను.
    మీ నాన్న గారి వ్యాఖ్య పట్టుకుని ఈ టపాకి వచ్చి చూద్దును కదా,
    చదువుతూ, చదువుతూ ఏదో భావావేశానికి లోనైపోయాను.
    "ప్రతి మలుపులో నీ వేలు పట్టుకుని నడిపించాను!
    మలుపులన్నీ దాటి చూద్దును కదా...
    ఆ చివర... మలుపు తిరుగుతూ.....
    ప్రగతి పధంలో నీవు!!"
    ఇది చదివి ఇంక ఏదో ఒకటి చెప్పకుండా ఉండలేక ఈ వ్యాఖ్య.
    బలే వ్యక్తీకరించారు.

    ReplyDelete
  7. ప్రతి మలుపులో నీ వేలు పట్టుకుని నడిపించాను!
    మలుపులన్నీ దాటి చూద్దును కదా...
    ఆ చివర... మలుపు తిరుగుతూ.....
    ప్రగతి పధంలో నీవు!!

    నీ జ్ఞాపకాల బాసటగా
    ఈ చివర నేను!!
    ఇక్కడకి వచ్చేసరికి కళ్ళు చెమర్చాయి.
    మీకు అభినందనలు.

    ReplyDelete
  8. @ లలితగారూ మీరు 'ఒక్కక్క టపా చూసి సంతృప్తిగా వెనక్కి వెళ్లిపోతున్నా'నన్నారు కదా ఆ ఒక్క మాట చాలండీ.. భావ వ్యక్తీకరణ నా కవితలో కన్నా మీ వ్యాఖ్యలో బాగా కనిపించింది. మీ వ్యాఖ్య నాకు జీవిత౦లో మరిచిపోలేని అనుభూతిని ప్రసాదించింది. ధన్యవాదాలు లలితగారూ..

    @ శైల గారూ నా కవిత చదివి మీ అనుభూతిని నాతో పంచుకున్నందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete
  9. ఆ చివర... మలుపు తిరుగుతూ.....
    ప్రగతి పధంలో నీవు!!
    నీ జ్ఞాపకాల బాసటగా
    ఈ చివర నేను
    --------------------

    చాలా బావుంది జ్యోతిర్మయి గారూ. ఓ ప్రక్క సంతోషం, మరో ప్రక్క దిగులు. తప్పించుకోలేని, తప్పించుకోరాని క్షణాలు. Wish I knew this before, I could've been kind to my parents.

    ReplyDelete
    Replies
    1. నేనూ కూడానండి పద్మవల్లి గారు. థాంక్ యు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.